Meghasandesham: జీ తెలుగులోకి సరికొత్త సీరియల్ మేఘసందేశం.. మారనున్న ప్రముఖ సీరియల్స్ టైమింగ్స్-zee telugu new serial meghasandesam launch on june 10 and remaining serials premiere timings will change ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Meghasandesham: జీ తెలుగులోకి సరికొత్త సీరియల్ మేఘసందేశం.. మారనున్న ప్రముఖ సీరియల్స్ టైమింగ్స్

Meghasandesham: జీ తెలుగులోకి సరికొత్త సీరియల్ మేఘసందేశం.. మారనున్న ప్రముఖ సీరియల్స్ టైమింగ్స్

Sanjiv Kumar HT Telugu
Jun 06, 2024 03:17 PM IST

Zee Telugu New Serial Meghasandesam Premiere: ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో సీరియల్స్ అందించే జీ తెలుగు ఛానెల్ తాజాగా మరో కొత్త సీరియల్‌ను ప్రారంభించనుంది. జీ తెలుగు న్యూ సీరియల్ మేఘసందేశంతో ఇతర ప్రముఖ ధారావాహికల ప్రసార సమయాలు మారనున్నాయి.

జీ తెలుగులోకి సరికొత్త సీరియల్ మేఘసందేశం.. మారనున్న ప్రముఖ సీరియల్స్ టైమింగ్స్
జీ తెలుగులోకి సరికొత్త సీరియల్ మేఘసందేశం.. మారనున్న ప్రముఖ సీరియల్స్ టైమింగ్స్

Zee Telugu Meghasandesam Serial Launch: తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరించేందుకు సరికొత్త ప్రయోగాలు చేస్తుంటుంది జీ తెలుగు. వివిధ రకాలైన కామెడీ షోలు, టాలెంట్‌ను గుర్తించే రియాలిటీ షోలు, డ్యాన్స్ షోలు వంటి వాటితో ఆద్యంతం ఎంటర్టైన్‌మెంట్ అందుస్తుంటుంది. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్‌ కోసం ఎన్నో ధారావాహికలు జీ తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

జీ తెలుగు ఛానెల్ మొదటి నుంచే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఆక్టటుకునే కథలతో.. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలు, సీరియల్స్ అందిస్తూ సత్తా చాటుతోంది. ఎన్నో సీరియల్స్‌తో డబుల్ ఎంటర్టైన్‌మెంట్ అందించే జీ తెలుగు ఈ వారం కొత్తగా మరో సర్‌ప్రైజ్ ఇవ్వనుంది. అదే జీ తెలుగులో మరో కొత్త సీరియల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయింది.

జీ తెలుగులో సరికొత్తగా ప్రారంభం కానుంది మేఘసందేశం సీరియల్. భావోద్వేగం నిండిన కథతో ప్రేక్షకుల హృదయాలను తాకే అంశాలతో రూపొందుతున్న ఈ సరికొత్త సీరియల్​ మేఘసందేశం జూన్​ 10 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 10 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు ప్రసారం కానుంది.

మరింత ఆసక్తికరమైన కథాంశంతో జీ తెలుగు డైలీ సీరియల్​ మేఘసందేశం తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదంతోపాటు ఎమోషన్స్‌తో కట్టిపడేయనుంది. ఇక ఈ సీరియల్​ కథ విషయానికొస్తే.. ప్రధాన పాత్రదారులైన భూమి (గౌరీ), గగన్ (అభినవ్) ఇద్దరి జీవితాలకు బాల్యంలోనే పరీక్ష పెడుతుంది విధి.

అగ్నిప్రమాదంలో తల్లిని కోల్పోయిన భూమి చెత్తకుండిని చేరగా, తండ్రి చేసిన మోసంతో తండ్రి ప్రేమకు దూరంగా పెరుగుతాడు గగన్. వైవిధ్యమైన నేపథ్యాల నడుమ భిన్న ధ్రువాలైన భూమి, గగన్​ల జీవితాలు ఎలా ముడిపడ్డాయనేదే మేఘసందేశం సీరియల్ కథాంశం. మరి వారు ఒకరినొకరు ఎలా కలుసుకున్నారు.. వారి జీవితాలు ఎలా ముడిపడ్డాయో తెలియాలంటే ఈ సోమవారం నుంచి జీ తెలుగులో ప్రసారం కానున్న మేఘసందేశం సీరియల్​ తప్పక చూడాల్సిందే.

మేఘసందేశం సీరియల్‌లో గౌరీ, అభినవ్​ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బుల్లితెర పాపులర్ యాక్టర్స్ కౌశిక్, సుజిత కీలక పాత్రలు పోషించనున్నారు. అయితే, సరికొత్త సీరియల్​ మేఘసందేశం ప్రారంభంతో జీ తెలుగు ప్రముఖ సీరియల్స్​ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.

సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు సూర్యకాంతం, రాత్రి 9 గంటలకు జగద్ధాత్రి, రాత్రి 10 గంటలకు ప్రేమ ఎంత మధురం ప్రసారం కానున్నాయి. ఈ మార్పులను గమనించి అభిమాన సీరియల్స్​ మిస్​ కాకుండా చూడాలంటూ జీ తెలుగు ఏపీ, తెలంగాణ ప్రేక్షకులను కోరింది.

ఇదిలా ఉంటే జీ తెలుగు ఛానెల్‌లో అనేక పాపులర్ సీరియల్స్ ఉన్నాయి. వాటిలో నిండు నూరేళ్ల సావాసం ఒకటి. అయితే, కొత్త సీరియల్ మేఘసందేశం రాకతో నిండు నూరేళ్ల సావాసం ధారావాహిక ప్రసార సమయంలో ఎలాంటి మార్పు లేదు. ఎథావిధిగా ప్రస్తుతం వస్తున్న సమయంలోనే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ప్రీమియర్ కానుంది.

ఈ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో మేజర్ అమరేంద్ర వర్మగా రిచర్డ్ జోస్, అరుంధతిగా పల్లవి గౌడ, భాగమతి/మిస్సమ్మగా నిసర్గ గౌడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024