NNS April 6th Episode: ఇంటి నుంచి మనోహరి అవుట్.. అమర్ చేతికి గిల్ట్ నగలు.. భాగీ ప్లాన్ సక్సెస్
Nindu Noorella Saavasam April 6th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 6వ తేది ఎపిసోడ్‌లో రామ్మూర్తితో భాగమతి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతోంది. దాంతో అమర్ ఇంటి నుంచి మనోహరిని తన ఇంటికి తీసుకెళ్తాడు రామ్మూర్తి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 6th April Episode) అమర్ ఇంటికి వచ్చిన రామ్మూర్తిని చూసి ఎలా ఉన్నారని అడుగుతుంది అరుంధతి. ఆమె మాట్లాడుతున్నది ఏమి పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్లిపోతాడు రామ్మూర్తి. ఇంకా నాన్న రాలేదేంటి టైం అయిపోతుంది అనని టెన్షన్ పడుతూ ఉంటుంది భాగమతి. ఇంతలో రామ్మూర్తి వస్తాడు. ఏంటి నాన్న ఇంత లేట్ చేసావు అని భాగమతి అంటుంది.
హగ్ చేసుకున్న పిల్లలు
నాన్న నేను చెప్పింది చెప్పినట్టు చేయండి మీరేం చేస్తారో తెలియదు కానీ అందరూ నమ్మేసేయాలి అంటుంది భాగమతి. నువ్వే చూస్తావు కదమ్మ అంటాడు రామ్మూర్తి. పిల్లలు ఎవరు వచ్చారో చూడండి మీ తాతయ్య వచ్చారు రండి రండి అని పిల్లల్ని పిలుస్తాడు రాథోడ్. పిల్లలు పరిగెత్తుకొచ్చి రామ్మూర్తిని హగ్ చేసుకుని తాతయ్య ఎప్పుడొచ్చావ్ అని అంటారు. పిల్లలని ముద్దు పెట్టుకుని ఇప్పుడే వచ్చాను అమ్మ అని రామ్మూర్తి అంటాడు. ఇంతలో శివరాం, నిర్మల, అమరేంద్ర అందరూ వస్తారు.
ఏంటన్నయ్య గారు ఇంత పొద్దున్నే మా ఇంటికి వచ్చారు ఏంటి విశేషాలు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని నిర్మల అడుగుతుంది. ట్రీట్‌మెంట్ బాగానే జరుగుతుందా అంకుల్ అని అడుగుతాడు అమర్. మీ దయవల్ల నా ప్రాణం నిలబడింది బాబు మీ రుణం ఎలా తీసుకోగలను అని దండం పెడతాడు రామ్మూర్తి. పెద్దవారు ఆశీర్వదించాలి కానీ ఇలా దండం పెట్టకూడదు అంకుల్ అంటాడు అమర్. బాబు నా కూతురు మెడల రేపు తాళి కట్టి మీ భార్యని చేసుకోబోతున్నారు కదా అని రామ్మూర్తి అంటాడు.
నా పెద్ద కూతురు
తాతయ్య మా డాడీ మిస్సమ్మను పెళ్లి చేసుకోవడం ఏంటి. మనోహరి ఆంటీకి మా డాడీకి కదా పెళ్లి జరిగేది అంటుంది అంజలి. అవును కదా అన్నయ్య మీరేంటి అలా మాట్లాడుతున్నారు అంటుంది నిర్మల. ఆ మాట విన్న మనోహరీ, భాగీ షాకవుతారు. నాన్నకి నేనేం చెప్పాను ఏం మాట్లాడుతున్నాడు అంతా మర్చిపోయారా అని భాగీ ఆలోచిస్తుంది. నేను మాట్లాడుతున్నది భాగీ గురించి కాదండి నా పెద్ద కూతురు మనోహరి గురించి అంటాడు రామ్మూర్తి.
నా చిన్న కూతురు మీరు ఎంతో ప్రేమగా పెళ్లికూతురుని చేసి మండపానికి తీసుకువచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఒక రాక్షసుడు నుంచి నా కూతుర్ని కాపాడారు. కాబట్టి ఇప్పుడు ఎవరూ లేని మనోహరికి తండ్రినై పెళ్లికూతురుని చేసి మండపానికి తీసుకురావాలనుకుంటున్నాను అందుకే ఇలా వచ్చాను అంటాడు రామ్మూర్తి. అంకుల్ మీ పెద్ద మనసుకి ఒక నమస్కారం. కానీ నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను అంటుంది మనోహరి.
బట్టలు సర్దుకుని
అదేంటి మనోహరి అలా అంటావ్ అన్నయ్యగారు చెప్పింది కూడా కరెక్టే. ఒకే ఇంట్లో నుంచి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్లకూడదు. నువ్వు అన్నయ్య వాళ్ల ఇంటికి వెళ్లు అంటాడు శివరాం. కావాలంటే రేపు పెళ్లి మండపంలో కాళ్లు కడిగి కన్యాదానం చేయండి చాలు అంటుంది మనోహరి. అంకుల్ అంతగా అంటున్నాడు కాదనడం ఏం బాగుంటుంది వెళ్లు అని అంటాడు అమర్. ఇప్పటికిప్పుడు బట్టలు సర్దుకుని వెళ్లలేను అని మనోహరి అంటూ ఉండగా రాథోడ్ బట్టలు సర్దుకుని వస్తాడు.
