NNS March 19th Episode: మనోహరితో మిస్సమ్మ ఛాలెంజ్.. అమర్ పెళ్లికి జాతకాలు కలిశాయన్న పూజారి.. హాల్లో అరుంధతి ఫొటో-nindu noorella saavasam march 19th episode bhagamathi challenge to manohari nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns March 19th Episode: మనోహరితో మిస్సమ్మ ఛాలెంజ్.. అమర్ పెళ్లికి జాతకాలు కలిశాయన్న పూజారి.. హాల్లో అరుంధతి ఫొటో

NNS March 19th Episode: మనోహరితో మిస్సమ్మ ఛాలెంజ్.. అమర్ పెళ్లికి జాతకాలు కలిశాయన్న పూజారి.. హాల్లో అరుంధతి ఫొటో

Sanjiv Kumar HT Telugu
Mar 19, 2024 11:30 AM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్‌లో మిస్సమ్మకు తన గురించి మొత్తం తెలిసిపోయిందని తెలిసి కోపంతో ఉంటుంది. ఇద్దరూ వాదించుకుంటారు. మనోహరితో మిస్సమ్మ ఛాలెంజ్ చేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 19th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 19th March Episode) గుడిలో ఉన్న రాథోడ్‌ను ఇంటికి వెళ్లమని మనోహరికి ఫైనల్‌ టచ్‌ ఇచ్చి వస్తానని మిస్సమ్మ చెప్పడంతో రాథోడ్‌ ఇంటికి వెళ్తాడు. మిస్సమ్మ మనోహరి దగ్గరకు వెళ్తుంటే అప్పటికే మంగళ ఫోన్‌ చేసి మిస్సమ్మ నీ దగ్గర నాటకం ఆడుతుందని చెప్పడంతో మనోహరి కోపంగా ఉంటుంది. దీంతో మిస్సమ్మను మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది.

ఎలా మోసం చేశావా అని

ఇంతలో మిస్సమ్మ మనోహరి దగ్గరకు వస్తుంది. పూజంతా అయిపోయిందట మీరు ఇక తినేయొచ్చు. దానికంటే ముందు 101 కొబ్బరి కాయలు మీరే కొనుకొచ్చి గుడిలోపలికి మోసుకొచ్చి కొట్టాలట. ఏమైందక్కా అలా చూస్తున్నావు పద త్వరగా తీసుకొచ్చి కొట్టేస్తే నువ్వు తినేయొచ్చు. ఎందుకక్కా అలా చూస్తున్నావు ఏమైంది? అంటుంది మిస్సమ్మ. ఏం లేదు నా ముందు నిల్చొని ధైర్యంగా మాట్లాడటానికి అందరూ భయపడతారు. అలాంటిది నువ్వు నన్ను ఎలా మోసం చేశావా అని ఆలోచిస్తున్నాను అంటుంది మనోహరి.

నేను మోసం చేయడం ఎంటక్కా..? అంటుంది మిస్సమ్మ. అంత ప్లాన్‌ చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన నాతోనే మళ్లీ ఇంట్లోకి రమ్మని అడిగేలా చేసుకున్నావు. నచ్చేశావు మిస్సమ్మ అంటూ మనోహరి కోపంగా మిస్సమ్మను తిడుతుంది. అయితే మొత్తం మీకు తెలిసిపోయిందా అంటూ మిస్సమ్మ అనగానే మర్యాదగా చెప్తున్నాను ఎలా వచ్చావో అలాగే వెళ్లిపో లేదంటే బాగుండదు అని మనోహరి వార్నింగ్‌ ఇస్తుంది. దాంతో నువ్వు కూడా మర్యాదగా వెళ్లి ఆయనతో నిజం చెప్పి వెళ్లిపో నేను క్షమిస్తాను అంటుంది మిస్సమ్మ.

