NNS March 11th Episode: మనోహరిని అక్కా అంటున్న మిస్సమ్మ.. దరిద్రపు జాతకం అన్న పంతులు, భాగీ కొత్త స్కెచ్!-nindu noorella saavasam march 9th episode bhagamathi calls manohari as sister nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns March 11th Episode: మనోహరిని అక్కా అంటున్న మిస్సమ్మ.. దరిద్రపు జాతకం అన్న పంతులు, భాగీ కొత్త స్కెచ్!

NNS March 11th Episode: మనోహరిని అక్కా అంటున్న మిస్సమ్మ.. దరిద్రపు జాతకం అన్న పంతులు, భాగీ కొత్త స్కెచ్!

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 01:19 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 11వ తేది ఎపిసోడ్‌లో మనోహరిని అక్క అని పిలుస్తూ ఎమోషనల్ అయినట్లు భాగీ నాటకం ఆడుతుంది. దాంతో మిస్సమ్మ బుట్టలో మనోహరి పడిపోతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 11వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 11వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 11th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 11th March Episode) మనోహరి ఆట కట్టించేందుకు మళ్లీ అమర్​ ఇంట్లో అడుగుపెడుతుంది భాగమతి. పిల్లల్ని, పెద్దల్ని కాపాడడానికి ఇంటికి వచ్చావు కదా అంటుంది అరుంధతి. నాకు రాథోడ్ కి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ విషయం నీకెలా తెలుసు అక్క అంటుంది భాగమతి.

నాశనం చేయాలని

అంటే తనని చాలా రోజులుగా చూస్తున్నాను తన మాట తీరు ప్రవర్తన తీరు వేరేలా ఉంటుంది. అందుకే నువ్వు వచ్చావేమో అని అనుకున్నాను. అందుకే కలిసి వెళ్దామని వచ్చాను అంటుంది అరుంధతి. అయినా తప్పంతా ఆయన వైఫుదే అక్క. ఆ మనోహరిని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్​లా చూసుకుంది కాబట్టి ఆవిడ పేరు అడ్డం పెట్టుకొని ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది అంటుంది భాగమతి.

మనం ఎక్కువగా ప్రేమించే వాళ్లలో లోపాలు చిన్నగా కనపడతాయి అంటారు. అందుకేనేమో తన లోపాన్ని కనిపెట్టలేకపోయింది. అనాథగా పెరగడం చాలా కష్టం మిస్సమ్మ. గుడి దగ్గర కంటే అనాధ ఆశ్రమంలోనే ఎక్కువగా పెరుగుతారు. స్మశానం కంటే అనాధాశ్రమంలోనే పిల్లల ఏడుపులు ఎక్కువగ వినపడతాయి అంటుంది అరుంధతి. నేను అర్థం చేసుకోలేకపోయాను అక్క అంటుంది భాగమతి. నువ్వెందుకు బాధపడుతున్నావ్ మిస్సమ్మ అంత మంచే జరుగుతుందిలే అంటుంది అరుంధతి.

ఎప్పుడూ కుదరట్లేదు

ఆవిడ మాట వచ్చినప్పుడల్లా అలా ఉంటుందా ఎలా ఉంటుందని అనుకోవడమే కానీ ఆవిడ ఫోటో చూడలేదు అక్క వెళ్లి చూస్తాను అంటుంది భాగమతి. మిస్సమ్మ ఇప్పుడు బట్టలు సర్దుతున్నావ్ గా తర్వాత చూద్దువులే అని అరుంధతి అంటుంది. లేదక్కా ఎప్పుడు అలాగే అంటూ మిస్ అయిపోతున్నాను. వెళ్లి చూడాల్సిందే వెళ్తుంది భాగమతి. ఆంటీ మీ కోడల్ని ఎప్పుడు చూద్దాం అన్నా కుదరలేదు ఒక్కసారి మీ కోడలు ఫోటో చూపిస్తారా అడుగుతుంది భాగమతి.

