NNS June 22nd Episode: భాగీని ఎత్తుకెళ్లిన అమర్.. అరుంధతికి అసూయ.. ప్రేమ కలిగేలా ప్లాన్.. మనోహరి కాళ్లు పట్టుకున్న నీల
Nindu Noorella Saavasam June 22nd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 22వ తేది ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో మిస్మమ్మ నుదిటపైన కుంకుమ పెడతాడు అమర్. అది చూసి ఆశ్చర్యపోతుంది భాగీ. ఇంట్లోకి ఎత్తుకెళ్లి తీసుకెళ్తాడు అమర్. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 22nd June Episode) నీల కంగారు పడటం చూసి వార్డ్ రోబ్ చెక్ చేస్తుంది మనోహరి. తన నగల పెట్టె వేరే చోట ఉండటం చూసి నీలకి నిజం తెలిసిపోయిందని అర్థం చేసుకుంటుంది. అంతలోనే నీల వచ్చి మనోహరి కాళ్లు పట్టుకుని క్షమించండమ్మా.. ఇంకోసారి ఇలా చేయను, తప్పైపోయిందమ్మా.. అని వేడుకుంటుంది.
త్వరగా కోలుకోవాలని
తనకు తెలిసిన నిజాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలతో వదలను అని నీలను బెదిరిస్తుంది మనోహరి. నేను మరిచిపోవాలనుకున్న గతాన్ని ఎవరికైనా చెప్పితే చంపేస్తాను. నా గతాన్ని ఎవరినీ చేరుకోనివ్వను అంటుంది. దాంతో నీల తెగ భయపడిపోతుంది. మరోవైపు మిస్సమ్మ గురించి ఆలోచిస్తూ హాస్పిటల్‌లో దిగులుగా కూర్చుంటాడు అమర్. అప్పుడే అక్కడకి వచ్చిన ఆయా అమర్‌ని చూసి భార్య త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని మొక్కుకుని ఆ కుంకుమ తీసుకెళ్లి ఆమె నుదుటిన పెట్టమని చెబుతుంది.
అది విన్న అరుంధతి ఆయన అలాంటివేం నమ్మరు అని బుకాయిస్తుంది. కానీ, అమర్ కుంకుమ తీసుకోవడంతో గుప్త అరుంధతిని ఆటపట్టిస్తాడు. అమర్ కుంకుమ తీసుకెళ్లి భాగీ నుదుటిన పెడతాడు. స్పృహలోకి వచ్చిన భాగీ అమర్ తనకు కుంకుమ పెట్టడం చూసి ఆశ్చర్యపోతుంది. డాక్టర్ వచ్చి ఎలా ఉందని అడగడంతో బానే ఉందంటుంది భాగీ.
ట్యాబ్లెట్స్ వేయమని చెప్పి
నర్స్ పేషెంట్‌కి ట్యాబ్లెట్స్ వేయలేదని తెలుసుకుని అమర్‌ని వేయమని చెబుతాడు. ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి భాగీ ఇబ్బందిపడుతుండటంతో తీసి నోట్లో వేయమంటాడు డాక్టర్. చేసేదేం లేక భాగీకి మాత్రలు వేస్తాడు అమర్. అదంతా చూసిన అరుంధతి అసూయ పడుతుంది. అమర్ పక్కకి వెళ్లడంతో మెల్లిగా భాగీ దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది అరుంధతి.
అమ్ముని ప్రాణాలకు తెగించి కాపాడినందుకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనని, ఒక తల్లి బాధ మరో తల్లికే తెలుస్తుందని, తన కూతురుని కాపాడినందుకు థ్యాంక్స్ అంటుంది అరుంధతి. మీ కూతురేంటి అని ఆశ్చర్యపోతుంది మిస్సమ్మ. అరుంధతి, భాగీ మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ లోపలకు రావడం చూసి గుప్త పరిగెత్తుకుంటూ వచ్చి అరుంధతికి చెబుతాడు.
మెదడు స్కానింగ్ చేయలేదు
గుప్తతో అరుంధతి మాట్లాడటం చూసి ఎవరితో మాట్లాడుతున్నావు అక్కా అని అడుగుతుంది మిస్సమ్మ. అలాగే ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అని డాక్టర్ అడగడంతో అక్కతో అని చెబుతుంది మిస్సమ్మ. అక్కడ ఎవరూ లేకపోవడంతో అన్ని టెస్ట్‌లు చేశా గానీ మెదడు స్కానింగ్ చేయడం మర్చిపోయా అంటాడు డాక్టర్.
అలా ఎందుకు అంటున్నారని మిస్సమ్మ ఆశ్చర్యపోతుండగా అమర్ రావడంతో అమ్మాయిని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లండి. కానీ ఇంటికి వెళ్లాక వింతగా ప్రవర్తిస్తే, తనలో తానే మాట్లాడుకుంటే మెదడు స్కానింగ్ తీద్దామని చెబుతాడు. సరేనని అమర్ మిస్సమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాడు.
మిస్సమ్మ ఎప్పటికీ శత్రువే
భాగీ కోసం ఎదురు చూస్తున్న నిర్మల, శివరామ్, రాథోడ్ మిస్సమ్మను ఇంటికి వచ్చాక ఏ పనీ చేయనీయకూడదు. అమర్ దగ్గరుండి చూసుకునేలా చేయాలి. అప్పుడే వాళ్లిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది అంటాడు శివరామ్. సరేనంటాడు రాథోడ్. ముగ్గురూ కలిసి అమర్‌ని మార్చేందుకు ప్లాన్ చేస్తారు. అమర్, భాగీ ఇంటికి రావడంతో మిస్సమ్మను చూడటానికి అమ్ము బయల్దేరుతుంది. కానీ, అమ్ముని అంజు ఆపుతుంది.
మిస్సమ్మ ఎప్పటికీ మన శత్రువేనని అంటుంది అంజు. అమర్ మిస్సమ్మను జాగ్రత్తగా తీసుకురావడం చూసి నిర్మల, శివరామ్ ఆనందపడతారు. మిస్సమ్మ నడవలేదని ఎత్తుకుని మెట్ల పైకి తీసుకుని వెళ్తాడు అమర్. భాగీపై ఉన్న కోపం పోయి అమర్‌లో ప్రేమ కలుగుతుందా? మనోహరి గతం ఎలా బయటపడనుంది? అనే విషయాలు తెలియాలంటే జూన్ 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!