NNS April 18th Episode: మాట తప్పిన అరుంధతి.. అమ్మగా మాటిచ్చిన మిస్సమ్మ.. మనోహరి పెళ్లి ఆపేందుకు కొత్త ప్లాన్-nindu noorella saavasam serial april 18th episode arundhathi soul in bhagamati to nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 18th Episode: మాట తప్పిన అరుంధతి.. అమ్మగా మాటిచ్చిన మిస్సమ్మ.. మనోహరి పెళ్లి ఆపేందుకు కొత్త ప్లాన్

NNS April 18th Episode: మాట తప్పిన అరుంధతి.. అమ్మగా మాటిచ్చిన మిస్సమ్మ.. మనోహరి పెళ్లి ఆపేందుకు కొత్త ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Apr 18, 2024 12:22 PM IST

Nindu Noorella Saavasam April 18th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 18వ తేది ఎపిసోడ్‌‌లో గుప్తాకు ఇచ్చిన మాట తప్పుతుంది అరుంధతి. మిస్సమ్మ శరీరంలోకి ప్రవేశించి మనోహరి పెళ్లి ఆపాలనుకుంటుంది అరుంధతి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 18వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 18వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 18th April Episode) మనోహరి ఆంటి నుంచి తమని కాపాడేవాళ్లు ఎవరూ లేరని బాధపడుతూ ఉంటారు పిల్లలు. అది చూసిన అరుంధతి తట్టుకోలేకపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ భాగీ ఇంటికి వెళ్తుంది. పిల్లలను కాపాడమని దేవుడిని వేడుకుంటున్న భాగీలోకి ప్రవేశిస్తుంది అరుంధతి.

ఆలోచనలో మంగళ

అప్పుడే అక్కడకు చేరుకున్న అరుంధతి కోసం గుప్త వెతుకుతాడు. గుప్తని తనకోసం మనోహరి పంపించి ఉంటుందనుకుంటుంది మంగళ. కానీ, తాను అందుకు రాలేదని గుప్త చెప్పడంతో రామ్మూర్తి, మంగళ ఏమై ఉంటుందని ఆలోచనలో పడతారు. అప్పుడే మిస్సమ్మ రూపంలో ఉన్న అరుంధతి బయటకు వచ్చి పెళ్లికి వెళ్తున్నాను అని చెబుతుంది.

బాలిక ఆగుము బాలిక అంటాడు గుప్త. గుప్తా గారు నేను వెళ్లాలి జరగండి అంటుంది అరుంధతి. లేదు బాలిక నువ్వు చాలా పెద్ద తప్పు చేయుచున్నావు. నేను నిన్ను వెళ్లనివ్వను. మీ ప్రాణం పోయి నీ బంధము వీడి ఇన్ని దినములు అయినది ఇంకా ఎందుకు బాధపడుతుంటివి.. ఎందుకు ఏమి కోరి కష్టములను తెచ్చుకుంటున్నావు. చూడు బాలిక జరిగినది చూచుట తప్ప మరి ఏమి చేయనని మాకు మాట ఇచ్చావు. గుర్తుందా? ఇప్పుడు ఇలా చేయడం సబబు కాదు అంటాడు గుప్త.

బాధ మూటగట్టుకుని

నన్ను మన్నించండి గుప్తా గారు. నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఇది తప్ప వేరే మార్గము కనిపించట్లేదు. ఇంకొద్ది సేపట్లో గడియలు ముగియపోతున్నాయి. ఆ తర్వాత నేను ఏమి చేసినా నేను ఎంత బతిమిలాడినా మీరు ఇక్కడ ఉంచరని నాకు తెలుసు. చనిపోయాక కూడా ఇక్కడే ఉంటే ఆడజన్మకు కావాల్సిన బాధను మూట కట్టుకుంటున్నాను అన్నారు కదా. అంటే నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఈ పరిస్థితుల్లో వదిలేస్తే అంతకన్నా బాధని మూటకట్టుకొని వెళ్తాను గుప్తా గారు అని అరుంధతి అంటుంది.

నా జీవితమంతా ఇచ్చినదాంతో తృప్తి పడటం అలవాటైపోయిన దానిలో. మొదటిసారి నాకు కావలసిన దాని కోసం పోరాడుతున్నాను గుప్తా గారు. దయచేసి నన్ను ఆపకండి. అనాధగా పుట్టడం అదే నా తలరాత.. నా పిల్లలు కూడా పడతారంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే ఒక అనాధగా ఉండడం అంటే రోజు చస్తూ బతకడం గుప్తా గారు. ఆ చావు బతుకులు గురించి నా కన్నా ఇంకా ఎవరికీ బాగా తెలియదు అంటుంది మిస్సమ్మ రూపంలో ఉన్న అరుంధతి.

హామీ ఏమున్నది

అయినను నీవు ఎక్కువ సమయం ఈ బాలిక శరీరంలో ఉండటం మంచిది కాదు అంటాడు గుప్త. నేను అనుకున్నది అయిపోయిన వెంటనే బయటికి వచ్చేస్తా గుప్తా గారు అంటుంది అరుంధతి. ఈరోజు 11:15 నిమిషాలకు పౌర్ణమి ఘడియలు ముగియనున్నాయి. అటు పిమ్మట నీవు ఎట్టి పరిస్థితులలో ఉన్నను బాలిక శరీరమును వదిలి బయటకు రావలెను. ఈ సారికి పెళ్లిని ఆపెదవు. మరల తనని వివాహం చేసుకోడని ఏమీ హామీ ఉన్నది అని అడుగుతాడు గుప్త.

ప్రయత్నించకుండా ఉండేలా, ప్రయత్నించినా ప్రయోజనం ఉండకుండా ఉండేలాగా చేయబోతున్నాను గుప్తా గారు. మనోహరి అనే సమస్యకి శాశ్వత పరిష్కారమే ఇవ్వబోతున్నాను గుప్తా గారు అంటుంది అరుంధతి. అమర్ అడ్రస్ తెలుసుకుని వచ్చిన బీహార్ గ్యాంగ్ కూడా అక్కడ మనోహరికి ఈరోజు పెళ్లి అని తెలుసుకుంటాడు. మిలిటరీలో ఆనందంగా, చక్కగా ఉండే నా కొడుకు లైఫ్ ఇలా చాలా బాధగా అయిపోయిందని అమరేందర్ తండ్రి ఫీలవుతుంటాడు.

పిల్లల దగ్గరికి మిస్సమ్మ

మనోహరి అమర్ లైఫ్‌ని మార్చుతుందేమో అని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది అమర్​ తల్లి. పిల్లల కోసం రాథోడ్‌కి ఫోన్ చేస్తాడు అమర్ తండ్రి. పిల్లలు రారు, వాళ్లకి పెళ్లి ఇష్టం లేదని చెబుతూ ఉండగా మిస్సమ్మ వస్తున్నది అని చెబుతాడు. ఎందుకు వస్తుందో కనుక్కొని చెప్తాను అని అంటాడు. మిస్సమ్మ రూపంలో వచ్చిన అరుంధతి పిల్లలని దగ్గరికి తీసుకుంటుంది. వాళ్లకి చిన్న కథ ఒక చిన్న పాప ఎలా గెలిచిందో చెప్పి మళ్లీ వాళ్లు సంతోషపడేలా చేస్తుంది.

మిస్సమ్మగా ఉన్న అరుంధతి ఏం చేయబోతుంది? బీహార్​ గ్యాంగ్​ మనోహరిని ఎందుకు వెతుకుతోంది? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 19న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్​ తప్పకుండా చూడాల్సిందే!