NNS March 14th Episode: మిస్సమ్మనే ఆర్జే భాగీ అని అందరికీ చెప్పేసిన అమర్.. షాక్లో మనోహరి!
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 14వ తేది ఎపిసోడ్‌లో అరుంధతిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు రామ్మూర్తి. తర్వాత మీకు ఈ ఇంటికి ఏంటీ సంబంధం అని అమర్ ప్రశ్నిస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam March 14th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 14th March Episode) అరుంధతి ఫోటో చూస్తూ నిలబడిపోతాడు రామ్మూర్తి. ఏమైంది తాతయ్య ఎందుకు అమ్మ ఫోటో అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది అంజలి. ఏమైందండీ తనను అలా చూస్తున్నారెందుకు అంటాడు అమర్. ఏమీ లేదు బాబు ఈ అమ్మాయిని చూస్తుంటే తెలిసిన అమ్మాయిల అనిపించింది అంటాడు రామ్మూర్తి.
ఏడుస్తూ వచ్చిన రామ్మూర్తి
తను బ్రతికున్నప్పుడు ఎప్పుడైనా కలిసారా అంటాడు అమర్. నేనెప్పుడూ కలవలేదు బాబు తనని చూస్తూ ఉంటే అచ్చం తెలిసిన అమ్మాయిలాగే ఉంది నేను బయట ఉంటాను అంటూ ఏడుస్తూ వెళ్లిపోతాడు రామ్మూర్తి. నాన్నని ఇక్కడే ఉండమన్నాను ఎక్కడికి వెళ్లాడు అని భాగమతి చూస్తూ ఉండగా రామ్మూర్తి ఏడుస్తూ అమరేంద్ర గదిలో నుంచి వస్తూ కనిపిస్తాడు. నాన్న ఎందుకు సార్ రూమ్ లో నుంచి ఏడుస్తూ వస్తున్నాడు అని భాగమతి వెళ్లి అడుగుతుంది.
ఈ ఇంటి దీపాన్ని ఈ ఇంటి ఆనందాన్ని తనతో పాటే తీసుకువెళ్లిన ఈ ఇంటి బంగారు తల్లిని నేను చూశానమ్మా అని రామ్మూర్తి బాధపడతాడు. ఆవిడని నేను ఎన్నోసార్లు చూద్దామనుకున్నాను నాన్న. కానీ ఎప్పుడూ చూడలేకపోయాను అంటుంది భాగమతి. నేను ఆయనని చూసినప్పుడల్లా ఏదో తెలిసిన వాడిలా అనిపించింది. కానీ ఆయన కూడా అలాగే అనిపిస్తుందా ఎందుకిలా అనిపిస్తుంది ఆయనకి నాకు ఏంటి సంబంధం అని అరుంధతి అనుకుంటుంది.
మనకు ఏంటీ సంబంధం
భాగీ ఆ అమ్మాయి అచ్చం మీ అమ్మలాగే ఉందమ్మా అంటాడు రామ్మూర్తి. ఆవిడ అమ్మ లాగా ఉండడమేంటి నాన్న అంటుంది భాగమతి. అ ముక్కు మొహం అచ్చు మీ అమ్మలాగే ఉందమ్మా తనని చూస్తూ ఉంటే తనకి మనకి ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ ఇంటికి మనకి ఏంటి నాన్న సంబంధం ఆవిడకి మనకి ఏంటి సంబంధం వీళ్లు మన మీద ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నారు మనం ఎందుకు వాళ్ల మీద అభిమానం చూపిస్తున్నాం మనందరినీ ఒకే దగ్గరికి ఆ భగవంతుడు ఎందుకు చేర్చాడో అర్థం కావట్లేదు నాన్న అంటుంది భాగమతి.
అందరం అన్నం తిందాం రండి అని నిర్మల పిలుస్తుంది. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మిస్సమ్మ నువ్వు కూడా కూర్చొని తిను అంటుంది నిర్మల. మనోహరి నువ్వు కూడా కూర్చో అంటాడు అమర్. నేను ఉపవాసం చేస్తున్న అమర్ మన పెళ్లిలో ఏదో దోషాలు ఉన్నాయంట అవి తగ్గిపోవాలని ఉపవాసం ఉంటున్నాను అంటుంది మనోహరి. అందరూ బాధపడుతూ ఉంటారు. మీ బాధని భయంగా మార్చి మీ అందరిని దూరం చేసి నేను అమర్ సంతోషంగా ఉంటాం అని అనుకుంటుంది మనోహరి.
