NNS March 30th Episode: మనోహరి చేతికి అరుంధతి తాళి.. అమర్, భాగీలకే పెళ్లి.. హెచ్చరించిన ఘోరా, మంగళ!
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 30వ తేది ఎపిసోడ్‌లో మనోహరి చేతికి అరుంధతి తాళి చేరుతుంది. అయితే మనోహరిని చూసి ఘోరా నవ్వుతుంటాడు. ఎందుకు అని మనోహరి అడుగుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam March 30th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 30th March Episode) మనోహరిని నగల విషయంలో అందరి ముందు బుక్ చేస్తుంది మిస్సమ్మ. కానీ, ఏదోటి చెప్పి కవర్ చేసి బయటపడుతుంది మనోహరి. నేనేదో అనుకున్నాను కానీ నువ్వు ఈ మాత్రం దానికే భయపడుతున్నావా? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది మిస్సమ్మ. పిల్లలను క్యాంపుకు కాదు కదా గేటు కూడా దాటనివ్వను అంటూ చాలెంజ్ చేస్తుంది భాగమతి. దీంతో మనోహరి కోపంగా చూస్తుండిపోతుంది.
నీ పెళ్లి గురించి అంటున్నా
మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. ఘోర దగ్గరకు మనోహరి వస్తుంది. మనోహరిని చూసి ఘోర నవ్వుతుంటాడు. నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది మనోహరి. ఎందుకంటే కొన్ని రోజుల్లో నువ్వు కూడా ఇలాగే పిచ్చి దానిలా నవ్వుతావు అంటాడు ఘోర. నువ్వు ఎమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటుంది మనోహరి. మూడు రోజుల్లో జరగనున్న నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను అంటాడు ఘోర. నా పెళ్లి జరుగుతుందని నీకెలా తెలిసింది. నేను నీకు చెప్పలేదు కదా? అని అడుగుతుంది మనోహరి.
నాకు కనిపించింది మాట్లాడుతున్నా.. పౌర్ణమి రోజు నీ పెళ్లి గురించి అంటాడు ఘోర. దీంతో పౌర్ణమి అయితే నాకొచ్చిన నష్టం ఏంటి అని మనోహరి అడుగుతుంది. నీకు రాబోతున్న గండం పేరు అరుంధతి. పౌర్ణమి నాడు ఆ ఆత్మకు రాబోతున్న శక్తి వల్ల నీకు నీ ప్రేమకు ముప్పు ఉందని చెప్తాడు. ఆ ఆత్మకు ఎన్ని శక్తుల వచ్చినా ఈ పెళ్లి ఆగదు. అనగానే అలా అనుకోవడంతోనే నీ పతనం మొదలవుతుంది అని ఘోర చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది.
భాగమతి మెడలోనే తాళీ
నేను అంత పక్కాగా ప్లాన్ వేసి చేస్తే పెళ్లి వేరెవరితో జరుగుతుందంటున్నారు.. ఎవరితో జరుగుతుంది అని అడుగుతుంది మనోహరి. భాగీతో.. అంటూ మంగళ అక్కడకు వస్తుంది. ఏమంటున్నావు మంగళ అంటున్న మనోహరితో.. అవును పౌర్ణమి నాడు ఆ తాళి పడేది భాగమతి మెడలో.. పెళ్లి జరిగేది భాగమతికి, అమరేంద్ర బాబుకు అంటుంది మంగళ. మనోహరి, మంగళను ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తానని అంటుంది. దీంతో మంగళ పంతులు చెప్పిన విషయం చెబుతుంది.
మీరు మీ శక్తినంతటిని కూడదీసుకుని ఈ పెళ్లిని ఆపాలి. మీ పెళ్లితో నా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది మేడం అందుకే నా తమ్ముణ్ని జైలు పాలు చేసిన మీతో కలిసిపోయాను అని చెప్తుంది. మరోవైపు మిస్సమ్మకు కరుణ ఫోన్ చేసి రేపు కలుద్దామని చెప్తుంది. లేదని రేపు పిల్లలకు ఇంపార్టెంట్ వర్క్ ఉందని రానని చెప్తుంది. ఇదంతా విన్న అమర్ మరుసటి రోజు ఉదయాన్నే లేచి పిల్లలకు అన్నీ రెడీ చేస్తాడు. అది చూసిన మిస్సమ్మ షాక్ అవుతుంది.
పది నిమిషాల్లో కారులో ఉండాలి
దేవుడు నా మాట విన్నాడేమో అనుకుంటుంది. ఇంతలో అమర్ వచ్చి నేనే చేశానని నువ్వు పిల్లలను రెడీ చేసి నువ్వు బయటకు వెళ్లవచ్చు అంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన మనోహరి ప్రిన్సిపాల్ కోసం ఎదురుచూస్తుంటుంది. ప్రిన్సిపాల్ వస్తుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. పిల్లల్ని కిందకు పిలిచాకా పది నిమిషాల్లో వాళ్లు నీ కారులో ఉండాలి. అమర్ మనసు మారేలోపు మీరు ఈ ఏరియాలో కూడా ఉండకూడదు అని చెబుతుంది మనోహరి.
మీరు ఏం టెన్షన్ పడకండి. పక్కాగా ప్లాన్ చేశాను. మీరు పెళ్లి సంగతి చూసుకోండి అంటుంది ప్రిన్సిపాల్. సరే అమర్ వాళ్లను పిలుస్తాను మీరు కూర్చోండి అంటూ.. అమర్, అత్తయ్యా, మామయ్యా, పిల్లలూ త్వరగా కిందకు రండి మిమ్మల్ని తీసుకెళ్లడానికి ప్రిన్సిపాల్ గారు వచ్చారు అనగానే అందరూ కిందకు వస్తారు. పిల్లలు ఏడుస్తూ.. వెళ్లే ముందు ఒకసారి అమ్మ ఫోటోకు దండం పెట్టుకుని వెళ్తామని చెప్పి రూంలోకి వెళ్తారు.
మిస్సమ్మను ఆపిన మనోహరి
మిస్సమ్మ కూడా మేడం ఫోటో ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడైనా చూద్దామని లోపలికి వెళ్లబోతుంటే మనోహరి ఆపేస్తుంది. పిల్లల్ని క్యాంప్‌కి వెళ్లకుండా మిస్సమ్మ ఏం చేస్తుంది? అమర్ నిర్ణయం మార్చుకుంటాడా? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 1న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్నాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!