NNS April 5th Episode: అమర్​ ఇంటికి రామ్మూర్తి.. మిస్సమ్మ కొత్త ప్లాన్.. గిల్ట్​ నగలతో దొరకనున్న మనోహరి-nindu noorella saavasam april 5th episode bhagamathi new plan to stop amar marriage nindu noorella saavasam today episod ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 5th Episode: అమర్​ ఇంటికి రామ్మూర్తి.. మిస్సమ్మ కొత్త ప్లాన్.. గిల్ట్​ నగలతో దొరకనున్న మనోహరి

NNS April 5th Episode: అమర్​ ఇంటికి రామ్మూర్తి.. మిస్సమ్మ కొత్త ప్లాన్.. గిల్ట్​ నగలతో దొరకనున్న మనోహరి

Sanjiv Kumar HT Telugu
Apr 05, 2024 10:47 AM IST

Nindu Noorella Saavasam April 5th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 5వ తేది ఎపిసోడ్‌‌లో అమర్ రూమ్‌లో ఉన్న మిస్సమ్మకు అలా ఎందుకు ఉందో అర్థం కాదు. మరోవైపు గిల్ట్ నగలతో మనోహరి దొరికిపోనుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 5వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 5వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 5th April Episode) భాగమతి రూపంలో ఉన్న అరుంధతి ఆత్మ అమర్​ రూమ్​లోకి వెళ్లి పడుకుంటుంది. అప్పుడు భాగీ శరీరంలోని అరుంధతి ఆత్మ బయటకు వచ్చి గుప్తా దగ్గరకి వెళ్లి కృతజ్ఞతలు చెబుతుంది. తన పిల్లలను దగ్గరకు తీసుకునే అవకాశం కల్పించారని, ఎప్పటికీ రుణపడి ఉంటానని ఏడుస్తుంది.

అసలేం జరిగింది

రోజులు పెరిగేకొద్దీ మా లోకానికి వెళ్లడం కష్టమవుతుంది, జ్ఞాపకాలు మోయడం అంత సులువుకాదని, వెంటనే ఈలోకం విడిచి వెళ్లడం మంచిదని సూచిస్తాడు గుప్తా. పొద్దున్నే అమర్​, భాగమతి నిద్రలేచి ఒకరినొకరు చూసి కంగారు పడతారు. అసలు తన రూమ్​లోకి ఎలా వచ్చావ్​? ఎందుకు వచ్చావ్​? అని అడుగుతాడు అమర్​. తను ఎక్కడున్నానో అర్థం చేసుకున్న మిస్సమ్మ అసలేం జరిగిందని ఆలోచిస్తుంది. కానీ తనకేం గుర్తుకు రాకపోవడంతో ఆలోచనలో పడిపోతుంది.

హత్తుకున్న పిల్లలు

నిద్రలో నీళ్ల కోసం వచ్చి ఇక్కడ పడుకున్నావా? అని అమర్ అడగడంతో అయోమయంలో పడుతుంది. ఎంతకీ తనకి ఏదీ గుర్తుకురాకపోవడంతో సరేనని అక్కడ నుంచి బయటకు వస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన ​మనోహరి అంత ఉదయాన్నే అమర్​ రూమ్ దగ్గర ఏం చేస్తున్నావంటూ మిస్సమ్మని కోప్పడుతుంది. తనకి తెలియదనీ, తెలిస్తే ముందు మీకే చెబుతానంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది మిస్సమ్మ. తన రూమ్​కి రాగానే పిల్లలందరూ మిస్సమ్మని హత్తుకుంటారు.

గిల్ట్ నగలు

రాత్రి అచ్చంగా తమ అమ్మలానే ప్రవర్తించావని అనడంతో ఆలోచనలో పడుతుంది మిస్సమ్మ. అసలేం జరిగిందా అనుకుంటుంది. అది సరేగానీ, ఈ పెళ్లి ఎలా ఆపుతున్నావ్​? అని అడుగుతుంది అంజు. నేను అదే పనిలో ఉన్నాను, మీరు హాయిగా ఉండండి అంతా నేను చూసుకుంటాను అని పిల్లల్ని అక్కడనుంచి పంపిస్తుంది మిస్సమ్మ. మనోహరి ఇచ్చిన నగల్ని పోలిన గిల్ట్​ నగలు చేస్తాడు నగల వ్యాపారి. ఆ నగల్లో గిల్ట్​వి ఏవో చెప్పమని తన దగ్గర పనిచేసే కుర్రాడిని అడుగుతాడు.

ఇంటికి వెళ్లి ఇచ్చేద్దాం

కానీ, ఆ కుర్రాడు వాటిలో గిల్ట్​వి ఏవో కనిపెట్టలేకపోతాడు. ఆవిడ నమ్మిన వాళ్లని మోసం చేసినప్పుడు రెండు సెట్ల గిల్ట్​ నగలు చేసి అసలు నగల్ని కొట్టేయచ్చు కదా అంటాడు కుర్రాడు. మన వృత్తికి ద్రోహం చేయకూడదు, ఆ పని మనం చేయకూడదు అని కుర్రాడితో అంటాడు యజమాని. ఆమె ఈ నగలు ఈ రోజు కావాలని చెప్పి ఇంకా రాలేదు, అడ్రస్​ ఇచ్చారు కదా ఇంటికి వెళ్లి ఇద్దామంటాడు. శక్తుల గురించి చెప్తాననగానే ఉంగరం తెచ్చేందుకు వెళ్లిందంటే ఇక్కడే దగ్గర్లో దాచి ఉంటుందని వెతుకుతూ ఉంటాడు గుప్త.

ఆరోగ్యం ఎలా ఉంది

అప్పుడే అక్కడకు వచ్చిన అరుంధతి పౌర్ణమి ఘడియల్లో తనకి వచ్చిన శక్తులేంటో ఇంకా చెప్పమంటుంది. చేసినది చాలు, ఇంక విధితో ఆటలాడటం ఆపమంటాడు గుప్త. అప్పుడే ఇంట్లోకి వస్తున్న భాగీ తండ్రిని చూసి నాన్న ఏంటీ.. ఈ టైమ్​లో వస్తున్నారు? అంటుంది. నాకు తెలియదు అంటున్న గుప్త మాట వినకుండా రామ్మూర్తి దగ్గరకు పరుగులు పెడుతుంది. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అని అడుగుతుంది.

అమర్​ ఇంటికి రామ్మూర్తి ఎందుకు వచ్చాడు? భాగమతి ప్లాన్​ ఏంటి? తెలియాలంటే ఏప్రిల్ 6న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point