NNS April 22nd Episode: అమర్​ని పెళ్లి చేసుకుంటానన్న భాగీ- పిల్లలకు ప్రామిస్​- ఇరుక్కున్న మంగళ- బిహారీలతో అమర్ తండ్రి-nindu noorella saavasam serial april 22nd episode bhagamathi promise to children nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 22nd Episode: అమర్​ని పెళ్లి చేసుకుంటానన్న భాగీ- పిల్లలకు ప్రామిస్​- ఇరుక్కున్న మంగళ- బిహారీలతో అమర్ తండ్రి

NNS April 22nd Episode: అమర్​ని పెళ్లి చేసుకుంటానన్న భాగీ- పిల్లలకు ప్రామిస్​- ఇరుక్కున్న మంగళ- బిహారీలతో అమర్ తండ్రి

Sanjiv Kumar HT Telugu
Apr 22, 2024 11:54 AM IST

Nindu Noorella Saavasam April 22nd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌‌లో మనోహరి పెళ్లి ఆపేందుకు తానే అమర్‌ను వివాహం చేసుకుంటానని మిస్సమ్మ అంటుంది. అలా ఎలా అంటావ్ అని పిల్లలు అడుగుతారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 22nd April Episode) తనేం పాపం చేశానని తన కుటుంబానికి ఇలాంటి కష్టం వచ్చిందని చిత్రగుప్తని అరుంధతి నిలదీస్తుంది. ఎలాగైనా పౌర్ణమి ఘడియలు దాటేలోపు అమర్​ చేత భాగీ మెడలో తాళి కట్టిస్తానని అంటుంది. మిస్సమ్మకి అసలు తనని వివాహం చేసుకోవడం ఇష్టం ఉందో లేదో అంటాడు చిత్రగుప్తుడు.

పెళ్లిలోకి ఎలా వచ్చాం

అందుకు అది దైవ నిర్ణయము. ఆ దేవుడే చూసుకుంటాడు అంటుంది అరుంధతి. మనోహరి తరఫున వచ్చామని చెప్పడంతో బిహారీ గ్యాంగ్​ని పెళ్లి అయ్యేంతవరకు ఉండి భోజనం చేసి వెళ్లమంటాడు అమర్​ తండ్రి. పెళ్లి మండపంలో కూర్చుని అమర్​ ఆలోచిస్తూ ఉంటాడు. కళ్యాణ మండపం బయట అరుంధతి లోపలికి ఎలా వెళ్లాలి అని తిరుగుతూ ఉంటుంది. పిల్లలు మిస్సమ్మ పెళ్లిలోకి ఎలా వచ్చేమో, ఎలా ఆపాలో ఆలోచిస్తూ ఉంటారు.

పెళ్లి కుమారుడిని తీసుకుని రండి అని పంతులుగారు అనడంతో అమర్​ని రాథోడ్ తీసుకెళ్తాడు. మిస్సమ్మని పిల్లలు ఏదో ఒకటి చేయమని చెప్పి పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మిస్సమ్మ.. మిస్సమ్మ డాడ్ కూడా వచ్చేసారు. ఏదో ఒకటి చెయ్యి మిస్సమ్మ ప్లీజ్ అంటారు పిల్లలు. ఇందాకటి నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి చెయ్యి అని నస పెడుతూనే ఉన్నారు. ఆ ఒకటి ఏంటి మీకు తెలిస్తే చెప్పండి ఇప్పుడే అది చేసేస్తా అంటుంది మిస్సమ్మ.

పెళ్లి కూడా అయిపోతుంది

ఆ ఒక్కటి ఏదో తెలియనప్పుడు మాకెందుకు పెళ్లి ఆపుతానని చెప్పి ప్రమాణం చేసి ఇక్కడికి పట్టుకొచ్చావు అంటారు పిల్లలు. అదే అర్థం కాక అప్పటినుండి ఇప్పటివరకు ఆలోచిస్తూనే ఉన్నాను. ఆగండి అయ్యో అంటుంది మిస్సమ్మ. నువ్వు అలా ఆలోచిస్తూ ఉంటే పెళ్లి కూడా అయిపోతుంది మిస్సమ్మ.. అంటారు పిల్లలు.

