NNS June 12th Episode: మిస్సమ్మను పంపించేయనున్న అమర్- అరుంధతిని చూసిన భాగీ- మనోహరిపై శివరామ్‌కు డౌట్- నోరు జారిన రాథోడ్
Nindu Noorella Saavasam June 12th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 12వ తేది ఎపిసోడ్‌లో మిస్సమ్మను ఇంట్లోంచి పంపించేయాలని అమర్ ప్లాన్ చేస్తాడు. మరోవైపు సగం కాలిపోయిన అరుంధతి డ్రాయింగ్‌ను మిస్సమ్మ చూస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 12th June Episode) భాగీ డ్రాయింగ్ చూడకూడదని కాల్చేస్తుంది మనోహరి. అందరూ మిస్సమ్మనే ఆ డ్రాయింగ్ కాల్చేసిందని అనుకునేలా మాట్లాడుతుంది. పిల్లలు, అమర్ మిస్సమ్మను నిందిస్తుంటే తన పొరపాటు వల్లే డ్రాయింగ్ కాలిపోయిందని నింద తన మీద వేసుకుంటాడు రామ్మూర్తి.
చేయని తప్పు మీదేసుకున్నావ్
కాలిపోయిన డ్రాయింగ్‌ను తీసుకుని చూస్తూ బాధపడుతుంటాడు అమర్. ఇంతలో అందరూ బయటికి వెళ్లిపోతారు. బయటకు వచ్చిన మిస్సమ్మ వాళ్ల నాన్నను నువ్వు చేయని తప్పును నీ మీద ఎందుకు వేసుకున్నావని అడుగుతుంది. దీంతో నేను చుట్టపు చూపుగా వచ్చిన వాణ్ని. నేను తప్పు చేస్తే ఎవరూ ఏమనరు. కానీ, నువ్వు ఇంట్లో మనిషివి నువ్వు తప్పు చేశావని తెలిస్తే అందరూ తిడతారని చెప్పి వెళ్లిపోతాడు.
మిస్సమ్మ ఇంట్లోకి వస్తుంటే.. నన్నే ఇంట్లోంచి పంపించేస్తావా? ఇంత జరిగాక కూడా నీ కాన్ఫిడెంట్ కొంచెం కూడా తగ్గలేదు చూడు అది నాకు చాలా ముచ్చటేస్తుంది మిస్సమ్మ. నీ మీద గెలిచి గెలిచి నాకు బోర్ కొడుతుంది మిస్సమ్మ. ఆటలో నాకు మజానే రావడం లేదు అంటుంది మనోహరి. అయితే పోయి మాంగో జ్యూస్ తాగు. మజా రావడం లేదంట మజా అయినా నీ పేరు మనోహరి అని కాదు కాట్రాణి అని పెట్టాల్సింది అని చెప్పి మిస్సమ్మ లోపలకు వెళ్లిపోతుంది.
కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావ్
అమ్మును మనోహరి ఏం చేస్తుందోనని బాధపడుతుంది అరుంధతి. ఇంతలో గుప్త వచ్చి బ్రతుకు అబద్దం, చావు నిజం.. ఈ నిజమును ఒప్పుకోలేక కోరి ఎన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు బాలిక అంటాడు. నాకు కష్టం వస్తుందని నా కుటుంబం కష్టంలో ఉంటే వదిలేసి వెళ్లలేను కదా గుప్త గారు అంటుంది అరుంధతి.
కుంటుంబమూ..! పుట్టుక నిన్ను నీ పిల్ల పిచ్చుకలను ఏకం చేసినది. చావు ఆ కుటుంబమునకు నిన్ను దూరం చేసింది. ఇది నిజము. నాకిప్పుడు కావాల్సింది నిజము కాదు గుప్త గారు. నా పిల్లలు సంతోషంగా ఉండటం అనగానే నువ్వు బతికి ఉన్నా నీ పిల్లలకు ఆ నమ్మకం ఇవ్వలేవని గుప్త అంటాడు. కానీ, ఇప్పుడు ఆ నమ్మకం మిస్సమ్మ ఇస్తుంది. కానీ మనోహరి అడ్డుపడుతుంది అంటుంది. ఇంతలో గుప్త యముణ్ణి పిలుస్తాడు.
తెలియడం లేదు సార్
అరుంధతి నా మాట వినడం లేదని బలవంతంగా తీసుకొస్తానని చెప్పడంతో అమావాస్య రోజున తీసుకురమ్మని చెప్తాడు యముడు. సరేనంటాడు గుప్త. అమర్, అరుంధతి డ్రాయింగ్ గురించి ఆలోచిస్తుంటాడు. రాథోడ్ వస్తాడు. డ్రాయింగ్ చార్ట్‌ను పొరపాటున కూడా మిస్సమ్మ కాల్చదని మీకు కూడా తెలుసు. కానీ, మీరంత కటువుగా ఎందుకు మాట్లాడారో తెలియడం లేదు సార్. ఈ ఇల్లు కోల్పోయిన సంతోషాన్ని తీసుకొచ్చింది మిస్సమ్మ అంటాడు రాథోడ్.
మిస్సమ్మ పుట్టింట్లో ఉంటే పరువు మాత్రమే పోతుంది. ఈ ఇంట్లో నా దగ్గర ఉంటే తన ప్రాణాలే పోతాయి రాథోడ్. ఒక ఆడపిల్లకు నా వల్లనే కష్టం వస్తుందని తెలిసి చూస్తు ఎలా ఊరుకోవాలో తెలియక మిస్సమ్మను దూరంగా పంపించేయాలని చూస్తున్నాను. తను ప్రాణాలతో ఉండాలంటే నాకు దూరంగా ఉండాలి. ఆరును చంపిన వాణ్ణి, చంపమని చెప్పిన వాళ్లను పట్టుకునే వరకు తను దూరంగా ఉండాలి అంటాడు అమర్.
అనర్థాలకు కారణం మనోహరినే
రాథోడ్ వెళ్లిపోతాడు. నిర్మల, శివరాం మాట్లాడుకుంటుంటారు. ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు కారణం ఆ మనోహరేనని నాకు అనిపిస్తుంది అంటాడు శివరాం. అవునని నిర్మల అంటుంది. మరోవైపు పిల్లలు కూడా మిస్సమ్మ మంచిది కాదని చెప్తారు. అమ్ము మాత్రం మిస్సమ్మ చాలా మంచిదని ఒక్కసారి చాన్స్ ఇద్దామని చెప్తుంది. మరోవైపు మనోహరి కోపంగా అమర్ డ్రాయింగ్ కాలిపోయినప్పుడు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది.
మరోవైపు పూజ రూంలో సగం కాలిపోయిన డ్రాయింగ్ చూసి ఈ కళ్లు నేను ఎక్కడో చూసినట్టుంది అనుకుంటుంది. ఇంతలో రాథోడ్ రాగానే అదే విషయం చెప్తుంది. అది మా మేడం ఫోటో చూసినప్పుడు చూసి ఉండొచ్చు అంటాడు. దీంతో నేనెప్పుడూ మేడం ఫోటో చూడలేదని మిస్సమ్మ చెప్పడంతో రాథోడ్ షాక్ అవుతాడు.
ప్లాన్ వర్కౌట్
భాగీ కొడైకెనాల్కి వెళ్లింది అమర్ భార్యని కలవడానికే అని తెలుసుకుంటుందా? మిస్సమ్మను ఇంట్లో నుంచి పంపించేందుకు మనోహరి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే జూన్ 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!