NNS March 18th Episode: మనోహరిని షూట్ చేసిన అమర్.. గుడిలో పొర్లు దండాలు.. మిస్సమ్మ గురించి తెలిసిపోయిన నిజం-nindu noorella saavasam march 18th episode amar shoots manohari in dream nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nindu Noorella Saavasam March 18th Episode Amar Shoots Manohari In Dream Nindu Noorella Saavasam Today Episode

NNS March 18th Episode: మనోహరిని షూట్ చేసిన అమర్.. గుడిలో పొర్లు దండాలు.. మిస్సమ్మ గురించి తెలిసిపోయిన నిజం

Sanjiv Kumar HT Telugu
Mar 18, 2024 12:06 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్‌లో మనోహరితో పొర్లు దండాలుపెట్టిస్తుంది భాగమతి. మనోహరి గురించి మిస్సమ్మకు నిజం చెప్పినట్లు మంగళతో చెబుతాడు కాళీ. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 18th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 18th March Episode) పోలీస్ స్టేషన్​ నుంచి పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు అమర్​. సార్ ఆ డ్రైవర్ నిజం చెప్పాడా అని అడుగుతుంది భాగమతి. చెప్పలేదు మిస్సమ్మ అంటాడు అమర్​. ఆ బంగారు తల్లి ఎవరికి ఏ అన్యాయం చేసిందిరా తనని ఎందుకు చంపాలి అనుకున్నారు. తను ఒకరికి సహాయం చేసేదే కానీ అన్యాయం చేసేది కాదు అంటుంది నిర్మల.

అనాధల్ని చేస్తారా

బాధపడకు అమర్ పోలీసులు ఎంక్వైరీలో తెలుసుకుంటారులే అంటాడు శివరామ్. పోలీసులకు నిజం చెప్పకపోతే నేనే చంపేస్తాను నాన్న అంటాడు అమర్​. ఏం మాట్లాడుతున్నారు సార్. ఇప్పటికే మీ భార్య పిల్లలకు దూరమై బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా అతని చంపి దూరమైపోయి పిల్లల్ని పూర్తిగా అనాధల్ని చేస్తారా అంటుంది భాగమతి.

మరి ఏం చేయమంటావు మిస్సమ్మ దేశాన్ని కాపాడే నేను ఒక మనిషిని ఇంతగా ప్రేమిస్తానని అనుకోలేదు అలాంటి నా భార్యని నేను కాపాడుకోలేక పోయాను తనకి నా కుటుంబాన్ని అప్పగించి నేను వెళ్లి యుద్ధం చేసేవాణ్ణి నా బరువు బాధ్యతలని తనకి అప్పగించాను దేశాన్ని కాపాడుకున్నాను కానీ నా భార్యను కాపాడుకోలేకపోయాను అంటాడు అమర్​. అయ్యో మీరు అలా అనకండి మీ కుటుంబంలోకి వచ్చాకే నేను ఆనందాన్ని పొందాను అని బాధపడుతుంది అరుంధతి.

నువ్వేమైనా తప్పు చేశావా?

నా భార్యని చంపించింది ఎవరైనా సరే వాళ్ల దగ్గరికి నేను చేరుకుంటాను వాళ్లని నా చేతులతో చంపేస్తాను అని వెళ్లిపోతాడు అమర్​. ఆ మాటలు విన్న మనోహరి అమరేంద్ర షూట్ చేసినట్టు కలగని భయపడిపోతుంది. ఏమైంది అక్క ఆయన భార్యని చంపిన వాళ్లను చంపేస్తాను అంటే నీకెందుకు అంత భయం కలుగుతుంది. నువ్వేమైనా తప్పు చేశావా అని అడుగుతుంది భాగమతి. కాదు మిస్సమ్మ పొద్దున కానుంచి ఏమీ తినలేదు కదా ఆకలి వేస్తుంది నీలా.. అన్నం పెట్టు అని మనోహరి వెళ్తూ ఉండగా నిజం తెలిసిన రోజున చస్తావ్ అని భాగమతి అంటుంది.

ఏంటి అని మనోహరి అంటుంది. అదే అక్క నువ్వు గుడికి వెళ్లకుండా ఉపవాసం ఇక్కడే ఇడిస్తే ఆ భగవంతుడికి తెలుస్తుంది కదా అప్పుడు చస్తావు అని అంటున్నాను అని అంటుంది భాగమతి. సరే అయితే గుడికి వెళ్దాం పద అని మనోహరి వెళ్లిపోతుంది. గుప్తా ఘోర నుంచి తప్పించుకొని ఆ బాలిక నేను లేక ఎంత కంగారుపడుచున్నదో ఏమో నేను వెంటనే ఆ బాలిక దగ్గరికి వెళ్లాలి అని గుప్తా వస్తుంటాడు. ఇంతలో కొబ్బరి బోండాల అతను గుప్తాకి ఎదురుపడి నీకోసమే సిటీ అంత వెతుకుతున్నాను సార్ నీ వస్తువులు నీకు ఇద్దామని అతను వెళ్లి గుప్తా బట్టలు తెచ్చి గుప్తా కి ఇస్తాడు.

