Before Sleeping : నిద్రపోయేముందు పిల్లలకు తల్లిదండ్రులు ఈ 4 విషయాలు చెప్పకండి
Parenting Tips : పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే వారి మైండ్ ప్రశాంతంగా ఉండాలి. నిద్రపోయేముందు తల్లిదండ్రులు అనవసరమైన విషయాలను వారితో షేర్ చేసుకోకూడదు.
పిల్లల పెంపకం అనేది అనేక సవాళ్లతో కూడిన పెద్ద బాధ్యత. తల్లిదండ్రులు, పిల్లలు ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రత్యేక బంధంతో ఉంటారు. కానీ నేటి బిజీ ప్రపంచంలో అమ్మానాన్నలిద్దరూ తమ తమ పనుల్లో చాలా బిజీగా ఉండడం వల్ల పిల్లల కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో వారి చిన్ని మనసుపై పెద్ద ప్రభావం పడుతుంది. వారు మానసికంగానూ కుంగిపోతున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి. అప్పుడే వారికి ప్రశాంతంగా నిద్రపడుతుంది. లేదంటే మీకు మానసికంగా దూరం అవుతారు.
తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు పిల్లలతో మాట్లాడాలి. నిద్రపోయే ముందు క్షణాలు తల్లిదండ్రులు, వారి శిశువుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పడుకునేముందు పిల్లలకు సానుకూల విషయాలను మాత్రమే చెప్పడం చాలా ముఖ్యం. నిద్రపోయే ముందు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి విషయాలు చెప్పకూడదో తెలుసుకోవాలి.
ఇతర పిల్లలతో పోల్చవద్దు
నిద్రపోయే ముందు పిల్లలతో మాట్లాడేటప్పుడు, మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చవద్దు. ఇది వారిని వారికి తక్కువగా అనిపించే అనుభూతిని కలిగిస్తుంది. తల్లిదండ్రులు మీ పిల్లల ప్రత్యేక సామర్థ్యాల గురించి ఇతరులతో పోల్చకుండా మాట్లాడాలి. వారి ప్రతిభను అభినందించాలి. ఇతరులతో పోలిస్తే తక్కువగా అంచనా వేసుకుంటారు. మీపై వ్యతిరేకత మెుదలవుతుంది. అన్నింటిలో వెనకపడి పోతారు. నిద్రకు ముందు ఇతరులతో పోల్చితే వారికి సరిగా నిద్రపట్టదు.
నెగెటివ్ విషయాలు చెప్పకూడదు
నిద్రపోయే ముందు తల్లిదండ్రులు తమ పిల్లల మనసులో సానుకూల పదాలను నాటాలి. నెగెటివ్ విషయాలు చెబుతు ఉంటే తమను తాము ప్రశ్నించుకునేలా అవుతారు. మీ పిల్లలకు సానుకూల అభిప్రాయాన్ని అందించడం, వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే రిలాక్స్‌డ్ మైండ్‌తో హాయిగా నిద్రపోతారు. ఎలాంటి విషయాల గురించి ఆలోచించరు. చిన్నప్పుటి నుంచే పిల్లలను పాజిటివ్ మైండ్ తో పెంచాలి. అప్పుడే వారి జీవితం బాగుంటుంది.
తప్పుడు వాగ్దానాలు చేయకూడదు
నిద్రపోయే ముందు తల్లిదండ్రులు తమ పిల్లలను ఒప్పించేందుకు తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. తల్లిదండ్రులు వీలైనంత వరకు వారు చెప్పేది చేయడానికి ప్రయత్నించాలి. చేయగలిగినది మాత్రమే చేస్తానని వాగ్దానం చేయాలి. లేకుంటే పిల్లలు దీన్ని అనుకరించడం ప్రారంభించి తప్పుడు వాగ్దానాలు చేయడం అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా నిద్రపోయే ముందు తమ పిల్లలతో భవిష్యత్తు ఆందోళనల గురించి మాట్లాడవద్దు. ఇది వారికి ఆందోళన కలిగిస్తుంది. నిద్రకు భంగం కలిగిస్తుంది. నువ్ పడుకుంటే ఇది కొనిస్తా.. అది కొనిస్తానని వారికి ఆశలు కల్పించకూడదు. సాధ్యంకాని వాగ్దానాలను అస్సలు చేయకూడదు.
నిద్రకు ముందు శిక్షించవద్దు
తల్లిదండ్రులు నిద్రవేళకు ముందు పిల్లలను శిక్షించడం, వారితో కఠినంగా ప్రవర్తించడం మానుకోవాలి. పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా తల్లిదండ్రులు నిద్రపోనివ్వరు. పిల్లలు ప్రశాంతంగా, సురక్షితంగా ఉండేందుకు ఆ సమస్యను పరిష్కరించండి. సానుకూలంగా మాట్లాడండి. శిశువు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత నిద్రపోవాలి. లేదంటే రాత్రంతా ఒక్కరే ఏడుస్తూ ఉంటారు. మనసులో అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని పిల్లలు నిద్రపోరు.
టాపిక్