Nindu Noorella Saavasam Serial: తెలుగులో టాప్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగులో సరికొత్త సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (ఆగస్ట్ 14) నుంచి ప్రారంభం కానుంది. ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ లో ఏం జరగనుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఓ ఆర్మీ మేజర్, అతని నలుగురు పిల్లలు చుట్టూ సాగే కథే ఈ నిండు నూరేళ్ల సావాసం.
ఆర్మీ మేజర్ గా పని చేస్తుంటాడు అమరేంద్ర వర్మ (రిచర్డ్ జోస్). అతని భార్య అరుంధతి (పల్లవి గౌడ) మరణం తరువాత మేజర్ అమర్ ఒంటరివాడైపోతాడు. పిల్లలతో సహా కొడైకెనాల్ నుండి సికింద్రాబాదుకు చేరిన అమర్, స్నేహితురాలు మనోహరి (మహేశ్వరి) సాయంతో పిల్లల్ని చూసుకుంటాడు. కానీ అరుంధతి మాత్రం తన పిల్లల్ని చూసుకోవడానికి సరైన వ్యక్తి మనోహరి కాదని నమ్ముతుంది. అందుకే ఆత్మగా ఆ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని కనిపెట్టుకుంటుంది.
అమర్ జీవితంలోకి ఊహించని విధంగా వచ్చి చేరుతుంది RJ భాగమతి (నిసర్గ గౌడ). తన పిల్లలను చూసుకోవడానికి భాగమతే సరైన వ్యక్తి అని అరుధంతి ఎందుకు నమ్ముతుంది? భాగమతి పిల్లలకి ఎలా దగ్గరవుతుంది? భర్త, పిల్లలకు కనిపించని అరుంధతి ఆత్మ భాగమతికి మాత్రమే ఎందుకు కనిపిస్తుందో తెలియాలంటే నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ని ప్రతిరోజు తప్పకుండా చూడాల్సిందే.
ఇక సోమవారం (ఆగస్టు 14) రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం.. మేజర్ అమర్ భార్య అరుంధతి తన పిల్లలు, భర్త ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పూజ చేయించడానికి గుడికి వెళ్తుంది. అక్కడ పూజారి కోరుకున్న కోరికలు నెరవేరాలంటే నీల్కురుంజి పూలతో దేవుడికి పూజ చేస్తే మంచిదని, తప్పక ఫలితం ఉంటుందని చెబుతాడు.
ఆ పూలకోసం వెళ్లిన అరుంధతి లోయలో పడిపోతుంది. సడెన్‌గా మెలకువ రావడంతో జరిగిందంతా కల అని అర్థం చేసుకుంటుంది అరుంధతి. కానీ తనకు వచ్చిన కల గురించి తన భర్త అమర్‌కి చెప్పేందుకు ఆర్మీ బేస్ క్యాంప్‌కి వెళ్తుంది. ఎన్నిసార్లు వద్దని చెప్పినా క్యాంప్‌కి వచ్చినందుకు అరుంధతిని కోప్పడతాడు అమర్. తన కల గురించి చెప్పగానే అలాంటివేం పట్టించుకోవద్దని సర్దిచెప్పి పంపిస్తాడు.
తనకు ఎంతో ఇష్టమైన ఆర్జే భాగమతి షోకి టైమ్ అవడంతో ఇంటికి వచ్చి ఎఫ్ఎమ్ ఆన్ చేస్తుంది అరుంధతి. భాగమతి షో మొదలవగానే అరుంధతే మొదటి కాల్ చేసి కబుర్లు చెప్పడం వాళ్లిద్దరికీ అలవాటు. అలా వారి మధ్య స్నేహం కుదురుతుంది. ఆ చనువుతోనే తనకు వచ్చిన కల గురించి భాగమతికి చెబుతుంది అరుంధతి.
అలా చనిపోయినట్లు కల రావడం వల్ల పూర్ణాయిష్షు ఉంటుందని, భయపడొద్దని చెబుతుంది భాగమతి. అరుంధతికి వచ్చిన కల నిజమవనుందా? అరుంధతి, అమర్ జీవితంలో సంభవించనున్న అతిపెద్ద ప్రమాదం ఏంటి? తెలుసుకోవాలంటే ఈరోజు ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం మొదటి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!