సిటీ అంతా వెతుకుతున్నాను

ఇవి వచ్చిన కానించి మాకు అన్ని కష్టాలే సార్ తీసుకువెళ్లండి మీ బట్టలకో దండం అంటాడు. గుప్తా బట్టలు తీసుకొని ముందుకు వెళుతూ ఉండగా ఎస్ఐ కారు తనకి అడ్డంగా పెడతాడు. ఓ రక్షక బటుడా నన్ను ఎందుకు మరలా ఆపుచుంటివి అని గుప్తా అంటాడు. ఏమీ లేదు నీ నగలు నీకు ఇద్దామని సిటీ అంతా వెతుకుతున్నాను. నీ నగలు నువ్వు తీసుకెళ్లరా బాబు అవి వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో మనశ్శాంతి లేదు అని ఆ ఎస్ఐ గుప్తా చేతిలో నగలు పెట్టి వెళ్లిపోతాడు.

నా బట్టలు నా నా నగలు అన్ని వచ్చేసాయి ఇక ఉంగరం కూడా వచ్చేస్తే బాగుంటుంది. ఈ బాలిక నేను లేనని ఎంత కంగారు పడుతుందో వెళ్లెదము అని గుప్తా సంబరపడుతూ వెళ్తూ ఉంటాడు. పంతులుగారు మా అక్క నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు మీరు తీర్థం ఇస్తే ఉపవాసం ముగిస్తుంది అంటుంది భాగమతి. బేషుగ్గా ఇస్తానమ్మా కడుపునిండా తిని వెళ్లి పడుకోమను అని పంతులుగారు అంటారు. అదేంటి పంతులుగారు అలా అంటారు అని భాగమతి అంటుంది.

ఒంటరితనంతో యుద్ధం

మరి లేకపోతే ఏంటమ్మా ఆవిడ జాతకంలో ఉన్న దోషాలు చిన్నా చితకవా చాలా పెద్దవి. ఈ పెళ్లి జరగదు అని అంటారు పంతులు. అలా అనకండి పంతులుగారు ఈ పెళ్లి కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను అమర్ నా మెడలో తాళి కట్టడం కోసం ఒంటరితనంతో యుద్ధం చేస్తున్నాను అంటుంది మనోహరి. ఏంటి మేడం మీరు ఈ పెళ్లి కోసం ఒంటరితనంతో యుద్ధం చేయడమేంటి నిన్నటిదాకా మా సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడని మీకు కూడా తెలియదు కదా అని రాథోడ్ అంటాడు.

పంతులుగారు ఈ పెళ్లి కోసం మా అక్క ఏమైనా చేస్తుంది చంపడానికైనా చావడానికి అయినా రెడీ అని అంటుంది భాగమతి. అంటే నువ్వు ఈ పెళ్లి జరగడం కోసం చచ్చిపోతావ్ అంటున్నానక్క అని భాగమతి మాట మారుస్తుంది. సరే పంతులుగారు ఏం చేయాలో చెప్పండి దోషాలు పోవాలంటే అని అడుగుతుంది మనోహరి. ఏముందమ్మా ఈ గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలి అని పంతులుగారు చెబుతారు. ఏంటి పంతులుగారు నేను పచ్చిమంచినీళ్లు కూడా ముట్టలేదు అలాంటిది నేను పొర్లు దండాలు ఎక్కడ పెడతాను నా బదులు మా చెల్లెలు పెడుతుంది అని మనోహరి అంటుంది.

పెళ్లి కూడా నీ చెల్లినే చేసుకోమను

అయితే ఈ పెళ్లి కూడా మీ చెల్లిలే చేసుకుంటుందిలే అమ్మ నువ్వు దేవుడికి దండం పెట్టుకొని కడుపునిండా తిని వెళ్లి పడుకో అని పంతులుగారు అంటారు. అలా అనకండి పంతులుగారు ఈ పెళ్లి జరగడం కోసమే కదా ఇన్ని తప్పులు చేసింది అని మనోహరి అంటుంది. గుడిలో పూజారి మనోహరిని పోర్లు దండాలు పెట్టమని చెప్తాడు. దీంతో మనోహరి నేను పెట్టలేనని కావాలంటే నా చెల్లి పెడుతుందని మనోహరి చెప్పడంతో పూజారి వెటకారంగా పెళ్లి కూడా నీ చెల్లి చేసుకుంటుంది. నువ్వు అక్షింతలు వెయి చాలు అంటాడు.