నేను చేయలేను

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. మిస్సమ్మ ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని నీ నుంచి నేను కాపాడతాను అంటూ ఛాలెంజ్ చేసి వెళ్లిపోతుంది. మరోవైపు హాల్లో ఉన్న తన ఫొటో మిస్సమ్మ చూస్తే ఏమవుతుందోనని అరుంధతి కంగారుపడుతుంది. మిస్సమ్మ ఇంటికొస్తే నా ఫోటో చూస్తుంది అని గుప్తను ఏదైనా చేయండి అని అడుగుతుంది. నేను ఏమీ చేయలేను.. చేయలేను అంటాడు గుప్త. అసలు మిస్సమ్మకు నిజం తెలిస్తే నాకొచ్చే నష్టం ఏంటి? మిస్సమ్మకు నిజం తెలిస్తే వెంటనే ఇంట్లో వాళ్లకు నిజం చెప్పేస్తుంది. అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది అంటుంది అరుంధతి.

గుప్త కంగారుపడుతుంటాడు. ఇంతలో రాథోడ్‌ వచ్చి గుప్తను తిడతాడు. నువ్వు నాకింద పనిచేస్తున్నావా? నేను నీకింద పనిచేస్తున్నానా అంటూ నిలదీయడంతో గుప్త నాకో సందేహం ఉందని శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఆమె ఫోటో పెట్టడం అవసరమా అని అడగ్గానే దేవత ఫోటో ఎక్కడ పెట్టినా మంచిదే అంటాడు రాథోడ్‌. దీంతో అరుంధతి సెంటిమెంట్‌‌తో కొట్టావు రాథోడ్‌ అనుకుంటుంది. ఇంతలో మనోహరి వచ్చి తోటమాలివి ఈ గెటప్‌లో ఉన్నావేంటి అని అడిగి లోపలికి వెళ్తుంది.

అమర్ ఎమోషనల్

లోపల హాల్‌లో అరుంధతి ఫోటో చూసి మనోహరి షాక్‌ అవుతుంది. నువ్వు చచ్చాక కూడా నన్ను మనఃశాంతిగా ఉండనీయటం లేదే? నీ చెల్లేమో నీకోసం నన్ను ఓడిస్తానని శపథం చేసిందే. నీలా ఈ ఫోటో ఇక్కడ పెట్టింది ఎవరే.. అని అరుస్తుంది మనోహరి. నేనే ఎందుకు అరుంధతి ఫోటో అక్కడ ఉండకూడదా? అని అడుగుతాడు అమర్. అలా ఏం లేదు అమర్‌ ఎవరు పెట్టారో కనుక్కుని చాలా మంచి పని చేశారని చెబుదామనుకున్నా అని మనోహరి అనడంతో అమర్‌ ఎమోషనల్‌గా ఫీల్‌ అవుతాడు.

మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌‌గా చూస్తుంటుంది. అమర్‌ వెళ్లిపోతాడు. ఇప్పుడు మిస్సమ్మ ఇంటికి వచ్చి ఈ ఫోటో చూస్తే నిజం మొత్తం తెలిసిపోతుందని మనోహరి భయపడుతుంది. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసి గుప్త, అరుంధతి షాక్‌ అవుతారు. అరుంధతి దగ్గరకు వచ్చిన మిస్సమ్మ మనోహరికి నిజం తెలిసిందని చెప్తుంది. ఇంతలో గుప్త లోపలికి వెళ్లి నీ ఫోటో తీసేయిస్తానని వెళ్లిపోతాడు. మరోవైపు లోపల పంతులు ఇద్దరి జాతకాలు చాలా బాగా కలిశాయని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు.

పెళ్లి గురించి

మనోహరి మాత్రం హ్యాపీగా పీలవుతుంది. మిస్సమ్మ అరుంధతి ఫొటో చూస్తుందా? అమర్​ పెళ్లి గురించి పూజారి ఏం చెబుతాడు? అనే విషయాలు తెలియాలంటే మార్చి 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!