NNS May 15th Episode: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్​- ఒక్కటైన అమర్​, భాగీ- తప్పించుకున్న సరస్వతి- నిజం తెలుసుకున్న అరుంధతి-nindu noorella saavasam serial may 15th episode saraswathi escape from bobji nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns May 15th Episode: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్​- ఒక్కటైన అమర్​, భాగీ- తప్పించుకున్న సరస్వతి- నిజం తెలుసుకున్న అరుంధతి

NNS May 15th Episode: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్​- ఒక్కటైన అమర్​, భాగీ- తప్పించుకున్న సరస్వతి- నిజం తెలుసుకున్న అరుంధతి

Sanjiv Kumar HT Telugu
May 15, 2024 06:12 AM IST

Nindu Noorella Saavasam May 15th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 15వ తేది ఎపిసోడ్‌‌లో మనోహరి ప్లాన్ బెడిసికొడుతుంది. తాను వశీకరణం చేద్దామనుకున్న పాలను అమర్‌కు భాగమతి ఇవ్వడంతో మిస్సమ్మను ముద్దు పెట్టుకుంటాడు అమర్. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 15వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 15వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 15th May Episode) సరస్వతి మేడమ్​ తనతోపాటే ఊర్లోకి వస్తోందని మనోహరికి ఫోన్​ చేసి చెప్తాడు డ్రైవర్​. చంపేయకుండా తీసుకురావడం ఏంటీ.. ఆమెని త్వరగా చంపేయమంటుంది మనోహరి. కానీ, తన చేతికి డబ్బులు అందితేనే ఆమెని చంపుతానంటాడు డ్రైవర్​.

ఇద్దరి ప్రాణాలకు ముప్పు

కానీ, మేడమ్​ని త్వరగా చంపకపోతే అమర్​కి నిజం తెలిసిపోతే ఇద్దరి ప్రాణాలకి ముప్పు అని బెదిరించి త్వరగా చంపేయమంటుంది మనోహరి. సరే అంటూ ఫోన్​ కట్ చేసిన డ్రైవర్​ ఎదురుగా సరస్వతి మేడమ్​ నిల్చోవడం చూసి షాకవుతాడు. తనను చంపేందుకు వెంటపడిన డ్రైవర్​ నుంచి తప్పించుకోడానికి పరిగెత్తి ఓ దగ్గర పడిపోతుంది సరస్వతి.

కాపాడిన బీహారి గ్యాంగ్

అప్పుడే అటుగా వచ్చిన బీహారి ముఠా డ్రైవర్​ని కొట్టి సరస్వతి మేడమ్​ని కాపాడతారు. భయంతో సరస్వతి అక్కడనుంచి పారిపోతుంది. మనోహరి చెప్పినట్లే వశీకరణ మందు తెచ్చి పాలల్లో కలుపుతుంది మంగళ. మనోహరిని పిలిచి ఆ పాలను అమర్​కి ఇమ్మని చెబుదామని బయటకు వెళ్తుంది. ఇంతలో అటుగా వచ్చిన రాథోడ్​ ఆ పాలను మిస్సమ్మకు ఇచ్చి అమర్​కి ఇమ్మని చెబుతాడు.

ఏం కలిపి మోసం చేద్దామని

తనని చూస్తేనే మండిపడుతున్న ఆయనకు తన పాలు ఇవ్వనంటుంది మిస్సమ్మ. కానీ, రాథోడ్​ నచ్చజెప్పి మిస్సమ్మ చేతిలో పాలగ్లాసు పెట్టి అమర్​కి ఇమ్మని అంటాడు. భయంభయంగా పాల గ్లాసు తీసుకెళ్లి అమర్​కి ఇస్తుంది. పాలల్లో ఏం కలిపి నన్ను మోసం చేద్దామనుకుంటున్నావు అంటాడు అమర్. అసలు ఆ పాలు కలిపింది రాథోడ్​ అని కావాలంటే పిలిచి అడగమంటుంది మిస్సమ్మ.

ప్రవర్తనలో మార్పు

కోపంగా పాలు తీసి పారబోయాలనుకుంటాడు అమర్​. కానీ, ఆగి వాటిని తాగుతాడు. పాలు తాగగానే అమర్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మిస్సమ్మ భయపడుతుండగా వెళ్లి డోర్​ పెడతాడు. అమర్​ డోర్​ వేయడం చూసి కంగారు పడుతూ పిలుస్తుంది మనోహరి. ఆ పాలు భాగీ అమర్​కి ఇచ్చేసినట్టుందని కంగారు పడుతుంది.

చిత్రగుప్తుడు చేసినట్లే

కానీ, అమర్​ తలుపేసి భాగీ దగ్గరకు వెళ్తాడు. వశీకరణ మందు ప్రభావంతో భాగీని దగ్గరకు తీసుకుని ముద్దుపెడతాడు. చిత్రగుప్తడు నిద్రపోతుడంటంతో మెల్లిగా మాయాదర్పణం తెరుస్తుంది అరుంధతి. కానీ, దాంట్లో ఏం కనపడకపోవడంతో గుప్త చేతికున్న ఉంగరం తీసి చిత్రగుప్తుడు చెప్పినట్లే చెప్పి గతం చూసేందుకు సిద్ధపడుతుంది.

నిజం తెలుసుకున్న అరుంధతి

ఆ మాయాదర్పణంలో మనోహరి అరుంధతి హత్యకు ప్లాన్​ వేయడం, భాగీ కొడైకెనాల్లో తనని కలవలేకపోవడం, యాక్సిడెంట్​లో తను చనిపోవడం అంతా చూస్తుంది అరుంధతి. తనను చంపించింది మనోహరి అని తెలుసుకుని షాకవుతుంది అరుంధతి. వెంటనే మాయాదర్పణం మూసేసి ఉంగరం తీసి చిత్రగుప్తుడి వేలికి పెడుతుంది.

అమర్‌ను సరస్వతి కలుస్తుందా

నర్సాపూర్​ వెళ్లిన సరస్వతి అమర్​ని కలుస్తుందా? మనోహరి బండారం ఎలా బయటపడుతుంది? అనే విషయాలు తెలియాలంటే మే 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!