అన్ని సర్ది పెట్టేసానమ్మ మీరు బయలుదేరడమే ఉంది అంటాడు రాథోడ్. పదండి అక్క అంటుంది భాగమతి. రామ్మూర్తి మనోహరిని తీసుకొని బయలుదేరుతాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని నువ్వు చేసిన పనులకి తగిన శాస్తి చేయబోతున్నాను. పిల్లల్ని ఈ ఇంటి నుండి దూరం చేస్తానన్నావ్. నిన్నే ఈ ఇంటికి దూరం చేస్తున్నాను ఇక వెళ్లు అంటుంది భాగమతి. రేపు పెళ్లి చేసుకుని శాశ్వతంగా ఈ ఇంట్లో అడుగు పెడతాను చూస్తూ ఉండు అంటూ మనోహరీ వెళ్లిపోతుంది.
నగలకు మెరుగు పెట్టే సేటు
భాగీ నిజంగానే పెళ్లి ఆపేస్తుంది నా చెల్లి మీద నాకు నమ్మకం ఉంది అనుకుంటుంది అరుంధతి. రాథోడ్ గారు వెళ్లి నగల సంగతి చూద్దాం పదండి అని భాగమతి వెళ్లిపోతుంది. ఇంతలో నగలు తయారు చేసిన నగల వ్యాపారి అమర్ ఇంటికి వస్తాడు. ఎవరు కావాలండి మీకు అని శివరాం అడుగుతాడు. నేను మనోహరి కోసం వచ్చాను సార్ అని అతను అంటూ ఉండగా అమర్ వస్తాడు. మీరు మనోహరి నగలు మెరుగు పెట్టడానికి ఇచ్చిన సేటు కదా అంటాడు అమర్.
అవును సార్ మేడానికి నగలు ఇద్దామని వచ్చాను అంటాడు నగల వ్యాపారి. మనోహరీ ఇప్పుడు ఇక్కడ లేదు ఆ నగలు నేను ఇంట్లో ఇస్తాను ఇవ్వండి అంటాడు శివరాం. వద్దులేండి నేను మేడానికే ఇస్తాను అంటాడు అతను. అమర్ నువ్వు ఎలాగూ బయటికి వెళ్తున్నావు కాబట్టి ఆ నగలేవో మనోహరికి ఇచ్చిరా వెళ్లు అని శివరాం అనడంతో అమర్ నగలు తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విషయం వెంటనే మేడానికి చెప్పాలి అని నీల వెళ్తుంది.
నిజం తెలిసిపోయిందా?
మనోహరి ఏంటి పొద్దున్నే నా ఇంటికి వచ్చింది అని మంగళ అనుకుంటుంది. ఏంటి మనోహరి ఇలా వచ్చావు అని మంగళ అడుగుతుంది. అమర్ నిజం తెలుసుకొని బయటికి గెంటేసాడా అంటుంది.
దానికి ఇంకా టైం ఉంది కానీ నా పెద్ద కూతుర్ని పెళ్లికూతురును చేయాలి ఇంట్లోకి తీసుకువెళ్లు అంటాడు రామ్మూర్తి. మీ పెద్ద కూతురు గురించి మీకు నిజం తెలిసిపోయిందా ఎప్పుడు తెలిసింది అంటుంది మంగళ. పెద్ద కూతురు అంటే ఎవరు అనుకుంటున్నావు మంగళ నేనే అంకుల్ నా గురించే చెబుతున్నాడు అంటుంది మనోహరి.
హాస్టల్లో ఉన్నంత మాత్రాన మీ పెద్ద కూతురు అయిపోతుందా అంటుంది మంగళ. అంకుల్ చెప్పింది చేయి నోరు పారేసుకోకు అని మనోహరి కోపంగా అంటుంది. మనోహరికి ఎవరూ లేరు కాబట్టి మన ఇంట్లో నుంచి పెళ్లికూతురు చేసి తీసుకు వెళ్లాలనుకుంటున్నాను తనను ముందు ఇంట్లోకి తీసుకువెళ్లు అని రామ్మూర్తి వెళ్లిపోతాడు. ఇంకెక్కడ నిజం తెలిసిపోయిందని టెన్షన్ పడుతున్నాను అంటుంది మంగళ. నేను ఫోన్ మర్చిపోయి వచ్చాను తీసుకొని వస్తాను అంటూ మనోహరి వెళ్తుంది.
అమర్‌కు నిజం తెలుస్తుందా?
మనశ్శాంతిగా ఉందాము అంటే ఈ మనోహరి నాకు దాపరించింది అనుకుంటుంది మంగళ. గుప్తాకి ఉంగరం దొరుకుతుందా? నగల వ్యాపారి తెచ్చినవి నకిలీ నగలు అని ఎలా బయటపడుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 8న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!