ఇంకెక్కడి కోడలు లేమా ఇంకో కొత్త కోడలు వస్తుంది కదా ఎంత ప్రయత్నించినా ఆ బంగారు తల్లి ప్లేస్‌లో ఈ మనోహర్ని చూడాల్సి వస్తుంది అంటాడు శివరామ్. అంకుల్ మీకు పెళ్లి ఇష్టం లేదా అడుగుతుంది భాగమతి. ఆ మనోహరి అరుంధతి ఫ్రెండ్ అని తప్ప నాకు నచ్చలేదు అంటాడు శివరామ్. ఇవన్నీ పక్కన పెడితే పిల్లల్ని బాగా చూసుకుంటుంది కదా అది చాలదా మనకి అంటుంది నిర్మల. ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు కానీ ఈ పెళ్లిలో తప్పు ఉందని అర్థం అవుతుంది అంటాడు శివరామ్.

అరుంధతి టెన్షన్

పెళ్లిలో తప్పు ఉంటే ఆ దేవుడే ఆపేస్తాడు ఆంటీ. అన్నట్టు మంచే ఉంటే ఏ ఆటంకం వచ్చిన పెళ్లి జరిపిస్తాడు. అయినా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడి ఉంటాయి అని చెబుతారు కదా. అందుకని మీరు ప్రశాంతంగా ఉండండి. అంత మంచే జరుగుతుంది అంటుంది భాగమతి. ఎంత టెన్షన్‌లో ఉన్నా నీ మాటలు మాకు ఊరటనిస్తాయి మిస్సమ్మ అంటాడు శివరామ్. ఆంటీ ఫోటో చూడొచ్చా అంటుంది భాగమతి. అరుంధతి టెన్షన్ పడుతూ ఉంటుంది.

నిర్మల ఫోటో తీసి చూపించబోతూ ఉండగా రాథోడ్ వచ్చే మిస్సమ్మ అని పిలుస్తాడు. మరోవైపు ఏదో కరువు పడ్డట్టు ఈరోజు ఎందుకు అలా తింటున్నారు అని మనోహరిని అడుగుతుంది నీల. అమర్ పెళ్లికొప్పుకున్నాడని కడుపునిండా తినాలని నాకు నచ్చినవన్నీ వండించుకున్నాను అంటుంది మనోహరి. ఇంతలో రాథోడ్ వచ్చి మిస్సమ్మ మిస్సమ్మని గట్టిగా అరుస్తూ ఉంటాడు. రాథోడ్‌కి అసలు పని లేదు అని మనోహరి అనుకుంటుంది. ఏంటి రాథోడ్ అంటుంది భాగమతి.

పంతులు ఉండాలిగా

ఇంట్లో పెద్దలు పెళ్లి పనులు చూడాల్సిందే అని రాథోడ్ పంతులు గారిని పిలుస్తారు. మిస్సమ్మ పంతులుగారిని నువ్వు పిలిపించావా ఎందుకు అడుగుతుంది నిర్మల. మా అక్క కోసం అంటుంది భాగమతి.

నీకు ఇంట్లో అక్క ఉందా అంటాడు శివరామ్. మనోహరి అక్క కోసం అంటుంది భాగమతి. నువ్వు పంతులు గారిని ఎందుకు పిలిచావు అంటాడు శివరామ్. అరే పెళ్లి చేయాలంటే పంతులుగారు ఉండాలి ముహూర్తాలు పెట్టాలి కదా. మా అక్క పెళ్లి అంటే ఎలా ఉండాలి ఆకాశమంత పందిరి వేయకపోయినా ఏదో సింపుల్ గానైనా చేయాలి కదా అంటుంది భాగమతి.

పెళ్లి టాపిక్ ఎలా తీసుకురావాలని నేను ఆలోచిస్తుంటే ఈ భాగీ ఇంత సింపుల్‌గా తీసేసింది ఏదైతేనేం నాకు మంచి పని చేసింది అని మనోహరి సంతోషపడుతుంది. అందుకే ముహూర్తం పెట్టిద్దామని పంతులు గారిని పిలిచాను అక్క అని కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు నటిస్తుంది భాగమతి. మీ అక్క చెల్లెళ్ల ఎమోషన్ పక్కనపెట్టి అమ్మాయిని పిలవండి ముహూర్తం పెట్టాలి అని పంతులు అంటారు. ఇంత మంచి అమ్మాయిని కోడలుగా వస్తున్నందుకు మీరు అదృష్టవంతులు అని పంతులు అంటారు.

