NNS January 29th Episode: అమర్​ కోసం మనోహరి కొత్త ప్లాన్​.. భాగమతికి బిగుసుకున్న ఉచ్చు-nindu noorella saavasam january 29th episode manohari new plan to married amar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 29th Episode: అమర్​ కోసం మనోహరి కొత్త ప్లాన్​.. భాగమతికి బిగుసుకున్న ఉచ్చు

NNS January 29th Episode: అమర్​ కోసం మనోహరి కొత్త ప్లాన్​.. భాగమతికి బిగుసుకున్న ఉచ్చు

Sanjiv Kumar HT Telugu

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 29వ తేది ఎపిసోడ్‌లో అమర్‌ను పెళ్లి చేసుకునేందుకు కొత్త ప్లాన్ వేస్తుంది మనోహరి. అందుకోసం ఆశ్రమంలోని సరస్వతి మేడమ్‌ను ఇంటికి వచ్చేలా చేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 29వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 29th January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 27th January Episode) అమర్​తో తన తండ్రి గురించి చెప్పాలని వెళ్తుంది మిస్సమ్మ. అప్పుడే తన పిన్ని ఫోన్​ చేయడంతో బయటకు వస్తుంది. రామ్మూర్తిని హాస్పిటల్లో జాయిన్​ చేస్తున్నామని చెప్పడంతో వెంటనే పరుగున బయల్దేరుతుంది మిస్సమ్మ. తను నాకు ఏదో చెప్పాలని వచ్చింది అది ఏంటో నీకు తెలుసా అని రాథోడ్ ని అడుగుతాడు అమర్.

రేపటితో పరిష్కారం

రాథోడ్ ఏం చెప్తే ఏం కోప్పడతారో అని నాకు ఏమీ తెలియదు సార్ అని చెప్తాడు. తను ఎప్పుడు చెప్పాలని నా దగ్గరికి వచ్చినా ఏదో ఒక సమస్య వస్తుంది అని బాధపడతాడు అమర్​. అన్ని సమస్యలకి రేపటితో పరిష్కారం దొరుకుతుంది అంటుంది మనోహరి. ఒక్కసారిగా అమర్, రాథోడ్ ఇద్దరు మనోహరిని చూస్తారు. కంగారుపడిన మనోహరి సమస్యలు తీరిపోవాలని దేవుని కోరుకుంటాను అని మాట మార్చేస్తుంది. తర్వాత భోజనం లేట్ అయిపోతుంది పదండి అంటే అమర్, రాథోడ్ ఇద్దరూ భోజనానికి వెళ్తారు.

నాతోనే పోటీ పడ్డావు కదా భాగి ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్న నీ తండ్రిని చూసి బాగా ఏడు అని కసిగా అనుకుంటుంది మనోహరి. హాస్పిటల్ కి ఏడుచుకుంటూ వస్తుంది భాగి. తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూసి బాగా ఏడుస్తుంది. ఏం జరిగింది పిన్ని, నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా. నాతో మాట్లాడారు కూడా అంతలోనే ఏమైంది అని అడుగుతుంది. ఇప్పుడు నీ తండ్రి ఉన్న పరిస్థితికి నువ్వే కారణం అని నేను ఎలా చెప్పాలి.

50 లక్షల కోసం

పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ తండ్రికి ఎంత బాధ. నాలుగు రోజులలో పెళ్లి జరగకపోతే ఇకపై నీకు పెళ్లి జరగదు అని ఆ పంతులు చెప్పిన దగ్గర నుంచి మీ నాన్న మనసులో లేదు నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పు. మీ నాన్నకి ఏమి కాదు అంటుంది మంగళ. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది భాగమతి. 50 లక్షల కోసం అక్క ఏం నటిస్తుంది అనుకుంటాడు కాళీ. అమర్ ఇంటికి సరస్వతి మేడం వస్తుంది. ఆశ్రమాలు మారుతూ ఉండడం వలన ఎవరికి కమ్యూనికేషన్ లో లేకుండా పోయాను. అరుంధతికి ఇలా జరిగిందని నాకు తెలియదు అని తన సానుభూతిని ప్రకటిస్తుంది.

తర్వాత మనోహరి ఇక్కడే ఉందని తెలిసింది అంటుంది సరస్వతి మేడం. అవును మేడం ఇక్కడే ఉంది అని చెప్పి మనోహరిని పిలుస్తాడు అమర్​. మనోహరి బయటికి వచ్చి మేడంని పలకరిస్తుంది. పెళ్లి చేసుకున్నావా నీకంటూ ఒక కుటుంబం కావాలని తాపత్రయపడ్డావు కదా నువ్వు అనుకున్నది జరిగిందా అని అడుగుతుంది సరస్వతి మేడం. మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి బయటకు వెళ్లిపోతుంది మనోహరి.

ఆశ్రమాలకు మీ అవసరం

అరుంధతి ఉన్నప్పుడు మనోహరికి పెళ్లి చేసి తనకి ఒక కుటుంబాన్ని ఏర్పరచాలని అనుకునేది ఇప్పుడు తను లేదు కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది సరస్వతి. బయట ఉన్న మనోహరితో నువ్వు తప్పు చేస్తున్నావు. బలవంతంగా వచ్చే ప్రేమలు, బంధాలు కలకాలం నిలబడవు అంటుంది సరస్వతి మేడం. బరబరా మేడంని లాక్కుపోయి కారులో కూల దోస్తుంది. అవసరమైనప్పుడు పిలుస్తాను. అప్పుడు రండి మీ ఆరోగ్యం జాగ్రత్త. అనాధ పిల్లలకి ఆశ్రమాలకు మీ అవసరం చాలా ఉంది అని ఆమెని బెదిరించి అక్కడ నుంచి వెళ్లి పంపించేస్తుంది మనోహరి.

ఇదంతా అరుంధతి చూస్తుంది. ఎందుకు తప్పు మీద తప్పు చేస్తున్నావు అసలు నీకు అమర్‌ని పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది అని అనుకుంటుంది అరుంధతి. హాస్పిటల్ కి వచ్చిన మంగళ వాళ్లకి ఏడుస్తూ కూర్చున్న భాగి కనిపిస్తుంది. రాత్రంతా ఇక్కడే కూర్చున్నావా? కళ్ళు చూడు ఎలా ఎర్రగా అయిపోయాయో అంటాడు కాళీ. నాన్నకు ఏదైనా అవసరమవుతుందేమో అని ఇక్కడే ఉన్నాను అంటుంది భాగీ. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో నాన్నకి ఎలా ఉంది అని అడుగుతుంది భాగమతి.

కూతురుకి ఏదో చెప్పాలని

24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము ప్రస్తుతానికైతే వెళ్లి చూడండి. కానీ డిస్టర్బ్ చేయకండి అని చెప్పడంతో తండ్రిని చూడటానికి లోపలికి వెళ్తుంది భాగి. రామ్మూర్తి కూతురికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. మనోహరి ప్లాన్​ అమర్​కి అర్థమవుతుందా? కాళీతో పెళ్లికి భాగీ ఒప్పుకుంటుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే జనవరి 30న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!