NNS March 7th Episode: పెళ్లి చేసుకుంటానని మనోహరికి మాటిచ్చిన అమర్​.. షాక్ అయిన పిల్లలు, భాగమతి ఏం చేస్తుంది?-nindu noorella saavasam march 7th episode amar promise to manohari about marriage nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns March 7th Episode: పెళ్లి చేసుకుంటానని మనోహరికి మాటిచ్చిన అమర్​.. షాక్ అయిన పిల్లలు, భాగమతి ఏం చేస్తుంది?

NNS March 7th Episode: పెళ్లి చేసుకుంటానని మనోహరికి మాటిచ్చిన అమర్​.. షాక్ అయిన పిల్లలు, భాగమతి ఏం చేస్తుంది?

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 01:25 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్‌లో పిల్లలకు తల్లిగా, అమ్మానాన్నలకు కోడలిగా వస్తావ్ కానీ, నాకు భార్యవు కాలేవు అని అమర్ అంటాడు. తర్వాత మనోహరిని పెళ్లి చేసుకుంటానని అమర్ మాటిస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 7th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 7th March Episode) పోలీస్​ స్టేషన్‌లో టీవీలో అమర్​, మనోహరి వాళ్లని చూసి షాకవుతుంది భాగమతి. మనోహరి ప్లాన్ ఇదా అనుకుంటుంది భాగమతి. మను నీ ప్లాన్ ఇదా ప్రపంచం ముందు ఆయన తప్పు చేసిన వాడిలా నిలబెట్టావు కదే. నీ స్వార్థం కోసం ఆయనను బలి చేశావు కదే అని బాధపడుతుంది అరుంధతి. ఇంతలో పిల్లలు ఇంటికి వస్తారు.

yearly horoscope entry point

డాడీ తప్పు చేసినట్లు

పిల్లలు ఏంటి అలా ఉన్నారు. పిల్లలు టీవీగాని చూశారా. ఆయన గురించి తెలిసిపోయిందా అని అరుంధతి అనుకుంటుంది. నీలా.. పిల్లలని పైకి తీసుకెళ్లి భోజనం పెట్టు అని శివరామ్ అంటాడు. తాతయ్య అసలు ఏం జరిగింది డాడీ తప్పు చేసినట్టు మా స్కూల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు అంటుంది అమృత. స్కూల్లో మా పిల్లలందరూ స్కూల్ వదిలిపెట్టగానే మమ్మల్ని చూస్తూ వెళ్లిపోయారు ఎందుకు తాతయ్య. డాడీ తప్పు చేసిన వాడిలా మాట్లాడుకుంటున్నారు అంటాడు ఆకాష్.

ఏమీ లేదు నాన్న మీ నాన్న గురించి వాళ్లకి ఏం తెలుసురా అని శివరామ్ అంటూ ఉంటాడు. అయ్యో పిల్లలు మీ నాన్న తప్పు చేయలేదు రా అంతా ఆ మను వల్ల అంటుంది అరుంధతి. ఇంక వీళ్లు రాలేదేంటి అని అరుంధతి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అమరేంద్ర మనోహరి అక్కడికి వస్తారు. మనోహరి అమరేంద్ర ఇద్దరూ ఒకేసారి గడపలో అడుగు పెట్టబోతుంటారు. ఇంతలో అరుంధతి అక్కడికి వెళ్లి ఏం మను ఎందుకే ఆయనని ఇలా అందరి ముందు దోషిలా నిలబెట్టావ్ నీ స్వార్థం కోసం ఆయనను బలి చేస్తావా చెప్పు అని గట్టిగా అరుస్తుంది అరుంధతి.

ఎప్పుడూ తలదించుకోకు

ఆ శబ్దానికి మనోహరి బయటికి వెళ్లి నిలబడుతుంది. అమరేంద్ర తలవంచుకొని లోపలికి వెళుతూ ఉంటాడు. ఆగు అమర్ నిన్ను తలవంచుకునేలా పెంచలేదు వాళ్లేదో నోరు జారారని నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేశానికి చేసిన పని వాళ్లకేం తెలుసురా. వాళ్లు నోటికి వచ్చినట్టు అలాగే మాట్లాడతారు నువ్వేంటో మాకు తెలుసు నిన్ను అలా పెంచాను నువ్వెప్పుడూ తలదించుకోకు గర్వంగా తలెత్తుకొని ఉండాలి నువ్వేంటో మాకు తెలుసు అంటాడు శివరామ్.

నువ్వేమీ బాధపడకు అమర్ నువ్వేంటో ప్రపంచానికి తెలియకపోయినా మాకు తెలుసు రా అసలు ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు నువ్వేం బాధపడకు నాన్న అని నిర్మల అమరేంద్ర ని పట్టుకుని బాధపడుతుంది. రాథోడ్ త్వరగా పదండి నిజం చెప్పాలి లేదంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది అని భాగమతి అంటుంది. ఇంకొక పది నిమిషాల్లో అక్కడే ఉంటాం మిస్సమ్మ అంటాడు రాథోడ్. కట్ చేస్తే ఇదంతా నా వైపు తిప్పుకునేలా చేయాలి ఏంటి వీళ్లు నా గురించి ఏమైనా మాట్లాడట్లేదు అని నీలకి సైగ చేస్తుంది మనోహరి.

