NNS April 20th Episode: మిస్సమ్మ పనికి పిల్లలు షాక్.. మనోహరిని విసిగించిన నీల.. పెళ్లి మండపానికి రామ్మూర్తి-nindu noorella saavasam serial april 20th episode neela irritates manohari nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 20th Episode: మిస్సమ్మ పనికి పిల్లలు షాక్.. మనోహరిని విసిగించిన నీల.. పెళ్లి మండపానికి రామ్మూర్తి

NNS April 20th Episode: మిస్సమ్మ పనికి పిల్లలు షాక్.. మనోహరిని విసిగించిన నీల.. పెళ్లి మండపానికి రామ్మూర్తి

Sanjiv Kumar HT Telugu
Apr 20, 2024 02:15 PM IST

Nindu Noorella Saavasam April 20th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 20వ తేది ఎపిసోడ్‌‌లో మిస్సమ్మ చేసిన పనికి పిల్లలు, రాథోడ్ షాక్ అవుతారు. మరోవైపు మనోహరిని పనిమనిషి నీల విసిగిస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 20వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 20వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 20th April Episode) మిస్సమ్మ రూపంలో వచ్చిన అరుంధతి ఘోరా గీసిన బంధన రేఖ వల్ల లోపలికి వెళ్లలేక పోతుంది. పిల్లలు వెనక్కి తిరిగి వచ్చి మిస్సమ్మా నీవల్లే మేము అందరం ఇక్కడికి వచ్చాం. నువ్వే ఉదయం లేచి మమ్మల్ని పట్టుకొచ్చావు. అందుకని లోపలకి రమ్మని అంటారు.

పైకి నవ్వుతూ

కానీ, ఇదంతా అరుంధతి ఆత్మ చేసిన పని కావడంతో మిస్సమ్మ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఇక్కడికి ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను అని అడుగుతూ ఉంటుంది. పెళ్లాపటానికే వచ్చి లోపలికి వచ్చాక ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని రాథోడ్ అడుగుతాడు. పిల్లలు రాలేకపోయారు అని బాధపడుతున్న అక్కడివారు అందరూ పిల్లలు కనబడేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు. మిస్సమ్మకు మాత్రం ఏమీ అర్థం కాక పైకి నవ్వుతూ ఉండిపోతుంది.

మిసమ్మ వచ్చింది అని చూసిన నీల వెంటనే మనోహరికి చెప్పాలని బయలుదేరుతుంది. బయట అరుంధతి మాత్రం లోపలికి వెళ్లడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అమ్మ అని లోపలికి వచ్చిన పనిమనిషితో ఏంటే నీ ప్రాబ్లం అని అంటుంది మనోహరి. నేను ప్రశాంతంగా పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా. అసలే చాలా టెన్షన్స్‌తో పెళ్లి త్వరగా ఎలా జరిగేలా చేయాలో అర్థం కాక నేనుంటే, నువ్వేమో 10 నిమిషాలకు ఒకసారి బ్యాడ్ న్యూస్ మోసుకొని వస్తున్నావ్ అంటుంది.

దొంగని ముద్ర వేసినా

మీ పెళ్లికి అన్ని గండాలు మీరు పెట్టుకుని నన్నంటే నేనేం చేస్తాను అమ్మగారు అంటుంది నీల. సరే ఇప్పుడేమైందో ముందు అది చెప్పు అంటుంది మనోహరి. ఫంక్షన్ హాల్‌కి ఆ మిస్సమ్మ పిల్లల్ని తీసుకొని వచ్చిందమ్మా అని చెబుతుంది నీల. చా, ఇదేంటి ఈ ఇంటిని జలగలాగా పట్టుకొని వేలాడుతోంది. అంత అవమానించిన, దొంగని ముద్రవేసిన కూడా మళ్లీ పెళ్లికి సిగ్గులేకుండా వచ్చేసింది అంటుంది మనోహరి.

అదే నాకు అర్థం కావటం లేదు అమ్మ. అయినా తన అక్క పిల్లలని తెలియకున్నా కూడా ఆ కుటుంబాన్ని మీ నుండి కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని మాటలు పడుతుంది. ఎన్ని అవమానాలు భరిస్తుంది. నిజంగా మిస్సమ్మ గ్రేటే అమ్మ అంటుంది నీల. అవునే ఇన్ని చేశాక కూడా.. అది ఇంకా ఈ పెళ్లిని ఆపాలని, ఆ పిల్లల్ని అమర్‌ని ఎప్పటికీ కలిసి ఉండేలా చేద్దాం అనుకుంటున్న దాని కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే నాకు ముచ్చట వేస్తోంది అంటుంది మనోహరి.

