Parenting Tips : పిల్లలు ముందు తల్లిదండ్రులు అస్సలు చేయకూడని పనులు-parents should not do these things in front of children ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips : పిల్లలు ముందు తల్లిదండ్రులు అస్సలు చేయకూడని పనులు

Parenting Tips : పిల్లలు ముందు తల్లిదండ్రులు అస్సలు చేయకూడని పనులు

Anand Sai HT Telugu
Apr 10, 2024 12:30 PM IST

Parenting Tips : పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది.

పిల్లల ముందు చేయకూడని తప్పులు
పిల్లల ముందు చేయకూడని తప్పులు (Unsplash)

పిల్లలు సహజంగానే మొహమాటపడతారు. వారు ఇతరుల నుండి చూసే, విన్న వాటిని అనుసరిస్తారు. అందుకే వారి ముందు మనం చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. ఈ విధంగా పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని విషయాల గురించి ఈ పోస్ట్‌లో చూద్దాం..

పిల్లల ముందు వాదించడం

మీ పిల్లల ముందు వాదనలకు దిగకండి. పిల్లల ముందు వాదించడం వల్ల పిల్లల మనశ్శాంతి దెబ్బతింటుంది. వారిని కఠిన హృదయులుగా మార్చవచ్చు. మనం చేసే ప్రతి పని బయటి ప్రపంచానికి ప్రతిబింబిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

చెడు పదాల వాడకం

మీ పిల్లల ముందు చెడు పదాలు ఉపయోగించకండి. మీరు పిల్లల ముందు ఉపయోగించే పదాలు వారి మనస్సులలో లోతుగా వెళ్తాయి. అందువల్ల వారు దాని గురించి ఇతరులకు చెప్పే అవకాశం ఉంది.

పిల్లల ముందు మద్యపానం అలవాటు

మీ పిల్లల ముందు మద్యపానం, ధూమపానం అలవాటు మానుకోండి. ఎందుకంటే మన పిల్లలు మన నుండి చాలా విషయాలు నేర్చుకుంటారు. అంతేకాదు మా నాన్నగారి వ్యవహారశైలి సరైనది అనుకుంటారు. పిల్లల ముందు చెడు అలవాట్లు చేయవద్దు.

ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం

పిల్లల ముందు ఇతరుల గురించి చెడుగా లేదా అవమానకరంగా మాట్లాడకండి. ఇలా చేయడం వల్ల పిల్లల మనసులో ఆ వ్యక్తి గురించి తప్పుడు ఆలోచనలు ఏర్పడతాయి.

ఇతరులతో పోల్చడం

మీ పిల్లలను ఇతరుల ముందు పోల్చడం లేదా మీ పిల్లల ముందు ఇతరుల గురించి మాట్లాడటం తప్పు. ఇలా చేయడం వల్ల మానసికంగా కుంగిపోతారు. మీ పిల్లల ముందు అలా పోల్చకండి. ఇది పిల్లల్లో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను కలిగిస్తుంది.

ఎలక్ట్రానిక్ వినియోగం

స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, హెడ్ ఫోన్లు, వీడియో గేమ్ లు వంటి సాంకేతిక పరికరాలను పిల్లల ముందు ఉపయోగించవద్దు. ఇలా వాడటం వల్ల వారు ఒంటరిగా ఉన్న అనుభూతికి లోనవుతారు.

వేధింపులు

సాధారణంగా భార్యాభర్తలు గొడవపడతారు. కొన్నిసార్లు కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. అయితే పిల్లల ముందు ఇలాంటి పనులు చేయకపోవడమే మంచిది. అలాగే తరచూ తిట్టడం కూడా తప్పు. దీనివల్ల పిల్లలకి మీ గురించి తప్పుడు ఆలోచన రావచ్చు.

అబద్ధం

అబద్ధం చెప్పకుండా రోజు గడవలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే వీలైనంత వరకు పిల్లల ముందు అబద్ధాలు చెప్పడం మానుకోండి. మీరు నిలబెట్టుకోగలిగే వాగ్దానాలు మాత్రమే చేయండి. అనవసరమైన కోరికలను సృష్టించే అబద్ధాలు చెప్పొద్దు.

నిబంధనలు ఉల్లంఘించవద్దు

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు లేదా కార్యాలయానికి వెళ్లేటప్పుడు నిబంధనలను ఉల్లంఘించవద్దు. పిల్లల ప్రాథమిక లక్షణాలను అభివృద్ధి చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

జంక్ ఫుడ్

తమ పిల్లలకు అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ తినవద్దని చెప్పడంతో తల్లిదండ్రుల డ్యూటీ అయిపోదు. మీరు వాటిని కూడా నివారించాలి. పిల్లల ముందు తినకూడదు. అస్సలు తినకపోవడమే మంచిది. అందుకే తల్లిదండ్రులు పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారి భవిష్యత్ మీద దారుణంగా ప్రభావం పడుతుంది.

Whats_app_banner