NNS May 20th Episode: బయటపడిన మనోహరి బాగోతం.. అందరిలో మొదలైన అనుమానం.. భాగీని వదిలి బయల్దేరిన అమర్​​​​!-nindu noorella saavasam serial may 20th episode bhagamati amar doubt on manohari nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns May 20th Episode: బయటపడిన మనోహరి బాగోతం.. అందరిలో మొదలైన అనుమానం.. భాగీని వదిలి బయల్దేరిన అమర్​​​​!

NNS May 20th Episode: బయటపడిన మనోహరి బాగోతం.. అందరిలో మొదలైన అనుమానం.. భాగీని వదిలి బయల్దేరిన అమర్​​​​!

Sanjiv Kumar HT Telugu
May 20, 2024 05:59 AM IST

Nindu Noorella Saavasam May 20th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 20వ తేది ఎపిసోడ్‌‌లో సరస్వతిని మనోహరి దిండు పెట్టి చంపబోతుంటే భాగీ తలుపు తట్టి పిలుస్తుంది. అనంతరం తను వెతుకుతున్నది ఎవరినో రామ్మూర్తి, భాగీకి ఫొటో చూపిస్తాడు అమర్. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 20వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 20వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 20th May Episode)అమర్​ పిలుస్తున్నాడు వెళ్లండని చెప్పి రామ్మూర్తిని సరస్వతి దగ్గర లేకుండా బయటకు పంపించి ఆమెను చంపాలని చూస్తుంది మనోహరి. లోపల ఉన్నామెకి నీళ్లు ఇవ్వమని మిస్సమ్మను పంపిస్తాడు రామ్మూర్తి. ఇంటికి వెళ్లేందుకు బయల్దేరిన అమర్​ని ఇంకో రెండు రోజులు ఉండమని అడుగుతాడు రామ్మూర్తి.

అప్పుడే భాగీ ఎంట్రీ

నాకు అర్జెంట్​ పని ఉందండి.. కావాలంటే మళ్లీ ఎప్పుడైనా వస్తాం అంటాడు అమర్​. సరస్వతి ముఖంపై దిండుతో నొక్కి చంపాలనుకుంటుంది మనోహరి. కిటికీలో నుంచి మనోహరి చేస్తున్న పని చూసి అరుంధతి బాధపడుతుంది. మనల్ని పెంచిన మేడమ్​ని ఏం చేయకే అని ప్రాధేయపడుతుంది. కానీ, మనోహరి కోపంగా సరస్వతిని చంపేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే భాగీ నీళ్లు తీసుకుని వచ్చి తలుపు మూసి ఉండటంతో తీయమని పిలుస్తుంది.

ఏమైంది భయపడుతున్నారు

భయపడిన మనోహరి తలుపుతీసి గాలేయట్లేదని పెట్టానంటుంది. భయంతో వణికిపోతున్న సరస్వతిని చూసి ఏమైందండి.. ఎందుకు అలా భయపడుతున్నారు అని అడుగుతుంది భాగమతి. నిజం చెప్పొద్దని సరస్వతిని భయపెడుతుంది మనోహరి. అప్పుడే భాగీని అమర్​ వెళ్లిపోతున్నాడని రామ్మూర్తి పిలవడంతో వెళ్లిపోతుంది.

ఆమె లోపలే ఉంది

సరస్వతి గురించి అమర్​కి తెలియకముందే అక్కడనుంచి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది మనోహరి. కానీ, అమర్​ని అడిగి ఆమె ఫొటో చూసిన భాగీ, రామ్మూర్తి లోపల ఉంది ఆమెనే అని చెప్పి అమర్​ని లోపలకి తీసుకొస్తారు. అమర్​ని మనోహరి ఆపాలని ప్రయత్నించి విఫలమవుతుంది. భాగీ మాటవిని లోపలకు వచ్చిన అమర్​ అక్కడ ఎవరూ ఉండకపోవడంతో ఆశ్చర్యపోతాడు. ఎవరూ లేరు కావాలనే వీళ్లు నిన్ను మళ్లీ మోసం చేయాలనుకుంటున్నారంటుంది మనోహరి.

వెతికి తీసుకొస్తాం

ఆమెని మనోహరి కూడా చూసిందని చెప్పడంతో అమర్​లో అనుమానం మొదలవుతుంది. ఆమె ఎక్కువ దూరం వెళ్లి ఉండదు ఇప్పుడే వెతికి తీసుకొచ్చి మేం అబద్ధం చెప్పలేదని నిరూపించుకుంటాం అని సరస్వతిని వెతకడానికి వెళ్తారు భాగీ, రామ్మూర్తి. వెంటనే బాబ్జికీ ఫోన్​ చేసి సరస్వతిని త్వరగా పట్టుకోమని చెబుతుంది మనోహరి.

అనుభవించే రోజు

ఇక్కడ జరుగుతున్నది చూసి చింతించేందుకేనా బాలిక మా ప్రభువుతో వాదులాడి సూర్యాస్తమయం వరకు సమయం తీసుకుంది అంటాడు గుప్త. మనోహరి చేస్తున్న పాపాలకి ఫలితం అనుభవించే రోజు వచ్చేసిందంటుంది అరుంధతి. ఆ మాటలు విని మాయాదర్పణంలో ఏమైనా చూసితివా అని అడుగుతాడు గుప్త. లేదంటుంది అరుంధతి. మనోహరి తనని చంపేస్తుందనే భయంతో పారిపోతుంది సరస్వతి.

వెళ్లిపోయిన అమర్

ఎంత వెతికినా సరస్వతి దొరకకపోవడంతో నిరాశగా ఇంటికి చేరుతారు రామ్మూర్తి, భాగీ. మనోహరి మాటలు నమ్మి నిజంగానే వాళ్లు తనని మోసం చేశారనుకున్న అమర్ పిల్లలతో సహా​ అక్కడ నుంచి బయల్దేరతాడు. భాగీని వదిలి బయల్దేరుతున్న అమర్​ని చూసి బాధతో కూతురిని కూడా ఆయనతో వెళ్లమని బతిమాలతాడు.

సరస్వతి కలుస్తుందా

అమర్​ భాగీని రమ్మని పిలుస్తాడా? అమర్​ని సరస్వతి కలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే మే 21న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

టీ20 వరల్డ్ కప్ 2024