ఈ పెళ్లి జరగకూడదు మిస్సమ్మ. మనోహరి ఆంటీ అంటే మాకు ఇష్టం లేదు. అలాంటిది అమ్మ స్థానం మనోహరీకి ఎందుకు ఇస్తాం. మా లాస్ట్ హోప్ నువ్వే మిస్సమ్మ.. ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్. ఎలా అయినా మనోహర్ ఆంటీ నుండి మమ్మల్ని మా డాడీ ని కాపాడవా.. అంటారు పిల్లలు. మీకు ఇంటి దగ్గర ఎందుకు మాటిచ్చానో తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్నా.. మీ డాడీ మనోహరి మెడలో తాళి కట్టడు అని మాటిస్తుంది మిస్సమ్మ.

ఎలా ఆపుతావ్

నీ దగ్గర ప్లాన్ లేదు ఇందాక మాట్లాడింది కూడా గుర్తులేదు అంటున్నావు. ఇప్పుడు మాట్లాడేది ఇంకాసేపటికి గుర్తు లేదు అంటున్నావు. అలాంటప్పుడు నీ మాట ఎలా నమ్ముతాము. పైగా పెళ్లి పీటల వరకు వచ్చేసింది. డాడీ పీటల మీద కూర్చున్నాడు మిస్సమ్మ. ఇంకాసేపు అయితే మనోహరి ఆంటీ కూడా కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పు మిస్సమ్మ పెళ్లి ఎలా అవుతావు అని అడుగుతారు పిల్లలు. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేస్తా ఏదో ఒకటి వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు... అప్పుడు ఆ తాళి నేనే కట్టించేసుకుంటా అంటుంది మిస్సమ్మ.

అప్పుడు పెళ్లి ఆగిపోతుంది. ఆ మనోహరి కూడా ఇంకోసారి పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయదు. మీరు కూడా ఎలాంటి పిచ్చి పిచ్చి.. అంటూ ఆగిపోతుంది. ఏంటి మిస్సమ్మ అలా అన్నావు అంటారు పిల్లలు. నేనెందుకు అలా అన్నాను.. అసలు ఏమైంది నాకు తెలియకుండా.. ఎక్కడపడితే అక్కడికి వచ్చేస్తున్నాను.. ఏది పడితే అది మాట్లాడేస్తున్నా.. అంటుంది మిస్సమ్మ. తెలియకుండా అలా ఎలా మాట్లాడుతావ్ మిస్సమ్మ అంటారు పిల్లలు.

మార్గం చూపించమంటూ

మా ఇంట్లో ఉండాల్సిన నేను ఇక్కడ ఎలా ఉన్నాను పిల్లలు. తెలియకుండానే మీ ఇంటికి వచ్చా. తెలియకుండానే మీకు ఈ పెళ్లి ఆపుతానని మాటిచ్చా.. తెలియకుండానే ఈ మండపంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు కూడా అలాగే ఏదో మాట్లాడేశా. పిల్లలు నన్ను కాసేపు వదిలేస్తే ఏదో ఒకటి చేసి ఆపేస్తాను. సరేనా ప్లీజ్.. అని అక్కడి నుండి వెళ్లిపోతుంది మిస్సమ్మ. పెళ్లి ఎలాగైనా ఆపాలని ఆలోచిస్తూ బయటకు వచ్చిన మిస్సమ్మ దేవుడిని ఏదో ఒక మార్గం చూపించమని వేడుకుంటుంది.

భాగీ వాళ్ల నాన్న గబగబా లోపలి నడుస్తూ ఉంటాడు. మంగళ గాబరా పడకు మెల్లిగా వెళ్లు అంటుంది. పెళ్లి ఏమి జరగదులే. అది దైవ నిర్ణయం దేవుని నిర్ణయానికి ఎవరు ధిక్కరించలేము అని భాగీ వాళ్ల నాన్న భయపడుతుంటాడు. మంగళ ఇంతలోగా వాళ్లిద్దరూ బావ మరదలు అని నోరు జారుతుంది. గట్టిగా అడిగేసరికి మాట మార్చేస్తుంది. నేను అనవసరంగా ఇరుక్కున్నానని బాధపడుతుంది. అరుంధతి ఏదో ఒకటి చేయాలని తిరుగుతూ ఉంటుంది.

బీహారి ముఠా పట్టుకుంటుందా?

ఇంతలో అక్కడికి భాగీ వాళ్ల నాన్న వస్తాడు. నా కూతురు పెళ్లి లోపల జరుగుతూ ఉంది. దాన్ని ఎలాగైనా ఆపాలని అంటాడు. అమర్​, భాగీల పెళ్లి ఎలా జరుగుతుంది? మనోహరిని బీహారి ముఠా పట్టుకుంటుందా? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 23న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point