దీంతో మనోహరి కోపంగా పంతులుని చూడగానే అసలు నీకు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా? అని అడుగుతాడు. ఇష్టం ఉండబట్టే కదా ఇదంతా చేసేది అని మనసులో అనుకుంటుంది మనోహరి. దీంతో పూజారి మనోహరితో పొర్లు దండాలు పెట్టిస్తాడు. మనోహరి వెనకే వస్తున్న మిస్సమ్మ, రాథోడ్‌ నవ్వుకుంటారు. ఇంతలో మనోహరి అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటుంది. ఇంతలో పంతులు వచ్చి త్రిశూలం తీసి మనోహరి నాలుకపై గుచ్చుతాడు.

ఇప్పుడు శిక్ష వేస్తుండు

కాళీ పోలీస్‌స్టేషన్‌ సెల్‌లో పాట పాడుకుంటూ ఉంటాడు. ఇంతలో మంగళ వస్తుంది. అక్కా వచ్చావా? ఈ తమ్ముడిని మర్చిపోయావనుకున్నాను అక్కా.. తినడానికి ఏమైనా తెచ్చినవా అక్కా.. అంటాడు కాళీ. పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉన్నావు మరి నువ్వు కోరినవన్నీ తీసుకురావడానికి అంటుంది మంగళ. నువ్వు బయట ఉండి బాగానే ఉన్నావు. నాకు ఈడ సావొస్తుంది అంటాడు కాళీ. నా పరిస్థితి కూడా బయట ఎం బాగాలేదురా.. జీవితంలో చేసిన అన్ని తప్పులకు మీ బావ ఇప్పుడు శిక్షలు వేస్తుండు అంటుంది మంగళ.

అక్కా ఈ సొదంతా పక్కకి పెట్టి ముందు నన్ను జైలు నుంచి ఎప్పుడు బయటకు తీసుకొస్తావో చెప్పు అంటాడు కాళీ. మనోహరి పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. టైం చూసి చెప్తానులే అనగానే మనోహరి గురించి అంతా నేను భాగికి చెప్పాను కదా అని కాళీ అనడంతో మంగళ షాక్‌ అవుతుంది. కాళీని తిడుతూ మనోహరి గురించి అంతా తెలిసి ఎందుకు నిజం చెప్పావని కోపంగా బయటకు వెళ్లి మనోహరికి కాల్‌ చేస్తుంది. మనోహరి ఫోన్‌ మిస్సమ్మ దగ్గర ఉంటుంది.

నన్ను బంధించాడు

మా పిన్ని మీకు ఫోన్‌ చేస్తుందని మిస్సమ్మ చెప్పగానే మనోహరి ఫోన్‌ స్విచ్చాప్‌ చేస్తుంది. మరోవైపు చిత్రగుప్తుడు ఇంట్లోకి రావడంతో అరుంధతి హ్యపీగా ఫీలవుతుంది. మీరు లేకుంటే నేను ఇక్కడే ఉండిపోవచ్చని అనుకున్నాను. కానీ మీరు మళ్లీ వస్తారని అనుకోలేదు అంటుంది. దీంతో నిన్ను బంధించడం కుదరక ఆ ఘోర గాడు నన్ను బంధించాడు అని చెప్పడంతో అరుంధతి ఇన్నాళ్లు మీరు లేనప్పుడు చాలా ఘోరాలు జరిగాయని చెప్తుంది.

దీంతో సరే మనం మా లోకం వెళ్దాం పదా అంటాడు. దీంతో ఈ టైంలో నన్ను పైకి రమ్మనడం కరెక్టు కాదు అని తిడుతుంది. మరోవైపు మనోహరి గుడిలో ప్రదిక్షణలు పూర్తి చేసుకుని పక్కకు వెళ్లి కూర్చోగానే మంగళ ఫోన్‌ చేసి కాళీ, మిస్సమ్మకు అంతా చెప్పాడని చెప్పడంతో భాగీకి అంతా తెలిసి వచ్చిందంటే అది నా పెళ్లి ఆపడానికే వచ్చిందా? అనుకుంటుంది మనోహరి. ఇంట్లో అరుంధతి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అమర్​, అరుంధతి ఫోటో తీసుకొచ్చి హాల్‌ లో పెడతాడు.

మనోహరి ఏం చేయనుంది

దీంతో కంగారుగా అరుంధతి బయటకు వెళ్లి గుప్తను తీసుకు వస్తుంది. ఇంట్లో వాళ్లందరు వచ్చి అరుంధతి ఫోటో మళ్లీ ఎందుకు పెడుతున్నావని అడిగితే కళ్ల ముందు ఉండే ఫోటో తీసేయగలం కానీ గుండెల్లో ఉండే రూపాన్ని తీసేయలేం కదా అంటూ అమర్​ చెప్పగానే అందరూ ఏడుస్తారు. భాగీకి తన గురించి తెలిసిపోయిందని తెలుసుకున్న మనోహరి ఏం చేస్తుంది? ఇంటికి వచ్చిన మిస్సమ్మ అరుంధతి ఫొటో చూస్తుందా? అనే విషయాలు తెలియాలంటే మార్చి 19న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel