NNS 09th April Episode: గుప్త చేతికి చిక్కిన అరుంధతి ఆత్మ.. మనోహరికి వార్నింగ్​ ఇచ్చిన హంతకుడు!-zee telugu serial nindu noorella saavasam today april 9th episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 09th April Episode: గుప్త చేతికి చిక్కిన అరుంధతి ఆత్మ.. మనోహరికి వార్నింగ్​ ఇచ్చిన హంతకుడు!

NNS 09th April Episode: గుప్త చేతికి చిక్కిన అరుంధతి ఆత్మ.. మనోహరికి వార్నింగ్​ ఇచ్చిన హంతకుడు!

Hari Prasad S HT Telugu
Apr 09, 2024 01:29 PM IST

NNS 09th April Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఏప్రిల్ 9) ఎపిసోడ్లో గుప్త చేతికి చిక్కుతుంది అరుంధతి ఆత్మ. అటు మనోహరికి హంతకుడు వార్నింగ్ ఇస్తాడు.

గుప్త చేతికి చిక్కిన అరుంధతి ఆత్మ.. మనోహరికి వార్నింగ్​ ఇచ్చిన హంతకుడు!
గుప్త చేతికి చిక్కిన అరుంధతి ఆత్మ.. మనోహరికి వార్నింగ్​ ఇచ్చిన హంతకుడు!

NNS 09th April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఏప్రిల్ 9) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి నగల ఉన్న బ్యాగు తీసుకొచ్చి అరుంధతిని చంపిన హంతకుడికి ఇచ్చి, ఇవి తీసుకుని అమర్‌ కంటికి కనిపించనంత దూరం వెళ్లు అని చెప్తుంది.

నాకు కావాల్సింది డబ్బో నగలో కాదు అమర్‌ తో పెళ్లి అందుకోసమే ఎన్నో చేశాను. ఇంకా చేస్తాను కూడా.. అనగానే ఆ డ్రైవర్‌ మీ మీద నమ్మకంతో తీసుకెళ్తున్నాను, ఏదైనా తేడా జరిగితే మాత్రం మీరు ఆ పెళ్లి గురించి మర్చిపోవాల్సిందే అని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు.

అంజు వెనుక పడిన గుప్త

గుప్త అంజు కోసం వెతుక్కుంటూ పైకి వెళ్తాడు. గుప్తను గమనించిన నీల కూడా వెనకాలే ఫాలో చేస్తుంది. గుప్తకు అంజు కనిపించగానే.. దొరికితివి బాలిక అంటాడు. నేను మీ వెనక ఉంటే అలా ఎలా కనిపెట్టేశారు అంటుంది నీల. ఈవేళ నిన్ను ఇచట నుంచి మాతో పాటు తీసుకెళ్లేదను అంటాడు గుప్త. పెళ్లి చేసుకుంటానంటున్నారు అనుకుంటుంది నీల.

నీకు ఇష్టం ఉన్ననూ లేకున్ననూ ఇచట నుంచి మనం వెళ్లుట తథ్యం అంటాడు గుప్త. ఇష్టం లేకుండానే నా మనసు నీకు ఇచ్చానా? అంటుంది నీల. ఇక నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అంటాడు గుప్త. ఎవ్వరొచ్చి కాపాడిన నేను ఒప్పుకోను అంటూ నీల వెనక నుంచి వచ్చి గుప్తను గట్టిగా హగ్‌ చేసుకుంటుంది. ఇంతలో అంజు వచ్చి వాట్‌ ఏ రొమాంటిక్‌ ఫోజ్‌ గుప్త గారు అనగానే గుప్త అంజును పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అంజు పారిపోతుంది. నీల గుప్తను గట్టిగా పట్టుకునే ఉంటుంది. నీల నుంచి తప్పించుకుని గుప్త వెళ్లిపోతాడు.

