NNS April 8th Episode: గుప్తా చేతికి ఉంగరం.. అంజులో అరుంధతి ఆత్మ.. మిస్సమ్మకు ఆరు నగలు ఇచ్చిన అమర్-nindu noorella saavasam april 8th episode arundhathi soul in anju body nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 8th Episode: గుప్తా చేతికి ఉంగరం.. అంజులో అరుంధతి ఆత్మ.. మిస్సమ్మకు ఆరు నగలు ఇచ్చిన అమర్

NNS April 8th Episode: గుప్తా చేతికి ఉంగరం.. అంజులో అరుంధతి ఆత్మ.. మిస్సమ్మకు ఆరు నగలు ఇచ్చిన అమర్

Sanjiv Kumar HT Telugu
Apr 08, 2024 03:03 PM IST

Nindu Noorella Saavasam April 8th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 8వ తేది ఎపిసోడ్‌‌లో మొత్తానికి గుప్తాకు తన ఉంగరం దొరుకుతుంది. దాంతో యమలోకానికి వెళ్దామని అరుంధతితో అంటాడు గుప్తా. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 8వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 8వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 8th April Episode అరుంధతి లేని టైం చూసుకుని గుప్తా తన ఉంగరం కోసం వెతుకుతుంటాడు. ఇంతలో గుప్తకు ఉంగరం దొరుకుతుంది. అది తీసుకుని అసలు ఇది నా అంగుళీకమేనా అని పరిక్షించి చూస్తాడు గుప్త. అది తన ఉంగరమేనని సంతోషపడతాడు.

ఉంగరం చూపించిన గుప్తా

ఇంతలో అరుంధతి గుప్తను వెతుక్కుంటూ వస్తుంది. గుప్త హ్యాపీగా ఉండటం చూసి ఎందుకు అంత సంతోషంగా ఉన్నారని అడుగుతుంది. దీంతో గుప్త తన ఉంగరం చూపిస్తాడు. దీంతో అరుంధతి షాక్‌ అవుతుంది. ఇంకొక రోజు నాకు టైం ఇవ్వండి అని అడుగుతుంది. నేను ఏం చేయలేనని ఇక మనం వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటాడు.

ఉంగరాన్ని తలకు పెట్టుకుని గుప్తా మంత్రాలు చదువుతుంటాడు. అరుంధతి దేవుణ్ని మొక్కుతుంది. పిల్లల్ని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక్కరోజు టైం ఇవ్వమని వేడుకుంటుంది. ఇంతలో గుప్త ఒక్కడే పైకి వెళ్తాడు. మళ్లీ కిందకు వచ్చిన గుప్త ఏం జరిగిందని చూడగానే అరుంధతి అంజు బాడీలోకి వెళ్లిపోయి ఉంటుంది.

నన్ను దూరం చేస్తారా

వద్దు బాలికా నువ్వు చేయుచున్నది చాలా తప్పిదము. నీ మంచి కోరి చెప్పుచుంటిని వెంటనే నువ్వు బయటికి రమ్ము. బాలికా చెప్పినది వినుము అంటాడు గుప్త. దూరం నుంచి చూస్తున్న మిగతా పిల్లలు ఆశ్యర్యంగా చూస్తుంటారు. 

గుప్త అంజు వెంట పడితే అంజు తప్పించుకుని తిరుగుతుంది. అంజు లోపలికి వెళ్లగానే గుప్త కిందపడిపోయి కూష్మాండం బద్దలైపోయింది అంటాడు గుప్త. నా పిల్లలకే నన్ను దూరం చేయాలని చూస్తారా? మా ఆయనకే అన్యాయం చేయాలని చూస్తారా? అని అడుగుతుంది అరుంధతి.

వర్జినల్‌ నగలు

ఈ బాలిక నా ప్రాణం మీదకే తెచ్చుచున్నది అంటూ అంజును పట్టుకోవడానికి ప్రయత్నించి మళ్లీ కిందపడిపోతాడు గుప్తా. మిగతా పిల్లలు లోపలికి వచ్చి అంకుల్‌ ఏమైంది అని అడగ్గానే గుప్త చూస్తుండిపోతాడు.

నీల భయపడుతూ అమర్‌ డూప్లికేట్‌, వర్జినల్‌ నగలు తీసుకెళ్లిపోయాడు మనోహరి అమ్మ ఫోన్‌ ఎత్తడం లేదని అనుకుంటుండగానే మనోహరి వస్తుంది. తన ఫోన్‌ ఎక్కడో మర్చిపోయాను వెతుకుదాం పద అని నీలను తీసుకుని రూంలోకి వెళ్లి ఫోన్‌ వెతుకుతుంది.

సార్ తీసుకెళ్లారు

ఫోన్‌ దొరకగానే జ్యువెలరీ షాప్‌ అతను చాలా సార్లు ఫోన్‌ చేశాడనగానే.. అమర్‌ బాబును అతను కలిశాడు. నగలు ఉన్న బ్యాగ్‌ ఇచ్చాడు అని నీల చెబుతుంది. దాంతో కంగారుగా మనోహరి బయటకు వెళ్తుంది. మరోవైపు జువెల్లరీ షాప్‌కు రాథోడ్‌తో కలిసి మిస్సమ్మ వెళ్తుంది. మనోహరి నగలు తీసుకొచ్చిన విషయం అడగ్గానే అసలు నగలకు నకిలీ చెయ్యమని చెప్పారు. చేశాక ఇప్పుడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని మా సార్‌ తీసుకుని వెళ్లారు అని సేల్స్‌ మెన్‌ చెబుతుంది.

దాంతో మిస్సమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనోహరి నగల్ని కరిగిస్తుంది. తాకట్టుపెడుతుంది అంటే డూప్లికేట్‌ నగలు చేపిస్తుంది. అంటే వర్జినల్‌వి ఎవరికో ఇవ్వబోతుంది. ముందు మనం మనోహరిని ఆపాలి. ఇంటికి వెళ్దాం పద అంటుంది భాగమతి. అమ్మో ఎంత పని చేస్తుంది. వెళ్దాం పద మిస్సమ్మ అంటాడు రాథోడ్​. ఇద్దరూ ఇంటికి వెళ్తారు. మనోహరి కారులో స్పీడుగా వెళ్తుంటే అరుంధతిని చంపిన తమిళ డ్రైవర్‌ వచ్చి అడ్డుపడతాడు.

మిస్సమ్మకు నగలు

తనకు డబ్బులు ఇవ్వకపోతే మీరు జైలుకు పోవడం ఖాయం అంటాడు. నీకు ఇవ్వడానికే నగలు ఏర్పాటు చేశాను. అది ఇప్పుడు అమర్‌ చేతికి వెళ్లింది. వెంటనే ఆ బ్యాగు తీసుకొచ్చి నీకు ఇస్తాను అని మనోహరి వెళ్లిపోతుంది. స్పీడుగా వెళ్తున్న మనోహరికి అమర్‌ అడ్డుగా వస్తాడు. ఎం జరిగిందని అడుగుతాడు. ఏం లేదు నీకు నగలు ఇచ్చాడట కదా అని చెప్పగానే అవి మిస్సమ్మకు ఇచ్చానని అమర్‌ చెబుతాడు.

దాంతో కంగారుగా మనోహరి ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఉన్న బ్యాగును తీసుకొచ్చి డ్రైవర్‌కు ఇస్తుంది. మనోహరి హంతకుడికి ఇచ్చిన నగలు అసలైనవేనా? అసలు నగల్ని భాగమతి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 9న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner