NNS May 6th Episode: మిస్సమ్మపై పగ సాధిస్తున్న పిల్లలు.. అరుంధతి చివరి కోరిక.. అమర్ మాటలకు కుప్పకూలిన రామ్మూర్తి-nindu noorella saavasam serial may 6th episode children revenge on bhagamathi nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns May 6th Episode: మిస్సమ్మపై పగ సాధిస్తున్న పిల్లలు.. అరుంధతి చివరి కోరిక.. అమర్ మాటలకు కుప్పకూలిన రామ్మూర్తి

NNS May 6th Episode: మిస్సమ్మపై పగ సాధిస్తున్న పిల్లలు.. అరుంధతి చివరి కోరిక.. అమర్ మాటలకు కుప్పకూలిన రామ్మూర్తి

Sanjiv Kumar HT Telugu
May 06, 2024 12:15 PM IST

Nindu Noorella Saavasam May 6th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 6వ తేది ఎపిసోడ్‌‌లో మిస్సమ్మపై పిల్లలు పగ సాధిస్తుంటారు. భాగమతి చెప్పింది వినరు. మరోవైపు గుప్తాతో తనకు చివరి కోరిక ఉందని చెబుతుంది అరుంధతి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 6వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 6వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS May 6th April Episode) అమర్​ ఆఫీస్​కి వెళ్తుంటే మిస్సమ్మను ఎదురురమ్మని అంటుంది నిర్మల. మిస్సమ్మ భయంతో వద్దని అంటున్నా వినకుండా తీసుకెళ్లి జీప్​ ముందర నిల్చోపెడుతుంది నిర్మల. కోపంగా వెళ్తున్న అమర్​ని చూసి వెక్కిరిస్తుంది మిస్సమ్మ. అమర్​ సైడ్​ మిర్రర్​లో నుంచి మిస్సమ్మను చూసి మరింత కోపం పెంచుకుంటాడు.

మీరు కూడా మారిపోయారు

అమర్​ వెళ్లిపోగానే మనోహరి కోపంగా లోపలకు వస్తుంది. నేను వడ్డిస్తాను మీరు తినండి అమ్మ అంటుంది నీల. పిల్లలు వచ్చాక తింటాను అంటుంది మనోహరి. ఇంతకుముందు వాళ్లకి తిండి పెట్టొద్దు అన్నారు. ఇప్పుడు మీరు వాళ్లు వచ్చాక తింటానంటున్నారు మీరు కూడా మారిపోయారు అంటుంది నీల. నేనేమీ మారిపోలేదు నేను చెప్పిన మాటలకు వాళ్లు మిస్సమ్మ మీద కోపంగా ఉన్నారు. వాళ్లు దాన్ని ఆడుకోవడం నేను చూడాలి అంటుంది మనోహరి.

భాగమతి నిర్మల తినడానికి వస్తారు. పిల్లలు కూడా వస్తారు. పిల్లలు ఎంత హాలిడేస్ అయితే మాత్రం ఇంత లేటుగా తింటారా రండి అని భాగమతి కుర్చీలను జరుపుతుంది. నీల.. ఆ కుర్చీలు ఎలా ఉన్నాయో అలా పెట్టు అంటుంది అమ్ము. నీల వెళ్లి ఆ కుర్చీలను జరుపుతుంది. పిల్లలు వెళ్లి కూర్చుంటారు. నీకు ఇష్టమైన ఇడ్లీలు చేశాను అమ్ము అంటుంది మిస్సమ్మ. నువ్వు పెడితే మేము తినం నీల పెడితేనే తింటాం లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోతాం అంటారు పిల్లలు.

నువ్ బాధపడాల్సి ఉంటుంది

నీల అందరికీ వడ్డిస్తుంది. పిల్లలు తిని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అర్థం చేసుకోవడానికి మాకే ఇంత టైం పట్టింది వాళ్లకి కూడా కొంచెం టైం పడుతుంది. నువ్వేమీ బాధపడకు అని నిర్మల మిస్సమ్మని ఓదారుస్తుంది. ఆంటీ చెప్పింది కదా అని పిల్లలు నీతో మాట్లాడతారు అని అనుకుంటే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది మిస్సమ్మ. వాళ్లు నిన్ను నమ్మరు. నేను నమ్మనివ్వను అంటుంది మనోహరి. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లను. పక్కకు తప్పుకుంటే నేను గదిలోకి వెళ్తాను అని మిస్సమ్మ వెళ్లిపోతుంది.

దెబ్బ మీద దెబ్బ పడుతున్న మిస్సమ్మ ఎందుకని ఇంత పొగరుగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది మనోహరి. గుప్తా అరుంధతిని తీసుకొని యమలోకానికి వెళ్తూ ఉండగా.. అరుంధతి కళ్లు తెరిచి మనం ఈ లోకానికి వెళ్తున్నామని సంతోషపడుతుంది. నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించి బాధపడతావ్ అనుకుంటే ఇలా సంతోషంగా ఉన్నావేంటి అని అంటాడు గుప్త. మిస్సమ్మ కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పిల్లలు మిస్సమ్మని అర్థం చేసుకుంటారు అని అంటుంది అరుంధతి.