నేనేదో తప్పు చేసినట్లు ఉంది
రామ్మూర్తి అన్నం తినకుండా బాధపడుతూ ఉంటాడు. ఏమైందండీ ఎందుకలా ఉన్నారు అని అంటాడు అమర్. ఆ బంగారు తల్లిని చూసినప్పటినుంచి నా మనసు బాగోలేదు బాబు తన కళ్లు నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. తను నన్ను ఏదో అడగాలనుకున్నట్టు అనిపిస్తుంది. తన కళ్లని చూస్తుంటే నేను సమాధానం చెప్పాలి ఏమో నేనేదో తప్పు చేశానా అనిపిస్తుంది అని రామ్మూర్తి బాధపడతాడు. నిజం తెలిసిపోతుందా ఏంటి అని అనుకున్న మనోహరి, అమర్ ఇప్పుడు ఆయనకి అరుంధతి ఫోటో ఎందుకు చూపించావు అని మనోహరి అడుగుతుంది.
ఎందుకు చూపించకూడదు మనోహరి అంటాడు అమర్. అంటే ఆ ఫోటో చూస్తే నువ్వు పిల్లలు బాధపడతారు కదా అంటుంది మనోహరి. వాళ్లు బాధపడతారని కాదు వాళ్లని ఆమెకు దూరం చేసి నువ్వు దగ్గర కావాలనుకుంటున్నావ్ నేను ఎలా అతనికి దగ్గర కానిస్తాను. ఈ ఇంటికి కోడలు కాకుండా చేస్తాను చూస్తూ ఉండు అనుకుంటుంది భాగమతి.
తనను మర్చిపోతే కదా
తనను మర్చిపోతే కదా మనోహరి బాధపడకుండా ఉండడానికి తను నా జ్ఞాపకం కాదు తనే నా జీవితం నా బాధ్యతని కూడా తనే తీసుకొని ఈ కుటుంబాన్ని నడిపేది నాకు ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసుకునేది అయినా నేను తనని మర్చిపోవడం అంటూ జరిగితే నా ఊపిరి ఆగిపోతుంది అని అమర్ భోజనం చేయకుండానే వెళ్లిపోతాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అందరూ భోజనం చేయండి అంటుంది నిర్మల.
అమ్మ భాగీ.. సార్ నన్ను ఎందుకు రమ్మన్నాడో చెప్పనేలేదు అంటాడు రామ్మూర్తి. భోజనం చేశాక అడుగుదాం లే నాన్న అంటుంది భాగమతి. అమ్మగారు అమరేంద్రయ్యగారు మిస్సమ్మ వాళ్ల నాన్నని ఎందుకు రమ్మన్నాడంటావు అంటుంది నీల. అది అర్థం కాకనే కదే చస్తున్నాను అంటుంది మనోహరి. సార్ నాన్నని ఎందుకు రమ్మన్నారు చెప్పనేలేదు అని భాగమతి అడుగుతుంది. నీకు ఈ ఇంటికి ఏంటి సంబంధం ఏంటి మిస్సమ్మ నువ్వు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని వచ్చావు అని అడుగుతాడు అమర్.
ఇంటికి సంబంధం ఉంది
పోనీ మీరైనా చెప్పండి రామ్మూర్తి గారు అంటాడు. నేను ఇక్కడ పని చేస్తున్నాను కదా సార్ ఆ సంబంధం ఉంది అందుకే వచ్చాను అంటుంది భాగమతి. కాదు మిస్సమ్మ నీకు ఈ ఇంటికి సంబంధం ఉంది అంటాడు అమర్. అసలు అమర్ ఏం చెప్పబోతున్నాడు? కొడైకెనాల్ నుంచి తనకు ఫోన్ చేసేది అమర్ భార్య అరుంధతి అని భాగీకి తెలియనుందా? అనే విషయాలు తెలియాలంటే మార్చి 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్