తర్వాత అంజు శివరాం రూంలోకి వెళ్లి అచ్చం అరుంధతిలా మాట్లాడుతూ టాబ్లెట్ వేసుకోమని చెప్పగానే శివరాం, నిర్మల షాక్‌ అవుతారు. ఇంతలోనే అరుంధతి మాట మార్చి మీరు బాధపడుతున్నారని అమ్మలా మాట్లాడానని చెప్పి టాబ్లెట్‌ ఇచ్చి బయటకు వెళ్లి ఏడుస్తుంది.

హంతకుడు డ్రైవర్‌ నగలు తీసుకుని జువెలరీ షాపుకు వెళ్లి నగలు ఇచ్చి 20 లక్షలు ఇవ్వమని అడగ్గానే వాటిని చెక్‌ చేసి గిల్టీ నగలు తెచ్చి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? అంటూ షాపు అతను పోలీసులకు పట్టిస్తాననడంతో అక్కడ నుండి పారిపోతాడు.

బయటకు వచ్చిన అరుంధతి ఆత్మ

గుప్త అంజు లోపల ఉన్న అరుంధతితో నిన్ను ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు అంటూ మంత్రాలు చదువుతుంటే అంజు వద్దు గుప్త గారు అంటూ వెనక్కి నడుస్తూ పూజ గదిలోకి వెళ్తుంది. దీంతో అంజు లోపల నుంచి అరుంధతి ఆత్మ బయటకు వస్తుంది. గుప్తకు దొరకకుండా పారిపోతుంటే గుప్త వెనకాలే పరిగెడతాడు.

బయట నుంచి వస్తున్న మిస్సమ్మ కారు గుప్తకు తగిలి పడిపోతాడు. మిస్సమ్మ దిగి వస్తుంది. అయ్యో మీకేం కాలేదు కదా గుప్త గారు అని అడుగుతుంది మిస్సమ్మ. నీవు ఉండవమ్మా? అని గుప్త అనగానే ఏంటి గుప్త గారు ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడుగుతుంది. బాలిక కొరకు అంటాడు గుప్త. ఓ పక్కింటావిడ.. టైం పాస్‌ కొరకు దాగుడు మూతలు ఆడుతున్నారా? అంటున్న మిస్సమ్మతో అటులనే అనుకో బాలిక నా చేతికి చిక్కినచో ఆట ముగుయును అంటాడు గుప్త.

అక్క ఆ కారు వెనకే దాక్కుంది అని మిస్సమ్మ అనగానే.. అక్కనా ఆ అక్క ఎవరో ఈరోజు తేల్చాలి అనుకుంటాడు రాథోడ్​. వెనకకు వెళ్లి చూస్తే రాథోడ్ కు ఎవ్వరూ కనిపించరు. ఇంతలో కారుకు ఒకవైపు మిస్సమ్మ, మరోవైపు నుంచి గుప్త వచ్చి అరుంధతిని పట్టుకుంటారు. మిస్సమ్మ లోపలికి వెళ్లిపోతుంది. అరుంధతి, మిస్సమ్మ వెనకాలే పరుగెడుతుంటే గుప్త ఆపుతాడు. ఈ ఒక్క రోజు తనకు అవకాశం ఇవ్వమని గుప్త కాళ్ల మీద పడి ప్రాధేయపడుతుంది. దీంతో గుప్త సరేనని ఒక్కరోజు మాత్రమే నీకు అవకాశం ఇస్తున్నానని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో అరుంధతి హ్యాపీగా ఫీలవుతుంది.

మనోహరికి ఫోన్‌ చేసి.. డూప్లికేట్‌ నగలు ఇస్తావా? అంటూ వార్నింగ్‌ ఇస్తాడు హంతకుడు. దాంతో మనోహరి షాక్‌ అవుతుంది. మళ్లీ ఇంట్లోకి వెళ్లి నగలు చెక్‌ చేస్తుంది. నా దగ్గర ఉన్నవి కూడా డూప్లికేట్‌ నగలేనని చెప్పడంతో నాతోనే నాటకాలు ఆడుతున్నావా? అంటూ రేపు పొద్దున వరకు మీకు టైం ఇస్తున్నా అంటాడు డ్రైవర్​. అసలు నగలు ఏమయ్యాయి? మనోహరి వాటిని ఎలా కనిపెడుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 09న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point