Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 18th May Episode) అమర్ తలకి నూనె రాసి స్నానం చేయించమని రామ్మూర్తి చెప్పడంతో చేసేదేంలేక సరే అంటుంది భాగీ. తనకు ఎలాంటి మర్దన అక్కర్లేదని చిరాకు పడతాడు అమర్. రామ్మూర్తి బలవంతంతో అమర్‌కి స్నానం చేయించడానికి ఒప్పుకుంటుంది భాగీ.
కొబ్బరి నూనె అంతా తలపై పోయడంతో కోపంతో నీకు చేయడం రాదని నాకు తెలుస్తుంది అని అరుస్తాడు అమర్. నాన్న లోపలకు వెళ్లాడు కదా నువ్వు చెయొచ్చు కదా రాథోడ్ అంటుంది భాగీ. మా సార్‌ని ఇంటికి పిలిచి ఇలా అవమానం చేస్తారా అంటాడు రాథోడ్. ఇదంతా చూసిన మనోహరి కోపంగా అమర్.. నువ్వు ఈ పనులన్నీ చేసుకుని వస్తే నీతో మాట్లాడాలి అంటుంది. థ్యాంక్స్ మేడమ్ మిమ్మల్ని ఎలా వెళ్లమనాలా అనుకుంటున్నా మీరే వెళ్తున్నారు అంటాడు రాథోడ్.
కోపంగా అక్కడనుంచి వెళ్లిపోతుంది మనోహరి. రామ్మూర్తి ఇంట్లో ఉన్న సరస్వతికి మెలకువ వస్తుంది. అలికిడి విని లోపలకు వచ్చిన రామ్మూర్తి.. మీరు రోడ్డు మీద పడిపోయి ఉంటే తీసుకొచ్చానమ్మా, మీరు ఎవరు అని అడుగుతాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది సరస్వతి. దాహంగా ఉందనడంతో మనోహరిని పిలిచి కొంచెం నీళ్లు తెమ్మని చెబుతాడు రామ్మూర్తి.
నేనేమన్నా ఈ ఇంట్లో పని మనిషినా అనుకుంటూ కోపంగా నీళ్లు తేవడానికి వెళ్తుంది మనోహరి. అప్పుడే అమర్ రాథోడ్‌ని పిలిచి జీప్ తియ్ హైదరాబాద్‌కి వెళ్దాం అంటాడు. మూడు రోజులు ఇక్కడ ఉంటామని పెద్దాయనతో చెప్పి సడెన్‌గా వెళ్తే ఆయన బాధపడతాడేమో సార్ అంటాడు రాథోడ్. సరస్వతి మేడమ్ ఇంకా ఇక్కడకు రాలేదు. ఆమె నాతో ఏదో చెప్పాలనుకుంటుంది. ఆమెకి నాకు మధ్య ఎవరో అడ్డుపడుతున్నారు అంటాడు అమర్.
ఆమెను కాపాడుకోవల్సిన బాధ్యత తనదేనని మనోహరి, పిల్లలు ఇక్కడే ఉంటారు. మనం వెళ్దాం అంటాడు. అమర్ మాటలు విన్న పిల్లలు, మనోహరి లగేజ్‌తో వచ్చి తాము కూడా హైదరాబాద్ వచ్చేస్తాం అంటారు. అదేంటి పిల్లలు ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉంటామన్నారు కదా అంటాడు అమర్. మాకు ఇక్కడేం నచ్చడం లేదు డాడీ, మేం కూడా మీతో వచ్చేస్తాం అంటారు పిల్లలు.
ఏమైంది పిల్లలు.. మీకు ఇలా చెప్పమని ఎవరు చెప్పారు అని అడుగుతాడు రాథోడ్. పిల్లలకు ఎవరైనా ఎందుకు చెప్తారు రాథోడ్.. అనవసరంగా అమర్ చెప్పినదానికి వాదించకు, అంకుల్‌కి నేను చెప్పివస్తాను అంటూ లోపలకు వెళ్తుంది మనోహరి. బయటకు వెళ్లి ఇంటికి వస్తున్న భాగీ అమర్ వాళ్లు అందరూ వాకిట్లో నిల్చోవడం చూసి ఏమైందని అడుగుతుంది. అందరం హైదరాబాద్ వెళ్లిపోతున్నాం మిస్సమ్మ అని చెబుతాడు రాథోడ్.
ఏమైందండీ.. ఏమైనా ప్రాబ్లమా? అని అడుగుతుంది భాగీ. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా నీతో షేర్ చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు అంటాడు అమర్. పిల్లలు కూడా తనపై కోపంతో ఉండటంతో మా నాన్న కోసమైనా ఇంకో రెండు రోజులు ఉండండి. నేను మీకు దూరంగా ఉంటాను అంటుంది మిస్సమ్మ. ఆయన కోసమే కదా ఇక్కడిదాకా వచ్చాం అంటాడు అమర్.
యమలోకం నుంచి అరుంధతి, గుప్త నేరుగా రామ్మూర్తి ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు. ఇదేంటి.. ఈ ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతుంది అరుంధతి. ఆ ఇంటితో తనకు ఏదో బంధం ఉందని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అది భాగమతి ఇళ్లని, భాగీ ఇల్లంటే తన ఇంటితో సమానమని మీరే చెప్పారు కదా అంటుంది అరుంధతి. ఇద్దరూ లోపలకు వెళ్తారు. ఎదురుగా భాగీ, అమర్, రాథోడ్, పిల్లలు ఉండటంతో వాళ్ల కంటపడకుండా ఇంటి వెనకవైపు వెళ్తారు.
మంచి నీళ్లు తీసుకుని లోపలకు వెళ్లిన మనోహరి సరస్వతిని చూసి షాకవుతుంది. అమర్ పిలుస్తున్నాడని చెప్పి రామ్మూర్తిని అక్కడ నుంచి బయటకు పంపిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు, అరుంధతి నిన్ను నమ్మి తప్పు చేసింది అంటుంది సరస్వతి. తన గురించి అమర్‌కి చెప్పేలోపు సరస్వతిని చంపేయాలనుకుంటుంది మనోహరి. దిండుతో సరస్వతి ముఖాన్ని అదిమిపెడుతుంది.
అప్పుడే అటుగా వచ్చిన అరుంధతి మనోహరి చేస్తున్న పని చూసి షాకవుతుంది. సరస్వతి చనిపోకుండా అరుంధతి కాపాడుతుందా? మనోహరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే మే 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!