NNS May 24th Episode: అమర్ గదిలోకి భాగీ.. మనోహరికి చుక్కలు.. నీలకు వార్నింగ్.. రూటు మార్చిన పిల్లలు!
Nindu Noorella Saavasam May 24th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 23వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లో కోడలిగా అధికారం చెలాయిస్తుంటుంది భాగమతి. అమర్ రూమ్‌లోకి వెళ్తుంది. ఆ గదిలోకి ఎవరు పడితే వాళ్లు రావొద్దని పరోక్షంగా వార్నింగ్ ఇస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 24th May Episode) ఇంట్లోకి వెళ్లిన భాగీని అమర్ ఏమంటున్నాడో చూడాలనుకుంటుంది అరుంధతి. గుప్త కూడా వస్తానంటే వద్దని వారిస్తుంది. కాసేపు వాదించుకుని ఇద్దరూ కలిసి ఇంట్లో ఏం జరుగుతుందో చూడటానికి వెళ్తారు. ఇంట్లోకి వచ్చిన మిస్సమ్మ నీలను తన లగేజ్ అమర్ రూమ్‌లో పెట్టమని అంటుంది.
వేరే వాళ్ల బట్టలు
ఇక నుంచి తమ గదిలోకి ఎవరు పడితే వాళ్లు ఇష్టమొచ్చినట్లు రావడం, వెళ్లడం కుదరదని పరోక్షంగా మనోహరికి వార్నింగ్ ఇస్తుంది. భాగీ తన లగేజ్‌తో అమర్ గదిలోకి వెళ్లడం చూసి అరుంధతి పరిగెడుతుంది. లోపల ఏం జరుగుతుందో చూద్దామని. వద్దని వారిస్తాడు గుప్త. అమర్ భాగీకి అడ్డుపడి తన బట్టలు ఉన్న చోట వేరేవాళ్ల బట్టలు పెట్టడానికి ఒప్పుకోనంటాడు. ఎంత అరిచినా వినకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది భాగీ.
పిల్లల దగ్గరకు
చివరికి భాగీని ఏమనలేక బయటకు వెళ్లిపోతాడు అమర్. భాగీని ఇంట్లో నుంచి అమర్ వెళ్లగొట్టాడా అని నీలను అడుగుతుంది మనోహరి. ఆమెను ఇంట్లో నుంచి పంపించడం కాదు ఏకంగా అమర్ అయ్యగారి రూమ్‌లో సెటిల్ అయ్యిందని చెబుతుంది నీల. అదేంటి.. అమర్ భాగీని పంపిస్తాడనుకుంటే ఏం అనలేదా అని ఆశ్చర్యపోతుంది మనోహరి. మరోవైపు పిల్లల దగ్గరకు వెళ్లి వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది భాగీ.
మాట విన్నట్లు నటన
మిస్సమ్మ ఎంత కాకా పట్టినా ఆమె మాట వినకూడదని ముందే ప్లాన్ చేసుకుంటారు పిల్లలు. అనుకున్నట్లుగానే మిస్సమ్మ తమకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తే కుదరదని చెప్పి నిర్మల దగ్గరకు వెళ్లి ఆమెను తిట్టమని అంటారు. అసలు ఇప్పుడు మిస్సమ్మ మిమ్మల్ని ఏమన్నది కోప్పడటానికి అని అంటుంది నిర్మల. చేసేదేం లేక మిస్సమ్మ మాట విన్నట్లు నటిద్దామనుకుంటారు పిల్లలు. వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయిందని నవ్వుకుని హాలీడేస్‌లో ఎంజాయ్ చేసింది చాలు.. ఇకనుంచి టైమ్ టేబుల్ ఫాలో అవుతూ చదువుకోవాలంటుంది మిస్సమ్మ.
నీలతో మనోహరిని
డైనింగ్ టేబుల్ మీద కూర్చుని నీలని పిలిచి వార్నింగ్ ఇస్తుంది మిస్సమ్మ. ఇంట్లో జీతం తీసుకుంటూ మనోహరి దగ్గర పనిచేయడం ఏంటని ఇక నుంచి వంటింట్లో కాకుండా ఎక్కడ కనిపించినా ఊరుకోనని అంటుంది. సరేనంటూ లోపలకు వెళ్తుంది నీల. మను.. మను.. అంటూ మనోహరిని పిలుస్తుంది భాగీ. ఏంతకీ పలకకపోవడంతో నీలని పంపించి పిలవమంటుంది. నీల వెళ్లి మనోహరిని పిలుస్తుంది. అది పిలిస్తే నేను రావడం ఏంటే అని కోప్పడుతుంది మనోహరి.
ఇంట్లోంచి గెంటేస్తుంది
ఈరోజు మిస్సమ్మ ఉన్న స్పీడ్‌కి మీరు ఇప్పుడు రాకపోతే తన మాట వినలేదని ఇంట్లో నుంచి పంపించేస్తుందమ్మా అంటుంది నీల. సరేనని కిందకు వచ్చి ఎందుకు పిలిచావ్ అని మిస్సమ్మను అడుగుతుంది మనోహరి. పిలిస్తే వస్తావో లేదోనని పిలిచానంటుంది మిస్సమ్మ. ఏం జరుగుతుందమ్మా.. అని అడుగుతుంది నిర్మల.
బాగా మిస్ అయ్యాను
ఏం లేదత్తయ్యా.. మనోహరిని నిన్నట్నుండి బాగా మిస్సయ్యాను అందుకే మాట్లాడుతున్నా మీరు లోపలకు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని నిర్మలను లోపలకు పంపిస్తుంది మిస్సమ్మ. భాగమతి ఏం చేయబోతోంది? మిస్సమ్మను మనోహరి అడ్డుకుంటుందా? అనే విషయాలు తెలియాలంటే మే 25న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!