Nindu Noorella Saavasam March 4th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 4th March Episode) నువ్వు గొప్పగా పెళ్లి చేస్తానని అన్నప్పుడు గొప్పోళ్లు అనుకున్నాను దీన్ని తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకుంటే మీది మంచి మనసు అనుకున్నాను. కానీ, పెళ్లి పీటల దాకా తీసుకువచ్చి నీ కూతురుతో ఎవ్వరో సంబంధం లేని ఆవిడను నా తమ్ముడు చంపాడని చెప్పించి పోలీసులను పిలిపించి పట్టించావు. అప్పుడు అర్థం కాలేదయ్య నీ బుద్ధి ఏంటో. ఇదంతా చేసింది దీని కోసమే కదా అంటుంది మంగళ.
మనోహరిని ఇంట్లో ఉంచుకున్నావ్ అది చాలాదన్నట్టు దీన్ని కూడా తీసుకుపోయి పెళ్లి చేస్తానన్నావు. కానీ పెళ్లి పెటాకులు చేసి ఇద్దరమ్మాయిలతో ఉండిపోవాలని ప్లాన్ చేసావా నీ తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని చప్పట్లు కొడుతుంది మంగళ. మంగళ గారు మీరు వయసులో పెద్దవారని ఏమీ అనకుండా ఊరుకుంటున్నాను అమర్ గురించి ఇంకొకసారి నోరు జారవంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది మనోహరి.
మీరు ఊరుకోండి మేడం మీరు ఆ ఇంట్లో ఉంటే మీకు జీవితాంతం పెళ్లే కాదు అసలు పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు మేడం మీరు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతారు ఆయన మాత్రం కుటుంబంతో సంతోషంగా ఉంటారు అంటుంది మంగళ. ఆపవే పాపిష్టి దాన పెద్ద మనసుతో ఆయన చేసే మంచి నీకు చెడ్డగా కనిపించిందా నువ్వు అసలు మనిషివేనా అంటాడు రామ్మూర్తి. బాబు అదేదో కోపంలో అని ఉంటుంది దాని మాటలు పట్టించుకోకండి అని రామ్మూర్తి అంటూ ఉండగా అమర్ మౌనంగా వెళ్లిపోతాడు.
ఎందుకే అంత మంచి ఆయనని నీ మాటలతో బాధ పెట్టావు నువ్వు అసలు మనిషివి కాదు పశువే అంటాడు రామ్మూర్తి. నీ కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని తప్పులు చేశాను నన్ను క్షమించయ్యా అని మంగళ రామ్మూర్తి కాళ్ల మీద పడుతుంది. నీలాంటి దాన్ని క్షమించకూడదు. కానీ తాళి కట్టిన పాపానికి భర్తగా భరించాలి కాబట్టి ఏదో ఒక మూలన పడుండు. కానీ నా జీవితంలో ఎప్పుడూ నువ్వు బ్రతికి ఉన్నావని అనుకోను అంటాడు రామ్మూర్తి.
భాగమతిని తీసుకొని రామ్మూర్తి వెళ్లిపోతాడు. డాడీ ఎప్పుడు ఇలా బాధపడడం చూడలేదు. అమ్మ బ్రతికున్నప్పుడు నాన్నకి ఏ సమస్య రాకుండా చూసుకునేది అమ్మ నాన్నను వదిలేసి వెళ్లిపోయి నాన్నని బాధ పెడుతుంది. నాన్న కళ్లల్లో కన్నీళ్లు నేను ఎప్పుడూ చూడలేదు అని అమృత బాధపడుతుంది. అమ్మ బ్రతికున్నప్పుడు నాన్నకి ఏ లోటు రానిచ్చేది కాదు అక్క. కానీ నాన్న ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు అమ్మ తోడుగా ఉంటే ఎంత బాగుండు అని ఆనంద్ అంటాడు.
మీ పిన్ని అనరాని మాటలు అనగానే మాట్లాడకుండా వెళ్లిపోయాడు. మీ పిన్ని చేసిన పొరపాటుకి రేపు పొద్దున మనం వెళ్లి క్షమించమని అడుగుదాం అమ్మ అంటాడు రామ్మూర్తి. ఆయన అంతే నాన్న కోపాన్ని చూపించినంత తొందరగా బాధ నీ ప్రేమని చూపించలేడు లోతుగా ఆలోచించి ఆయన బాధని అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు అని భాగమతి బాధపడుతుంది. ఆయన ఎందుకు ఇలా చేశాడు ఎంత బాధ పడుతున్నాడో అనుకుంటుంది.
