NNS March 23rd Episode: పౌర్ణమి నాడు అరుంధతికి శక్తులు.. టూర్‌కు వెళ్లకుండా పిల్లల ప్లాన్.. మనోహరిని బెదిరించిన హంతకుడు
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 23వ తేది ఎపిసోడ్‌లో తాము టూర్‌కు వెళ్లకుండా పిల్లలు ప్లాన్ వేస్తారు. ఆ విషయం నీల తెలుసుకుని మనోహరికి చెబుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam March 23rd Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 23rd March Episode) నీ కుటుంబాన్ని కాపాడాలని మనోహరితో ఒంటరిగా యుద్ధం చేస్తున్న భాగమతికి సహాయం చేయి అని అరుంధతితో అంటాడు గుప్త. నేను భాగీకి తప్ప ఇంకెవరికి కనిపించను నేను ఎలా సహాయం చేయగలను అంటుంది అరుంధతి. మనసులో గట్టిగా అనుకో బాలిక నీకు శక్తి వచ్చి నువ్వు సహాయం చేస్తావు. పౌర్ణమి నాడు అని ఆపేస్తాడు గుప్త.
గుండ్రముగా ఉండును
పౌర్ణమి నాడు ఏం జరుగుతుంది గుప్తా గారు చెప్పండి అని అడుగుతుంది అరుంధతి. ఏమున్నది పౌర్ణమినాడు చంద్రుడు గుండ్రముగా నుండును అని గుప్తా వెళ్లిపోతాడు. లేదు గుప్తా గారు అమావాస్య నాడు నేను కనపడకుండా పోయాను అంటే పౌర్ణమి నాడు నాకు ఏదో శక్తి వస్తుంది అంతే కదా అంటుంది అరుంధతి. మరోవైపు మనోహరి ఆంటీ వచ్చినప్పటినుంచి మనకు ఇవన్నీ కష్టాలు. మనోహరి ఆంటీ మనల్ని ట్రిప్‌కి పంపిస్తున్నట్టు లేదు డాడీకి దూరం చేస్తున్నట్టు ఉంది అని అంటుంది అంజలి.
మనోహరి ఆంటీ నుంచి మనల్ని కాపాడేది ఎవరు అని ఆకాష్ అంటాడు. మనల్ని కాపాడడానికి ఎవరూ రారు కానీ మనమే డాడీ దగ్గరికి వెళ్లి మనోహరి ఆంటీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేద్దాం అంటుంది అంజలి. ఈ ప్లాన్ బాగానే ఉంది కానీ డాడీకి ధైర్యంగా చెప్పగలమా అని అమృత అంటుంది. డాడీతో మాట్లాడాలేము కాబట్టి ఒక లెటర్ రాసి డాడీ రూమ్‌లో పెడదాం అది చదువుకొని డాడీ అర్థం చేసుకుంటాడు అంటుంది అంజలి.
తెలిసినట్లు మాట్లాడుతున్నావ్
సరే అయితే అలాగే చేద్దాం అని పిల్లలు అనుకుంటారు. అమ్మ పిల్లలు మా మేడం ఎంతో కష్టపడి అమరేంద్రని పెళ్లికి ఒప్పిస్తే మీరు పెళ్లి చెడగొట్టాలని చూస్తారా మిమ్మల్ని ఆపమని మనోహరికి చెప్పాలి అనుకుంటుంది నీల. అమర్ బయటకు వెళ్తుంటే రాథోడ్ వెళ్లి మేడం చావుకు కారణమైన వాళ్లను వదలొద్దని చెప్తాడు. అరుంధతి హత్యకు ఎవరు కారణమో తెలిసినట్లు మాట్లాడుతున్నావని, తెలిస్తే చెప్పమని రాథోడ్‌ని అడుగుతాడు అమర్. కానీ, మనోహరి గురించి చెప్పలేక తనకి ఏం తెలియదని అబద్ధం చెబుతాడు రాథోడ్.
అందుకు తనని క్షమించమని మనసులో అనుకుంటాడు. మనోహరి ప్లాన్ ప్రకారం అరుంధతిని చంపిన హంతకుడిని తప్పించేందుకు జీప్‌లో నుంచి దింపుతాడు ఎస్సై. అనుకున్న ప్లాన్ ప్రకారం హంతకుడు ఎస్సైని తోసేసి మనోహరి దగ్గరకు పరిగెడతాడు. అతన్ని పట్టుకుని తన ప్లాన్‌ని పాడుచేస్తున్నావని అరుస్తుంది మనోహరి. అమర్‌కి దొరకనంత దూరంగా వెళ్లిపొమ్మని చెబుతుంది. తను అడిగిన డబ్బు ఇస్తే తాను దూరంగా వెళ్లిపోతానంటాడు హంతకుడు.
అన్ని సాక్ష్యాలు ఉన్నాయి
వారం రోజుల్లో అమర్‌ని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలు అయిన తర్వాత లక్షల్లో కాకుండా కోట్లలో డబ్బిస్తానని నచ్చజెప్పి అతన్ని పంపించాలని ప్రయత్నిస్తుంది. కానీ, మనోహరి మాట వినకుండా పెళ్లికి రెండు రోజుల ముందే తనకు డబ్బు ఇవ్వాలని వార్నింగ్ ఇస్తాడు. కాదని తనని మోసం చేయాలని చూస్తే కొడైకెనాల్లో ఆమెని నువ్వే చంపించావని నిరూపించే అన్ని సాక్ష్యాలు నా స్నేహితుడి దగ్గర ఉన్నాయని చెప్పి అక్కడనుంచి పరిగెడతాడు హంతకుడు.
పోలీస్ స్టేషన్‌కి వచ్చిన అమర్ హంతకుడు ఎక్కడ అని ఎస్సైని అడుగుతాడు. హంతకుడు తమ దగ్గరనుంచి తప్పించుకుని పోయాడని చెప్తాడు ఎస్సై. అసలు అలా ఎలా వదిలేశారనీ, ఎంతకి అమ్ముడు పోయారని ఎస్సైని నిలదీస్తాడు అమర్. ఎక్కడకు వెళ్లినా ఆ హంతకుడిని వదలనని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్తాడు అమర్. పిల్లల్ని సమ్మర్ క్యాంప్‌కి మనోహరి వేసిన ప్లాన్ ఎలాగైనా చెడగొట్టాలని అనుకుంటుంది అరుంధతి.
అరుంధతి సాయం ఎలా?
అందుకోసం ఏం చేయాలో చెప్పమని గుప్తని అడుగుతుంది. పిల్లలు లెటర్ రాసి అమర్ రూమ్‌లో పెడతారు. ఆ లెటర్ అమర్ చదవకుండా చెయ్యాలని ప్రయత్నిస్తుంది మనోహరి. కానీ అప్పుడే శివరామ్ అక్కడకు రావడంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. పిల్లలు రాసిన లెటర్ చదివి అమర్ ఏం చేస్తాడు? భాగీ విజయానికి అరుంధతి ఎలా సాయం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే మార్చి 25న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!