NNS June 7th Episode: ప్రమాదంలో అమ్ము.. భాగీతో అమర్ రొమాన్స్.. కొద్దిలో మిస్ అయిన మిస్సమ్మ.. తండ్రికి పిల్లల సర్ప్రైజ్
Nindu Noorella Saavasam June 6th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 7వ తేది ఎపిసోడ్‌లో అమ్మును ఎలా చంపాలా అని మనోహరి ఆలోచిస్తుంటుంది. మరోవైపు భాగీ, అమర్ మధ్య జరిగే సీన్ రొమాంటిక్‌గా ఉంటుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 7th June Episode) బీహారీ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న మనోహరి నేరుగా అమర్ ఇంటి గార్డెన్‌లోకి వచ్చి అరుంధతిని బెదిరిస్తుంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు నీ పెద్ద కూతురు కూడా పైకి వస్తుంది. తీసుకుని వెళ్దువు కానీ అంటుంది.
అరుంధతిని తిట్టిన గుప్తా
నిన్న నీ కూతురు అచ్చం నీలాగే మాట్లాడింది. అయినా నా గురించి నిజం తెలిసిన ఎవరినైనా అడ్డు తొలగించుకోవడం నాకు అలవాటే కదా అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది మనోహరి. దాంతో అరుంధతి ఏడుస్తుంది. నిన్న నేను లేని సమయం చూసి ఏం చేసితివి అని గుప్త అడుగుతాడు. వెంటనే నిన్న పౌర్ణమి అని అరుంధతి అంటుంది. అంటే అమ్ము లోపలికి అరుంధతి వెళ్లిన విషయం తెలుసుకుని అరుంధతిని తిడతాడు గుప్త.
మరోవైపు అనుకోకుండా గదిలోకి వచ్చిన మిస్సమ్మ.. అప్పుడే స్నానం చేసి వచ్చిన అమర్‌కు తల ఢీ కొడుతుంది. ఆగండి.. అంటుంది మిస్సమ్మ. ఏంటి? అంటాడు అమర్. ఇంకోసారి డాష్ ఇవ్వండి. మీ కోసమే చెప్తున్నా.. కొమ్ములు వస్తే చూడ్డానికి అదోలా ఉంటుంది. ఒక్కసారి తల కొట్టుకుంటే కొమ్ముల వస్తాయని తెలియని మనిషిని పెళ్లి చేసుకున్నానే.. ఎందుకు దేవుడా నాకు ఏమీ తెలియని ఇలాంటి భర్తను ఇచ్చావు అనుకుంటుంది మిస్సమ్మ.
హ్యాపీగా భాగమతి
నీకెవరు ఇవ్వలేదు. నీకు నువ్వే వచ్చి ముసుగేసుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అంటాడు అమర్. మీకు ఎన్ని సార్లు చెప్పాను. ఆ పెళ్లి టాపిక్ తీయొద్దని అని ఇద్దరూ గొడవ పడతారు. అమర్, మిస్సమ్మను తోస్తుంటే మిస్సమ్మ తల మరోసారి అమర్ తలకు తగులతుంది. దీంతో మిస్సమ్మ నేనే గెలిచాను అని హ్యాపీగా ఫీలవుతుంది. అమ్ము వార్నింగ్ ఇవ్వడాన్ని గుర్తు చేసుకుంటూ తనని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది మనోహరి.
నీల కాఫీ తీసుకొచ్చి అమ్ము గురించి చెప్తుంది. దీంతో కోపంగా కాఫీ నీల ముఖానికి కొడుతుంది. ఇంకోసారి ఇలా అనుకుంటే చంపేస్తాను. ఈ ఇల్లు నాది అమర్ నావాడు. నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇల్లే నాది. అమర్ తలరాతలో ఎవరున్నా బతుకులో మాత్రం నేనే ఉంటా అని చెప్పి వెళ్లిపోతుంది మనోహరి. మరోవైపు పిల్లలు అమర్‌కు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతారు. అమ్ము వచ్చి నువ్వు ఏ గిఫ్ట్ ఇస్తున్నావు అంజు అని అడుగుతుంది. దీంతో అంజు గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి హ్యాపీగా ఫీలవుతారు.
ఫాదర్స్ డే సెలబ్రేషన్స్
అమర్, అరుంధతిల ఫోటో డ్రాయింగ్ వేసి ఉంటుంది. అవి తీసుకుని బయటకు వెళ్లబోతుంటే మనోహరి వస్తుంది. హాయ్ ఆంటీ రాత్రంతా కనబడలేదు. ఎక్కడికి వెళ్లారు. ఏంటి ఆంటీ అలా చూస్తున్నారు. నిన్న జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకండి. నేను మర్చిపోయా.. మీరు మర్చిపోండి. తెలుసు కదా మీరంటే నాకు ఎంత ఇష్టమో.. ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయడానికి లేట్ అవుతుంది. మీరు రావట్లేదా? అని పిల్లలందరూ కిందకు వెళ్తారు.
కింద రాథోడ్ ఇల్లు మొత్తం డెకరేట్ చేస్తుంటాడు. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. ఎవ్వరూ పిలిచినా మిస్సమ్మ పలకదు. నడుచుకుంటూ వెళ్లి అంజు వేసిన డ్రాయింగ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అంజు వచ్చి లాగేసుకుంటుంది. నా వస్తువులు నా పర్మిషన్ లేకుండా ముట్టుకోవద్దు అంటుంది. నా కూతురుకు ఏమీ కాకూడదు గుప్త గారు ప్లీజ్ మీరే ఏదైనా చేయండి అంటూ అరుంధతి ఏడుస్తుంది.
కాపాడుకునే శక్తినివ్వండి
విధిని ఎదిరించే ప్రయత్నం చేసినచో పరిణామాలు చాలా తీవ్రంగా ఉండునని నేను ఏనాడో నిన్ను హెచ్చరించితిని బాలిక. మరి తప్పిదమునకు మూల్యం చెల్లించాలి కదా? అంటాడు గుప్త. మీకు దండం పెడతాను గుప్త గారు దాన్ని కాపాడుకునే శక్తి నాకు ఇవ్వండి ప్లీజ్.. అని ఆరు అనగానే ఏం జరుగుతుందో చూద్దామని ప్రస్తుతం నీ పిల్లలు పితృదినోత్సవ వేడుకలు చేస్తున్నారు. వెళ్లి చూద్దాం పద అని లోపలికి వెళ్తారు.
నీల పైకి వచ్చి మనోహరిని కిందకు వెళ్దాం పద అని అడగ్గానే మనోహరి రానని చెప్తుంది. పిల్లలు అమర్‌కు ఫాదర్స్ డే విషెస్ చెప్పగానే అరుంధతి తాను బతికున్నప్పుడు జరుపుకున్న ఫాదర్స్ డేను గుర్తు చేసుకుంటుంది. అమ్ముని చంపడానికి మనోహరి ఏం చెయ్యబోతోంది? మనోహరి బారినుంచి అరుంధతి అమ్ముని కాపాడుతుందా? అనే విషయాలు తెలియాలంటే జూన్ 08న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!