NNS July 5th Episode: పిల్లల భోజనంలో విషం.. అమ్ము కోసం ఆగిపోయిన అరుంధతి.. అమర్‌తో కలిసి మనోహరి షికారు
Nindu Noorella Saavasam July 5th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 5వ తేది ఎపిసోడ్‌లో పిల్లలు తినే భోజనంలో మనోహరి విషం కలుపుతుంది. అరుంధతి ఎంత వారించిన తనకు వినపడదు. తర్వాత గేట్ వద్దే ఆగిపోతుంది అరుంధతి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 5th July Episode) మనోహరి పిల్లలు తినే వంటలో విషం కలపడం చూసి కంగారు పడుతుంది అరుంధతి. ఏం చేస్తున్నావే.. అది పిల్లలు తినే భోజనమే అందులో ఏం కలుపుతున్నావ్. ఆగు.. ప్లీజ్ ఏం చేయకు.. పిచ్చేమైనా పట్టిందా.. అందులో ఏం కలుపుతున్నావ్.. ఆగు ప్లీజ్ అంటూ అరుస్తుంది.
రాత్రి జరిగిన గొడవ
అరుంధతి మాటలు మనోహరికి వినిపించకపోవడంతో తనతో తెచ్చిన విషాన్ని కూరల్లో వేసి బాగా కలిపేసి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని ఎలాగైనా మిస్సమ్మకు చెప్పాలనుకుంటుంది అరుంధతి. మిస్సమ్మ దగ్గరకు పరిగెత్తి మనోహరి వంటల్లో విషం కలిపిన విషయం చెప్పాలనుకుంటుంది. అరుంధతిని చూసిన మిస్సమ్మ రాత్రి జరిగిన గొడవ గురించి మాట్లాడుతుంది.
కానీ, అరుంధతి మనోహరి అంటూ చెప్పబోతుంటే గతంలో తాను చేసిన తప్పుకి అమ్ము ప్రాణాల మీదకి వచ్చినట్లు గుప్త చెప్పిన విషయం గుర్తొచ్చి ఆగుతుంది. ఆ మనోహరి గురించి ఏదో చెప్పాలని వచ్చి ఆగిపోయావేం అక్కా.. ఆ ఫంక్షన్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి మనోహరి కోసమే వచ్చాడేమోనని నీకూ అనుమానం వచ్చిందా? ఆయనకు కూడా అదే అనుమానం వచ్చిందక్కా అని భాగీ అంటుంది.
అస్సలు మిగలకూడదు
తర్వాత సరే పిల్లలకి స్కూల్‌కి టైమ్ అవుతోంది, మళ్లీ మాట్లాడతానక్కా అంటూ వంటింట్లోకి పరిగెడుతుంది మిస్సమ్మ. పిల్లలకు స్కూల్ టైమ్ అవుతుందని పిలుస్తాడు రాథోడ్. మిస్సమ్మ పిల్లలందరికీ బాక్స్‌లు పెట్టి ఇస్తుంది. ఆ వంటలో విషం కలిసిందని చెప్పవే.. పిల్లలకి బాక్స్‌ల్లో పెట్టొద్దని చెప్పు.. అంటూ మనోహరిని బతిమాలాడుతుంది అరుంధతి. మిస్సమ్మ పిల్లలకి బాక్సులు ఇచ్చి లంచ్ కొంచెం కూడా వదిలేయొద్దు అని చెబుతుంది.
టైమ్ అవుతోందని రాథోడ్ తొందరపెట్టడంతో పిల్లలు బయల్దేరతారు. అరుంధతి వారి వెంటపడి తినొద్దని బతిమాలుతుంది. వాళ్లని ఆపేందుకు కారు వెనకాల పరిగెత్తుతూ గేటు దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా గేటు దాటలేకపోతుంది. గుప్త యమలోకానికి వెళ్లేటప్పడు ఘోరా నుంచి అరుంధతి ఆత్మకి రక్షణ కల్పించేందుకు ఆ రక్ష రేఖ గీసి వెళ్తాడు. దాంతో అరుంధతి గేటు దాటి బయటకు వెళ్లలేక దేవుడిని వేడుకుంటుంది.
మనోహరితో అమర్ బయటకు
అమర్ ఎస్సైకి ఫోన్ చేసి ఫంక్షన్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ఇంకా లేదు సార్ కాసేపట్లో తెలిసిపోతుంది అంటాడు ఎస్సై. వెంటనే మనోహరిని పిలుస్తాడు అమర్. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి మనోహరిని అడగడానికే పిలుస్తున్నాడేమో అనుకుంటుంది మిస్సమ్మ. మనోహరిని పిలిచి ఈరోజు నీకేమైనా పనుందా మనం బయటకు వెళ్లాలి రెడీగా ఉండు అంటాడు అమర్. ఆశ్చర్యపోతుంది మిస్సమ్మ.
సంబరపడిపోయిన మనోహరి అమర్.. మనతోపాటు మిస్సమ్మ, పిల్లలు, ఆంటీ, అంకుల్ కూడా వస్తారా? అని అడుగుతుంది. లేదు మనోహరి మనిద్దరమే వెళ్లాలి నేను ఫోన్ చేస్తాను రెడీగా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు. చూశావా.. పెళ్లైందని సంబరపడిపోవడమేగానీ ఏ రోజైనా నిన్ను అమర్ ఇలా బయటకు తీసుకువెళ్లాడా అని మిస్సమ్మను ఎగతాళి చేస్తుంది మనోహరి. అంత సంబరపడిపోకు.. అప్పుడే ఏమైందని అంత మిడిసిపడుతున్నావ్ అంటుంది మిస్సమ్మ.
అన్నింటికి పులిస్టాఫ్
ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో అర్థమైందా అంటున్న మనోహరితో అవును.. నన్ను దగ్గర చేసేందుకే దేవుడు ఆయనకు భార్యను చేశాడు. నిన్ను దూరం చేసేందుకే పరాయిదాన్ని చేశాడు అంటుంది మిస్సమ్మ. ఆ మాటలకు కోపంతో రగిలిపోయిన మనోహరి.. నీలో ఈ కాన్ఫిడెన్సే నాకు కోపం తెప్పిచ్చేది.. అమర్‌కి దగ్గరైపోతావా? అన్ని పనులు చేస్తూ ఇంట్లో అందరినీ పడేస్తావా? నీ పనులే నీకు ముప్పుగా మారే రోజు వచ్చేసిందని మనోహరి అంటుంది.
ఇవాల్టితో అన్నింటికీ పులిస్టాప్ పడుతుంది అంటూ లోపలకు వెళ్తుంది మనోహరి. దాంతో మిస్సమ్మ ఆలోచనలో పడుతుంది. మిస్సమ్మ పెట్టిన భోజనం పిల్లలు తింటారా? మనోహరి కుట్రను మిస్సమ్మ తెలుసుకుంటుందా? అనే విషయాలు తెలియాలంటే జులై 06న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!