దరిద్రపు జాతకం అమ్మా

పంతులుగారు పెళ్లికూతురుని నేను కాదు ఈవిడ అని మనోహరిని చూపెడుతుంది భాగమతి. ఈవిడేంటీ అంత ముదిరిపోయింది అని పంతులుగారు అంటారు. అదేంటండి అలా అంటారు అంటుంది భాగమతి. కొంచెం కాదమ్మా బాగా ముదిరిపోయింది అని పంతులుగారు జాతకం చూసి ఇలాంటి జాతకాన్ని నా జన్మలో చూడలేదు అని అంటాడు. అదేంటి పంతులుగారు అలా అంటున్నారు అని నిర్మల అంటుంది. నేను చూసిన జాతకాలలో ఇలాంటి దరిద్రపు జాతకం నాకు కనిపించలేదు అని పంతులుగారు అంటారు.

ఏ పూజ అయినా చేద్దాం ఎంత డబ్బైనా పర్వాలేదు ఈ పెళ్లి మాత్రం జరగాలి అని భాగమతి అంటుంది. ఏమన్నా తిన్నావా అమ్మ అని పంతులుగారు అంటారు. తిందామని ప్లేట్లో పెట్టుకునేసరికి గొడవ స్టార్ట్ అయింది అని మనోహరి అంటుంది. ఇంకా రెండు రోజుల వరకు భోజనం తినకు ని జాతకంలో ఉన్న దోషాలని తొలగిపోతాయి అని పంతులుగారు చెబుతారు. అమ్మ భాగీ ఇదా నీ ప్లాను ఏం తెలివితేటలు నా చెల్లికి అని అరుంధతి అనుకుంటుంది. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవద్దా పంతులుగారు అని మనోహరి అడుగుతుంది.

మనోహరి దగ్గరికి మంగళ

పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోవద్దమ్మా లేదంటే దోష నివారణ జరగదు అని పంతులుగారు అంటారు. ఈ ఉపవాసం రేపు పెట్టుకోకూడదా అని మనోహరి అంటుంది. బేషుగ్గా పెట్టుకోవచ్చు పెళ్లికూడా వచ్చే జన్మలోపెట్టుకోవచ్చు అని పంతులుగారు వెళ్లిపోతారు. మంగళ మనోహరి కి ఫోన్ చేసి బయటికి రమ్మని చెబుతుంది. ఏంటి ఎందుకు వచ్చావు అని మనోహరి అంటుంది.

ఆ తండ్రి కూతుళ్లు ఏదో కుట్ర పండుతున్నారమ్మా. పెళ్లికి ముందు మీ ఇంట్లోకి వచ్చిందంటే తనేదో ప్లాన్ చేస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి మా ఆయన నన్ను కుక్కని చూసినట్టు చూస్తున్నాడు కొంచెం డబ్బు ఉంటే ఇవ్వండి అమ్మ అని మంగళ అంటుంది. అయిపోయిందా నీ సోది నిన్ను నా పెళ్లి చేయమంటే ఏమైనా చేసావా. నా భాగీ చెల్లి మాత్రం పంతులు గారిని పిలిపించి నాకు ముహూర్తం పెట్టేలా చేసింది అని మనోహరి అంటుంది.

అవసరం లేదమ్మా

ఆ భాగి మాటలు నమ్మకండి మేడం అని మంగళ అంటుంది. నా వాళ్లు ఎవరో బయట వాళ్లు ఎవరు నాకు అర్థం అవుతుంది నువ్వు వెళ్లిపో అని మనోహరి అంటుంది. ఇంతలో భాగమతి అక్కడికి వస్తుంది. పిన్ని నువ్వేంటి ఇక్కడ నాన్నని ఒక్కడిని వదిలేసి వచ్చావా అని భాగమతి అంటుంది. మీ నాన్నకి మనిషి తోడుండే అవసరం లేదమ్మా ఇక నేను వెళ్తాను పనులు చాలా ఉన్నాయి అంటూ మంగళ వెళ్లిపోతుంది. అక్క ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఉపవాసం చేయవా అని భాగమతి అంటుంది.

నా తిప్పలేవో నేను పడతాను అంటుంది మనోహరి. ఇంకా ఇప్పుడే ఏమున్నాయి అక్క ముందు ముందు చాలా ఉన్నాయి అంటుంది భాగమతి. మనోహరి ఆటకట్టించేందుకు భాగమతి ఏం ప్లాన్​ చేయబోతుంది? అమర్​ పెళ్లి ఆపేందుకు అరుంధతి ఏం చేయనుంది? అనే విషయాలు తెలియాలంటే మార్చి 12న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner