Star Maa Power Hour: స్టార్ మా పవర్ అవర్.. టెలివిజన్ చరిత్రలో మొదటిసారిగా! ఆ రెండు సీరియల్స్ టెలికాస్ట్-star maa power hour satyabhama oorvasivo rakshasivo serials telecast ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Power Hour: స్టార్ మా పవర్ అవర్.. టెలివిజన్ చరిత్రలో మొదటిసారిగా! ఆ రెండు సీరియల్స్ టెలికాస్ట్

Star Maa Power Hour: స్టార్ మా పవర్ అవర్.. టెలివిజన్ చరిత్రలో మొదటిసారిగా! ఆ రెండు సీరియల్స్ టెలికాస్ట్

Sanjiv Kumar HT Telugu
Dec 27, 2023 06:51 PM IST

Star Maa Power Hour: ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ స్టార్ మా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్టార్ మా పవర్ అవర్ పేరిట రెండు సీరియళ్లను టెలికాస్ట్ చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

స్టార్ మా పవర్ అవర్.. టెలివిజన్ చరిత్రలో మొదటిసారిగా! ఆ రెండు సీరియల్స్ ప్రసారం
స్టార్ మా పవర్ అవర్.. టెలివిజన్ చరిత్రలో మొదటిసారిగా! ఆ రెండు సీరియల్స్ ప్రసారం

Star Maa Power Hour Serials: తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ ఉన్న ఛానెళ్లలో స్టార్ మా ఒకటి. తాజాగా స్టార్ మా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. స్టార్ మా పవర్ అవర్ అనే సరికొత్త పద్ధతితో ముందుకు రానుంది. ఈ స్టార్ మా పవర్ అవర్‌ను విజయవంతంగా ప్రారంభించి.. టెలివిజన్‌‌లొనే ఎంతో ఆకట్టుకునే విధమైన చర్యకు పునాది వేశారు. ఇందులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "సత్యభామ", "ఊర్వసి వో రాక్షసి వో" సీరియల్స్ ప్రసారం చేస్తున్నారు.

డిసెంబర్ 18న ప్రీమియర్, పవర్ అవర్ రాత్రి 9:30 గంటలకు "సత్యభామ"తో ప్రారంభమైంది. ఆ తర్వాత రాత్రి 10:00 గంటలకు "ఊర్వసి వో రాక్షసి వో" ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం అవుతుంది. ప్రముఖ టెలివిజన్ జంట యష్, వేద నటించిన "సత్యభామ" డిసెంబర్ 18న రాత్రి 9:30 గంటలకు ప్రారంభమైంది. ఈ మనసు దోచే కథ, పాత్రల సంబంధాలలోని వైవిధ్యత వీక్షకులను హత్తుకుంటాయి. అలాగే ప్రేక్షకులకు ప్రేమ, సాంగత్యంపై కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. సీరియల్‌లో యష్, వేదల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి.

ఇక రాత్రి 10:00 గంటలకు "ఊర్వసి వో రాక్షసి వో" సీరియల్‌ను టెలికాస్ట్ చేస్తున్నారు. ఇది ఒక గ్రిప్పింగ్ రివెంజ్ డ్రామా. అదే రాత్రి ప్రారంభమైన ఈ సీరియల్‌లో ఓ యువతికి జరిగిన అన్యాయానికి న్యాయం కోరుతూ పోరాడే శక్తివంతమైన కథను వివరిస్తుంది. అత్యాధునిక నిర్మాణ విలువలు, వేగవంతమైన కథనంతో.. "ఊర్వసి వో రాక్షసి వో" ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 నుంచి 10:30 గంటల వరకు పవర్ అవర్ సమయంలో "సత్యభామ", "ఊర్వసి వో రాక్షసి వో" సీరియళ్లను బ్యాక్-టు-బ్యాక్ ప్రసారం చేయడంతో వారికి వీక్షకుల ఆదరణ మరింత పెరిగిందని మేకర్స్ చెబుతున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024