నా పెళ్లి ఆపలేదు

త్వరగా ఏదో ఒకటి చేసి ఇక్కడి నుండి పంపించేయండమ్మా అంటుంది నీల. ఎందుకే.. ఉండనువ్వు దాని కళ్లముందే అమర్ నా మెడలో తాళి కట్టడం మేము ఏడడుగులు వేయడం అది చూడాలి. చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేక ఆ పెళ్లిని ఆపలేని స్థితిలో అలా కూర్చుని కుమిలి కుమిలి ఏడవడం నేను చూడాలి. ఆ గెలుపుని నేను ఆనందించాలి అంటుంది మనోహరి. అది కాదమ్మా మిస్సమ్మని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాకెందుకు మిస్సమ్మ ఇక్కడ ఉంటే పెళ్లికి అడ్డుపడుతుందేమో అనిపిస్తుంది అంటుంది నీల.

నువ్వే దాన్ని ఎక్కువ అంచనా వేస్తున్నావు. అయినా అది ఇప్పుడు చచ్చిన పామే. దాన్ని మళ్లీ చంపడం దేనికి. అది పెళ్లి ఆపాలంటే అమర్ ముందుకు రావాలి కదా. ఇప్పుడు అది ఏమి చెప్పినా అమర్ నమ్మటం పక్కన పెట్టు కనీసం దాని మాట వినడు. మొహం కూడా చూడడు. అయినా అది వచ్చి ఒక రకంగా నాకు మేలే చేసిందిలే అంటుంది మనోహరి.

భలే చోటుకు వచ్చారే

అది రాకుంటే కచ్చితంగా పిల్లలు, రాథోడ్ వచ్చేవాళ్లే కాదు. అమర్ నా మెడలో తాళి కట్టడం వాళ్లు చూడకపోతే నా ఆనందం కొంచెం తగ్గిపోయేది. అయినా నన్ను ఆపాలనుకున్నవాళ్లు, నన్ను అసహ్యించుకునే వాళ్లు, అనుమానించిన వాళ్లు, అవమానించిన వాళ్లు అందరూ ఒకే చోటుకి భలే వచ్చారే.. అంటుంది.

అవునమ్మా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ గతం కూడా వచ్చింది. అసలు ఎవరు అమ్మ వాళ్లు. మీరు ఎందుకు నన్ను పెళ్లికూతురు స్థానంలో కూర్చోబెట్టారు. ఎందుకు మీరు వాళ్లకి అంత భయపడ్డారు. ఇప్పుడే కాదమ్మా ఇంతకుముందు కూడా మీరు మీ గతం ప్రస్తావన వచ్చినప్పుడు మీరు ఇలానే.. అని నీల అంటుండగానే.. ఆపేయ్.. ఆపు కొన్ని విషయాలు తెలుసుకోవడం నీ ప్రాణానికి అంత మంచిది కూడా కాదు తెలుసుకోవాలి ప్రయత్నించుకు అని అరుస్తుంది మనోహరి.

ఇంకోసారి అడగను

క్షమించండి అమ్మ ఇంకొకసారి అడగను అని వెళ్లిపోతుంది నీల. మిస్సమ్మ వాళ్ల ఇంట్లో నాన్న మంగళని తిట్టి ఉదయం అనగా బయటికి వెళ్లింది. ఇంతవరకు ఎందుకు రాలేదు ఏంటి అని గాబర పడతాడు. ఆ పెళ్లి ఆపడానికి వెళ్లిందని పంతులుగారు చెప్పడం గుర్తొస్తుంది. వెంటనే మండపానికి బయలుదేరుతారు రామ్మూర్తి. అరుంధతి చేస్తున్న ప్రయత్నానికి చిత్రగుప్తుడు కోప్పడతాడు.

అరుంధతి బాధతో, కోపంతో, ఆవేదనతో గుప్తా మీద కూడా కోప్పడుతుంది. నా తాళీ ఎప్పటికైనా తనకే దక్కాలి కాబట్టే భగవంతుడు తనని ఆ కుటుంబానికి దగ్గర చేశాడని వాదిస్తుంది అరుంధతి. మనోహరి ఆనందం ఆవిరి కానుందా? అరుంధతి అనుకున్నది సాధించనుందా? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point