నిందపడకూడదని

అమ్మగారు మీ బ్యాగ్ ఇవ్వండి లోపల పెడతాను అంటుంది నీల. వద్దు నీల నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను ఇప్పటికీ జరిగిందంతా చాలు అమర్ కళ్లలోకి చూసి కూడా మాట్లాడలేకపోతున్నాను నేను ఇంట్లో ఉండలేను వెళ్లిపోతాను అని మనోహరి అంటుంది. వెళ్లిపోవే వెళ్లిపో పీడ విరగడవుతుంది అని అరుంధతి. అమ్మగారు గుళ్లో అలా అవమానం జరిగిన మొన్న పెళ్లి కొడుకు నోరు జారిన తను ఏమి మనసులో పెట్టుకోకుండా పిల్లలని అరుంధతి అమ్మగారు లాగానే చూసుకుంది ఇప్పుడు కూడా తనకేమవుతుందని ఆలోచించకుండా మీ మీద నిందపడకూడదని తను నలుగురిలో అలా చెప్పింది అంటుంది నీల.

అవును మనోహరి నువ్వు అలా ఎందుకు చెప్పావు. నాలుగు గోడల మధ్య చెప్పలేదు. అది ప్రపంచమంతా వినిపించింది నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని అందరి ముందు ఎందుకు చెప్పావు చెప్పు అని నిర్మల అడుగుతుంది. అలా అడగండి అత్తయ్య దాన్ని అని అరుంధతి అంటుంది. నువ్వేదో కావాలనే పగతో చేసావని అనటం లేదు. కానీ, దాని వెనుక ఏదో కారణం ఉంటుంది చెప్పు అని అడుగుతుంది నిర్మల. అమర్ కోసం చేశాను ఆంటీ. అమర్ నీ ఒక్క మాట అంటేనే తట్టుకోలేను అలాంటిది అతను తప్పు చేశాడని పోలీసులు అంటుంటే తట్టుకోలేక మాకు పెళ్లి జరగబోతుందని చెప్పాను. అంతేకానీ వేరే స్వార్థం ఏమీ లేదు ఆంటీ అంటుంది మనోహరి.

అదే చెబుదామని

అవును అమరేంద్ర మనోహరి అలా ఎందుకు చెప్పిందో నాకు తెలుసు అంటుంది అరుణ. అరుణ మేడం మీరు ఎందుకు వచ్చారు అంటుంది మనోహరి. నా పేరు అరుణ అండి సరస్వతి మేడం అసిస్టెంట్‌ని మీతో ఏదో మాట్లాడాలని చెప్పే రోజు నాకు చెప్పింది అంటుంది అరుణ. ఏం చెప్పింది సరస్వతి మేడం అని అడుగుతాడు అమర్​. అరుంధతి మనోహరి నా దగ్గరే పెరిగారు మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడడానికి మిమ్మల్ని కలవాలి అనుకుంది ఆ విషయం చెబుదామనే మీ దగ్గరికి వస్తూ ఉండగా ఆవిడకి అలా జరిగిపోయింది.

మీకు భార్య అవసరం లేకపోయినా ఆ పిల్లలకి తల్లి అవసరం ఉంది. మీ అమ్మానాన్నలకి కోడలు అవసరం ఉంది మీరు మనోహరి గారిని పెళ్లి చేసుకుంటే అరుంధతి ఆత్మ కూడా శాంతిస్తుంది. మనోహరి అలా ఎందుకు చెప్పిందో తెలియదు. కానీ అరుంధతి మనోహరి నోట ఆ మాట అనిపించినట్టు ఉంది. మీరు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలకి తల్లి ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ నిర్ణయం అరుంధతి కూడా సంతోషిస్తుంది అంటూ అరుణ వెళ్లిపోతుంది.

నాకు భార్యవి మాత్రం కాలేవు

అమర్ ఆవిడ మాటలు పట్టించుకోకు నేను ఇక్కడే ఉండి అవమానాలు పడలేను వెళ్లిపోతాను అని బ్యాగు తీసుకుంటుంది మనోహరి. మనోహరి నీకు జరిగిన అవమానాన్ని వెనుక్కు తీసుకురాలేను అలాగని నిన్ను పెళ్లి చేసుకొని అరుంధతి ప్లేస్‌లో నిన్ను ఊహించుకోలేను. నిన్ను పెళ్లి చేసుకుంటే పిల్లలకి తల్లొస్తుంది. మా అమ్మ నాన్నలకి కోడలు వస్తుంది. కానీ ఎప్పటికీ నా భార్యవి మాత్రం కాలేవు అంటాడు అమర్​. పిల్లలకి తల్లిని కావాలనుకున్నాను కానీ అరుంధతి ప్లేస్‌లో నీకు భార్యను కావాలనుకోలేదు అని అంటుంది మనోహరి.

ఇంతలో భాగమతి రాథోడ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే నీకు నాకు త్వరలోనే పెళ్లి అని అమరేంద్ర వెళ్లిపోతాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అరుంధతి గుండె ముక్కలు అయిపోతుంది. మనోహరి సంతోషిస్తుంది. అమర్​ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారా? పెళ్లి ఆపేందుకు పిల్లలు, భాగమతి ఏం చేయబోతున్నారు? అనే విషయాలు తెలియాలంటే మార్చి 8న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner