NNS March 29th Episode: అరుంధతి తాళిని గుర్తుపట్టిన అంజు.. ఆ తాళి తనదన్న మిస్సమ్మ​.. పౌర్ణమి రోజున భాగీ పెళ్లి?-nindu noorella saavasam march 29th episode bhagamathi marriage with amar on purnami nindu noorella saavasam today episod ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns March 29th Episode: అరుంధతి తాళిని గుర్తుపట్టిన అంజు.. ఆ తాళి తనదన్న మిస్సమ్మ​.. పౌర్ణమి రోజున భాగీ పెళ్లి?

NNS March 29th Episode: అరుంధతి తాళిని గుర్తుపట్టిన అంజు.. ఆ తాళి తనదన్న మిస్సమ్మ​.. పౌర్ణమి రోజున భాగీ పెళ్లి?

Sanjiv Kumar HT Telugu
Mar 29, 2024 06:31 AM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 29వ తేది ఎపిసోడ్‌‌లో అరుంధతి తాళిని ఇంట్లో చైర్ మీద పెడుతాడు చిత్రగుప్తుడు. ఆ తాళి చూసి గుర్తు పట్టిన అంజు ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 29వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 29వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 29th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 29th March Episode) భాగీకి పెళ్లి సంబంధాలు చూడమని పంతులుని పిలుస్తాడు రామ్మూర్తి. భాగీ జాతకం చూసిన పంతులు మూడు రోజుల్లో రానున్న పౌర్ణమి రోజున పెళ్లి జరగబోతున్న అమ్మాయికి తనని సంబంధం చూడమంటారేంటి అని అడుగుతాడు పంతులు. తన కూతురికి పెళ్లేంటి? అసలు సంబంధం చూడలేదు, పెళ్లి పనులు మొదలు పెట్టలేదు? అని అడుగుతాడు రామ్మూర్తి.

తాళి అమ్మదే

అదంతా తనకి తెలియదనీ.. కానీ వచ్చే పౌర్ణమికి అమ్మాయికి పెళ్లవుతుందని అంటాడు పంతులు. అంటే అమర్​ని పెళ్లి చేసుకోబోయేది మనోహరి కాదు, భాగమతి అని అనుకుంటుంది మంగళ. చిత్రగుప్తుడు తన దగ్గరున్న అరుంధతి తాళిని తీసుకెళ్లి హాల్లోని చైర్​ మీద వేస్తాడు. అప్పుడే అటుగా వచ్చిన అంజు ఆ తాళిని చూసి గుర్తుపడుతుంది. అందరినీ పిలిచి ఆ తాళి అమ్మదేనంటూ చూపిస్తుంది. అది చూసిన మనోహరి తీసి పట్టుకుంటుంది.

కొడైకెనాల్ ఎందుకు వెళ్లావ్

అప్పుడే ఇంట్లోకి వచ్చిన అమర్​, పైనుంచి దిగిన భాగీ ఇద్దరూ ఆ తాళిని గుర్తుపడతారు. ఆ తాళి తన భార్యదే అని అమర్​ అనగానే ఆ తాళి తనదే అంటుంది మిస్సమ్మ. అదేంటి.. ఆ తాళి నీదేలా అవుతుంది? అని అడుగుతారంతా. తను కొడైకెనాల్​ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తనకి తెలియకుండానే ఆ తాళి తన బ్యాగ్​లో పడిందని చెబుతుంది మిస్సమ్మ. అసలు ఎవరిని కలవడానికి కొడైకెనాల్ వెళ్లావని మిస్సమ్మని అడుగుతారు అమర్​ తల్లిదండ్రులు, పిల్లలు.

సడెన్‌గా బయటకు

తను ఎంతో కష్టపడి అమర్​ని పెళ్లిపీటల వరకి తీసుకొస్తే ఒక్కతాళితో అమర్​ని ఎగరేసుకుపోయేలా ఉందని మండిపడుతుంది మనోహరి. తను కొడైకెనాల్​ ఎందుకు వచ్చిందో చెబుతున్న మిస్సమ్మను ఆపేసి తనకు చెందాల్సిన తాళిని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్​ అని చెప్పి లాగేసుకుంటుంది మనోహరి. అసలు ఇన్నాళ్లు కనపడకుండా పోయిన తాళి అంత సడెన్​గా ఎలా బయటకు వచ్చిందని అడుగుతుండగానే ఆరు.. ఆరూ.. అంటూ నటిస్తుంది మనోహరి.

మనోహరి నగలు ఏమయ్యాయి

మన పెళ్లికి ఆరు ఆశీర్వదించి ఈ తాళిని పంపించింది అంటుంది. మనోహరి నటనకి ఒళ్లు మండిన భాగమతి ఇదే సరైన సమయం అని అరుంధతి గారి నగలు తీసుకురమ్మని అంటుంది. నగలన్నింటినీ మేడమ్​ ఫొటో ముందు పెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకుందువు అంటుంది. ఆ మాట విని షాకవుతుంది మనోహరి. మాట్లాడకుండా ఉన్న మనోహరిని నగలేమయ్యాయని అందరూ అడుగుతారు. ఏం చెప్పాలో అర్థంకాక తనదగ్గర నగలు లేవని చెబుతుంది.

గేటు కూడా దాటనివ్వను

మెరుగుపెట్టమని షాపులో ఇచ్చానని చెబుతుంది. అవి ఆరు నగలనీ, అవి ఎప్పుడూ మెరుస్తూ ఉండాలని మెరుగుపెట్టించడానికి ఇచ్చానని అంటుంది మనోహరి. అందరూ వెళ్లగానే కంగారు పడుతున్న మనోహరితో .. ఏంటి మనోహరి గారు నేనింకా దెబ్బ కొట్టడం మొదలు పెట్టకుండానే ప్రాణం గొంతులోకి వచ్చినట్లుందే.. పిల్లల్ని ఆయనకి దూరం చేయడం కాదు గేటు కూడా దాటనివ్వను అంటూ ఛాలెంజ్​ చేస్తుంది మిస్సమ్మ.

భాగమతి ఏం చేయనుంది

మనోహరి నిజస్వరూపం బయటపెట్టడానికి భాగమతి ఏం చేయబోతుంది? అమర్​కి నిజం తెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే మార్చి 30న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!