NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్‌కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి
Nindu Noorella Saavasam May 17th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 17వ తేది ఎపిసోడ్‌లో మళ్లీ భూలోకానికి గుప్తతో అరుంధతి వస్తుంది. తాను వెళ్లనని గుప్తా అంటాడు. సాయంత్రంలోపు రాకుంటే తానే వస్తానని యముడు చెబుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 17th May Episode) స్పృహ తప్పి పడిపోయిన సరస్వతిని ఇంటికి తీసుకొస్తాడు రామ్మూర్తి. దారిన పోయేవారందరినీ తెచ్చి నెత్తిన ఎక్కించుకుంటారెందుకు అని కోప్పడుతుంది మంగళ. ఆమెకి స్పృహ వచ్చేవరకు మన ఇంట్లోనే ఉంచుదాం నాన్న అంటుంది భాగీ. సరేనమ్మా అంటాడు రామ్మూర్తి.
మనోహరి గురించి
ఎవరినో తీసుకొచ్చారు ఎవరామె అని మంగళని అడుగుతుంది మనోహరి. ఆయనకి ఊరంతా బంధువులే.. ఎవరికో ఆరోగ్యం బాలేదంటే తీసుకొచ్చారు అంటూ చిరాకు పడుతుంది మంగళ. ఇంతలో మనోహరికి ఫోన్ రావడంతో బయటకు వెళ్లిపోతుంది. జాగింగ్‌కి వెళ్లిన అమర్‌కి మనోహరిని వెతుకుతున్న బీహారీ గ్యాంగ్ ఎదురుపడుతుంది. ఆ వ్యక్తి అమర్‌ని మనోహరి గురించి అడగాలనుకుంటాడు.
ఇంతలో అమర్ వాళ్లని గుర్తుపట్టి ఆరోజు పెళ్లికి మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడుగుతాడు. మమ్మల్ని ఎవరూ పిలవలేదు సార్.. మేమే ఓ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాం అని చెబుతాడు ఆ బీహారీ వ్యక్తి. ఎవరామె.. తప్పిపోయిందా? అంటాడు అమర్. తప్పిపోయేంత తెలివితక్కువ మనిషి కాదు. ఆమె చూపు సోకితే ఎంతటి మంచి కుటుంబమైనా నాశనం కావాల్సిందే అంటాడు. సరేనండి నేను వెళ్తాను అని అక్కడనుంచి వెళ్లిపోతాడు అమర్.
చూడకూడనిది చూసితివా
ఆయనని మనోహరి ఫొటో చూపించి అడగాల్సిందే అనుకుంటాడు బీహారీ వ్యక్తి. మరోవైపు యముడు క్షమించడంతో సంతోషంతో అరుంధతి దగ్గరకు పరిగెత్తుకొచ్చి బాలిక.. బాలిక.. మనకు లోపలకు ప్రవేశానికి అనుమతి దొరికినది అంటాడు గుప్త. నేను లోపలకు రాలేను గుప్తగారు అంటుంది అరుంధతి. గుప్త అనుమానంతో మాయాదర్పణంలో ఏమైనా చూడకూడనిది చూసితివా అని అడుగుతాడు. అప్పుడే యముడు వచ్చి ఇద్దరినీ లోపలకు రమ్మంటాడు.
కానీ, అరుంధతి లోపలకు రాలేనని, తనకి కొంత సమయం కావాలని అడుగుతుంది. ఒకసారి యమలోకానికి వచ్చిన తర్వాత తిరిగి భూలోకానికి వెళ్లడం కుదరదని యముడు చెప్పగానే.. యముడిని మెప్పించిన వారందరినీ గుర్తు చేసి మిమ్మల్నెవరు మోసం చేయగలరు అంటుంది. సరేనన్న యముడు సూర్యాస్తమయం వరకు నీకు సమయం ఇస్తున్నా. చిత్రగుప్తా.. నువ్వు కూడా బాలికతో వెళ్లి సూర్యాస్తమయంలోపు తిరిగి తీసుకుని రమ్మని అంటాడు.
మీరు ఇరుక్కుపోతారు
నేను వెళ్లను ప్రభు.. ఈ బాలికతో వెళ్తే తిరిగి రావడం అసంభవం అంటాడు గుప్త. సాయంత్రంలోపు రాకపోతే నేనే అక్కడకు వస్తాను అంటాడు యముడు. వస్తే మీరూ ఇరుక్కుపోతారు అంటాడు గుప్త. చెప్పినది చేయుము అని మాయమవుతాడు యముడు. అరుంధతిని తీసుకుని భూలోకానికి బయలుదేరతాడు గుప్త.
ఆడుకుని ఇంటికి చేరిన పిల్లల్ని ఆపి నేను అమర్‌తో మాట్లాడతాను. మీ డాడీ రాగానే ఇక్కడనుంచి వెళ్లిపోదాం అనండి అంటుంది మనోహరి. ఎందుకు ఆంటీ.. ఇప్పుడు మాకు హాలీడేస్ కదా.. ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉందాం అంటారు పిల్లలు. ఎంతో కష్టపడి వాళ్లని మిస్సమ్మకి వ్యతిరేకంగా మారిస్తే ఇలా జరుగుతుందేంటా అని పిచ్చిపిల్లలు.. మీరు ఇంత త్వరగా మిస్సమ్మ బుట్టలో పడిపోతారనుకోలేదు, తను చేసిన మోసాన్ని మరిచిపోయి క్షమిస్తారనుకోలేదు అంటుంది మనోహరి.
మర్చిపోయినట్లే కదా
మేము ఎప్పుడు మిస్సమ్మని క్షమించాం.. మేం ఇక్కడ ఉంటామని చెప్పాం. కానీ మిస్సమ్మ చేసిన మోసాన్ని క్షమించామని అనలేదు కదా అంటారు పిల్లలు. మీరు ఇక్కడే ఉంటే మిస్సమ్మ చేసిన పనిని మర్చిపోయినట్లే కదా అని మనోహరి అనడంతో సరే ఆంటీ.. డాడీ రాగానే ఇక్కడ నుంచి వెళ్లిపోదామంటాం అంటారు పిల్లలు.
జాగింగ్ చేసి వచ్చిన అమర్‌ని ఏమైంది బాబు అని అడుగుతాడు రామ్మూర్తి. రాత్రి నుంచి కొంచెం తలనొప్పిగా ఉందండి అంటాడు అమర్. రాత్రి పడుకోకుండా అలాంటి పనులు చేస్తే తలనొప్పి కాకుండా ఏముంటుంది అంటుంది మిస్సమ్మ. తలనొప్పికి టాబ్లెట్ ఇస్తానంటున్న మనోహరిని ఆపేసి అమర్‌కి నలుగుపెట్టి స్నానం చేయించడానికి ఏర్పాట్లు చేయిస్తాడు రామ్మూర్తి.
అమర్‌కు భాగీ మర్దన
వద్దంటున్నా వినకుండా భాగీని అమర్‌కి నూనె మర్దనా చేయమంటాడు. తలనిండా నూనె పోయడంతో భాగీని కోప్పడతాడు అమర్. భాగీ చేసిన పనికి అమర్ ఏం చేస్తాడు? సరస్వతి నిజం చెప్పకుండా మనోహరి ఎలా ఆపుతుంది? అనే విషయాలు తెలియాలంటే మే 18న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!