కాళీ దుర్మార్గుడని తెలిసి మిస్సమ్మకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది పిన్ని పెళ్లి కాకముందే వాడి దుర్మార్గం బయటపడి మిస్సమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. లేదంటే తన జీవితం ఏమైపోయేది అంటాడు శివరామ్. ఏం చేస్తామండి ఆ దేవుడు అన్ని చూసుకుంటాడు అంటుంది నిర్మల. ఆ దేవుడనే వాడు ఉంటే అమర్‌ని అన్ని మాటలు అంటుంది ఆవిడ. వాడు ఏం తప్పు చేశాడే. నువ్వు ఇంకెప్పుడూ దేవుడి గురించి మాట్లాడకు. ఎవరికి అన్యాయం చేయని నా కొడుకు ఇవాళ కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటాడు శివరామ్.
ఎందుకండీ నా కొడుకు జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు ఆ భగవంతుడు ఆవిడ అన్ని మాటలనా మౌనంగా ఉన్నాడు ఒక్క మాట కూడా తిరిగి అనలేదు అంటుంది నిర్మల. అమర్ గురించి నాకు బాగా తెలుసు నిర్మల, వాడు మౌనంగా ఉన్నాడు అంటే సమాధానం కోసం వెతుకుతున్నాడు అంటాడు శివరామ్. గుడిలో పెళ్లి ఆగిపోయి అంత అవమానం జరిగినందుకు ఇంట్లో ఎంతో పెద్ద గొడవ అవుతుంది అనుకుంటే ఇదేంటి అమ్మ అందరూ సైలెంట్‌గా ఉన్నారు అంటుంది నీల.
కాలానికి ఎదురెళ్లి యుద్ధం చేస్తున్నాను అంటే అమర్‌ని సొంతం చేసుకోవడానికి అది కాకుండా ఎవరూ ఆపలేరు అంటుంది మనోహరి. అయితే ఏం చేస్తారమ్మా ఇప్పుడు వెళ్లి ఆయనతో గొడవ పడతారా అని నీలా అంటుంది. కాదే నేను అనుకున్న దాని నిజం చేసుకోడానికి పని మొదలు పెడతాను అంటూ వెళ్తుంది మనోహరి. అమరేంద్ర ఒకచోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. పక్కనే అరుంధతి కూడా ఉంటుంది. ఇంతలో మనోహరి అక్కడికి వస్తుంది.
ఏ మను మళ్లీ ఎందుకు వచ్చావే మళ్లీ ఆయనని బాధ పెట్టడానికి వచ్చావా ఇప్పటికి చేసింది చాలు. ఎందుకే ఆయనని ఇంకా బాధ పెడతావు అంటుంది అరుంధతి. ఏవండీ ఇది చెప్పేది వినకండి నమ్మకండి ఇది కావాలనే మిస్సమ్మని మోసం చేసి పెళ్లి చేయాలనుకుంది అంటుంది అరుంధతి. అమర్ నీతో మాట్లాడాలి అంటుంది మనోహరి. ఏంటో చెప్పు మనోహరి అని అంటాడు అమర్. మీ సంతోషాన్ని పంచుకుందామని కొడైకెనాల్‌కి వచ్చాను కానీ పిల్లలు బాధపడకూడదు అని అరుంధతి ప్లేస్‌లో ఉన్నాను కానీ నా వల్లే నీ కుటుంబానికి నీకు నష్టం కలుగుతుంది అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను అమర్ అంటుంది.
మనోహరి నా ముందు జరిగే దాని గురించి కాదు నేను ఆలోచిస్తున్నది నా వెనుక జరిగే దాని గురించి ఆలోచిస్తున్నాను అంటాడు అమర్. వెనకేం జరుగుతుంది అమర్ అంటుంది మనోహరి. ఆరు చనిపోయిన దగ్గర నుంచి సరస్వతి మేడం చనిపోయే వరకు నా చుట్టూ నన్ను గమనిస్తూ ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. అరుంధతిని చంపిన డ్రైవర్‌ని పట్టుకోడానికి వెళ్లినప్పుడు వాడికి ఎవరో ఫోన్ చేసి చెప్పారు. వాడు హైదరాబాదుకి వచ్చి నా ఇంటి దాకా వచ్చాడు అంటే నా పక్కనే ఉంటూ వాడికి నా సమాచారాన్ని అందిస్తున్నది ఎవరో కనిపెట్టి తీరుతాను. నా పిల్లల జోలికి నా కుటుంబం జోలికొస్తే నేనేంటో చూపిస్తాను అంటూ అమర్ వెళ్లిపోతాడు.
మను ఇప్పటికైనా తెలిసిందా ఆయనని ఎందుకే బాధ పెడతావ్ పిల్లల జోలికి వస్తేనే చంపేస్తాను అంటున్నాడు అలాంటిది నువ్వే ఇవన్నీ చేస్తున్నావని తెలిస్తే ఆయన నిన్ను ఏం చేస్తాడే ఇకమీదట నువ్వు మారిపోయి మనిషిలా ఉండు అంటుంది అరుంధతి. ఇంట్లో నుంచి మనోహరి ఎందుకు వెళ్లిపోయింది? మనోహరి ప్లాన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మార్చి 5న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్