చివరి కోరిక

నాది చివరి కోరిక ఉంది గుప్తా గారు తీరుస్తారా అని అడుగుతుంది అరుంధతి. చివరికి ఒకటే ఉంటుంది. కానీ, నువ్వు ఇన్ని కోరికలు కోరావు నేను నీ కోరిక తీర్చలేను అంటాడు గుప్తా. నేను భూలోకానికి తీసుకెళ్లాలి మా కుటుంబాన్ని చూడాలి అని అడగను అంటుంది అరుంధతి. అయితే ఏంటో చెప్పు నీ కోరిక అని అంటాడు గుప్తా. కాసేపు గాల్లోనే ఆపుతారా అంటుంది అరుంధతి. ఎందుకు ఇక్కడ ఆపమన్నావు అని అడుగుతాడు గుప్తా.

నేను మేఘాలను ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు అని అరుంధతి వాటితో ఆడుకుంటుంది. రాథోడ్ అమర్ కారులో వెళ్తుండగా, మధ్యాహ్నంకి భోజనం తేవాలా అని అడుగుతాడు రాథోడ్. ఆ మోసగత్తే ఇంట్లో ఉన్నంతవరకు నేను ఆ ఇంటికి వెళ్లను. దాని మొహం చూస్తే నాకు ఆ మోసమే గుర్తుకొస్తుంది. నా రక్తమంతా మరుగుతుంది అని అమర్ అంటాడు. మిస్సమ్మ ఎలాంటి పరిస్థితుల్లో మోసం చేయాల్సి వచ్చిందో అని రాథోడ్ అంటాడు.

మూతి ఉమ్మని పెట్టుకుని

కారణం ఉన్నంత మాత్రాన మోసం మంచిదై పోదు రాథోడ్ అని అమర్ అంటాడు. ఇంతలో మిస్సమ్మ రాథోడ్‌కి ఫోన్ చేస్తుంది. రాథోడ్ ఫోన్ స్పీకర్‌లో పెడతాడు. అసలు ఆయన ఏమనుకుంటున్నారు రాథోడ్. నేనేదో నా బ్యాడ్ టైం ఇలా ఉండాలని పెళ్లి చేసుకున్నాను. కానీ అసలు ఎవరైనా ఆయనను చేసుకుంటారా. ఎప్పుడు మూతి ఉమ్మని పెట్టుకొని ఉంటారు. ఏదో ఆంటీ చెప్పారు కదా అని ఎదురు వెళ్లాను అని మిస్సమ్మ అంటుంది.

నేనేదో కావాలని వచ్చాను అని నామీద కోపంగా ఉంటే నాకు కోపం రాదా? అలా చేస్తే నేను ఊరుకోను. ఏదో తెలిసి తెలియక తప్పు నా వైపు ఉందని అనుకుంటున్నాను. లేకపోతే అసలు నేను ఏం చేసేదాన్నో నాకే తెలియదు అని మిస్సమ్మ అంటుంది. ఆయనేమన్న మా బావన. మా అక్క చనిపోయింది అని నేను పెళ్లి చేసుకున్నానా. అంత పొగరుగా ప్రవర్తిస్తున్నారు. రాథోడ్ నీ పక్కన పామేమైనా ఉందా అలా బుస కొట్టే సౌండ్ వస్తుంది ఎందుకు అని భాగమతి అంటుంది.

అమర్ ఇంటికి రామ్మూర్తి

నువ్వు ఇలా మాట్లాడితే సార్‌కి కోపం వస్తుంది మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. నేను మాట్లాడింది నువ్వు విన్నావు అంతేగాని ఆయన వినలేదు కదా అంటుంది మిస్సమ్మ. నువ్వేమైనా ఫోన్ స్పీకర్‌లో పెట్టావా రాథోడ్ అంటుంది. అవును మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. అయితే నేను మీకు ఫోన్ చేయలేదు మీరేం వినలేదు అని మిస్సమ్మ ఫోన్ కట్ చేస్తుంది. రామ్మూర్తి మంగళ అమర్ వాళ్ల ఇంటికి వస్తారు.

ఏమైందయ్యా అలా చూస్తున్నావు అని అంటుంది మంగళ. ఇంతకుముందు ఇంటికి వచ్చినప్పుడు నన్ను నా కూతురు పలకరించినట్టు ఉండేది. కానీ, ఈరోజు ఏదో వెలితిగా ఉంది అని అంటాడు రామ్మూర్తి. బాధగా ఇంట్లోకి వెళతాడు. నిర్మల, శివరామ్​ రామ్మూర్తి, మంగళను కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు. ఇంతలో అమర్​ రావడంతో తమ ఇంటికి మూడు రోజులు రమ్మని అంటాడు రామ్మూర్తి.

కుప్పకూలిపోయిన రామ్మూర్తి

ఇష్టం లేకుండా జరిగిన పెళ్లికి సంప్రదాయం పేరుతో ఇలాంటివి చేయొద్దని అసలు అలాంటి ఉద్దేశంతో ఇంటికి రావద్దొని ముఖం మీదే అంటాడు అమర్​. రామ్మూర్తి బాధతో కుప్పకూలిపోతాడు. అమర్​ మాటలకి నొచ్చుకున్న రామ్మూర్తికి ఏం కానుంది? అరుంధతి ఆత్మ తిరిగి భూమ్మీదకు రానుందా? అనే విషయాలు తెలియాలంటే మే 07న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point