Amardeep Chowdary: ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను.. కోలీవుడ్ నటిపై బిగ్ బాస్ అమర్ దీప్ కామెంట్స్
Bigg Boss Amardeep Chowdary Varalaxmi Sarathkumar: బిగ్ బాస్ 7 తెలుగు ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యాడు అమర్ దీప్ చౌదరి. తాజాగా ఆయన హనుమాన్ నటి, కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. శబరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశేషాల్లోకి వెళితే..
Bigg Boss Amardeep Chowdary: తెలుగు బుల్లితెరపై సీరియల్లలో హీరోగా ఆడియెన్స్‌కు బాగా సుపరిచితం అయ్యాడు అమర్ దీప్ చౌదరి. అనంతరం పాపులర్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి టైటిల్ విన్నర్ మెటెరియల్‌గా అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ, బిగ్ బాస్ 7 తెలుగు రన్నరప్‌గా నిలిచాడు. ఈ షో ద్వారా చాలా పాపులర్ అయిన అమర్ దీప్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
పూజా కార్యక్రమాలు
అమర్ దీప్ చౌదరి హీరోగా, పాపులర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా హనుమాన్ నటి, కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్‌పై అమర్ దీప్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
కాలేజ్ డేస్‌లో
వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ లేడి ఒరియెంటెడ్ సినిమా శబరి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న అమర్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''మా కాలేజ్ డేస్‌లో వరుణ్ సందేశ్ అన్న అంటే 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలు గుర్తొస్తాయి. శశాంక్ అన్న అంటే 'సై' గుర్తుకు వస్తుంది. ఇక ఫణి గారి కామెడీ టైమింగ్ అదిరిపోతుంది'' అని అమర్ దీప్ తెలిపాడు.
యాక్టింగ్‌పై కామెంట్స్
''నేను చూసిన వరలక్ష్మి గారి మొదటి సినిమా 'తారై తప్పటి'. ఆ సినిమా చూశాక ఏ హీరోయిన్ అయినా సరే ఇటువంటి పెర్ఫార్మన్స్ చేస్తారా, ఇంకో హీరోయిన్ ఇలా చేయగలరా. అంటే నేను ఆ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను. అలా ఉంటుంది ఆమె నటన. ఆవిడ నటించిన 'శబరి' పెద్ద హిట్ కావాలి'' అని బిగ్ బాస్ అమర్ దీప్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్‌పై కామెంట్స్ చేశాడు.
ఏది చేయనివ్వరు
''నిర్మాత మహేంద్రనాథ్ గారిది గోల్డెన్ హార్ట్. ఇలా అందరూ చెబుతారు. కానీ, ఆయనతో ఒకసారి ట్రావెల్ చేసి చూస్తే తెలుస్తుంది. హడావిడిగా ఏదీ చేయనివ్వరు. ప్రతిదీ చక్కగా చేసే వరకు టైం ఇస్తారు. 'శబరి' టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి హిట్ కొట్టాలి అని కోరుకుంటున్నాను'' అని అమర్ దీప్ శబరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పాడు.
జానకి కలగనలేదు సీరియల్
కాగా అమర్ దీప్ చౌదరి పలు సినిమాల్లో కూడా నటించాడు. 2020లో రాజు గారి కిడ్నాప్, 2022లో ఐరావతం, 2023 సంవత్సరంలో అభిలాష సినిమాలు చేశాడు. అలాగే అమర్ దీప్ చేసిన జానకి కలగనలేదు సీరియల్ చాలా పాపులర్ అయింది. ఇందులో అమర్ దీప్ హీరోగా చేశాడు. హీరోయిన్‌గా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ నటించింది.
ఐదు భాషల్లో రిలీజ్
ఇదిలా ఉంటే, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 12) ఐదు భాషల్లో శబరి ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరై తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.