NNS June 1st Episode: నిప్పుల మీద అడుగు పెట్టబోయిన అమర్.. అమృత శరీరంలో అరుంధతి.. మనోహరితో భాగీకి సారీ చెప్పించిన ఆరు
Nindu Noorella Saavasam June 1st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 1వ తేది ఎపిసోడ్‌లో మనోహరి నుంచి భాగీని ఎలాగైనా కాపాడాలని అనుకుంటుంది అరుంధతి. ఇంతలో అమర్ నిప్పులమీద అడుగు పెట్టబోతుంటే అమృత శరీరంలోకి దూరుతుంది ఆరు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 1st June Episode) వైశాఖ పౌర్ణమి రోజు తనకు వచ్చే శక్తులతో ఎలాగైనా భాగీని మనోహరి బారి నుండి కాపాడాలనుకుంటుంది అరుంధతి. సమయానికి గుప్త కూడా లేకపోవడంతో తనను వద్దని వారించేవారు ఎవరూ ఉండరని, ఎలాగైనా మనోహరి నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చేయాలని, ఇది తనకు దేవుడు ఇచ్చిన చివరి అవకాశం అని అనుకుంటుంది.
ఇల్లంత పొగ నింపడం కాదు
పౌర్ణమి ఘడియలు ప్రారంభం అవడంతో ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేస్తుంది భాగీ. దేవుడా.. ఈ జీవితానికి ఏదీ ఇవ్వమని నిన్ను వేడుకోవట్లేదు కేవలం మనశ్శాంతి మాత్రమే అడుగుతున్నా. ఆ కోపిష్టి మనిషిని తట్టుకునే ధైర్యం, కాస్త మనశ్శాంతి ప్రసాదించు అని వేడుకుంటుంది. పూజ పూర్తి చేసి ఇంట్లో దూపం వేస్తుంది భాగీ. పూజ చేయడం అంటే ఇల్లంతా పొగ నింపడం కాదని కోప్పడతాడు అమర్. మీరు అలాగే అంటారు కానీ అంటూ దగ్గరగా వెళ్తుంది భాగీ.
దాంతో ఇద్దరి కళ్లలో బూడిద పడి ఒకరినొకరు కొట్టుకుంటారు. కంట్లో నలక పడిందని అమర్ చిరాకు పడటంతో నీళ్లు తెచ్చేందుకు వంటింట్లోకి పరిగెడుతుంది భాగీ. చేతిలో సామ్రాని గిన్నెతో పరిగెడుతున్న భాగీ చేతిలోంచి గిన్నె కిందపడి హాల్లో నిప్పులు చెల్లాచెదురుగా పడతాయి. అమర్ కళ్లు నలుపుకుంటూ వచ్చి నిప్పుల మీద కాలు పెట్టబోతాడు. ఏవండీ.. ఆగండి.. అంటూ అరుస్తుంది భాగీ. అప్పుడే అరుంధతి వచ్చి తన చేత్తో అమర్ కాలిని నిప్పులపై పడకుండా ఆపుతుంది.
అమృతలో అరుంధతి
ఉలిక్కిపడిన అరుంధతి అదంతా తన కల అని గ్రహిస్తుంది. మనోహరి నిజస్వరూపం గురించి ఎలాగైనా బయటపెట్టాలని నిర్ణయించుకున్న అరుంధతి అమృత శరీరంలో ప్రవేశిస్తుంది. అమర్ నిప్పుల మీద అడుగుపెట్టబోతుంటే అమృత శరీరంలో ఉన్న ఆరు చెయ్యి అడ్డుపెట్టి ఆపుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మనోహరి దాన్ని అవకాశంగా తీసుకుని భాగీని తిడుతుంది. భాగీ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతుందని కోప్పడుతుంది.
కానీ, అమృత మనోహరిని ఆపి వెంటనే భాగీకి క్షమాపణ చెప్పమంటుంది. అమృత మనోహరికి వ్యతిరేకంగా మాట్లాడటం చూసి మిగతా పిల్లలు, అమర్ తల్లిదండ్రులు షాకవుతారు. అమర్ మరింత జాగ్రత్తగా ఉండమని భాగికి చెప్పి వెళ్లిపోతాడు. అమర్ తండ్రి మనోహరి ప్రవర్తనకు మందలించి భాగీని ఓదారుస్తాడు. అమృత అందర్నీ ఆపి, భాగీకి సారీ చెప్పమని మనోహరికి చెబుతుంది. మనోహరి వినదు. కానీ అమృత వెనక్కి తగ్గదు.
డ్రైవర్‌ను పట్టుకునేందుకు
ఆమె కోపంగా మనోహరిని క్షమాపణ చెప్పమని చెబుతుంది. షాక్ కు గురైన మనోహరి భాగీకి క్షమాపణ చెబుతుంది. కొడైకెనాల్ డ్రైవర్ భాగీని చంపడానికి సిద్ధమవుతాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులకు డ్రైవర్ కనిపిస్తాడు. వెంటనే అమర్‌కి కాల్ చేసి డ్రైవర్ని చూశామని చెబుతారు. వెంటనే ఆ డ్రైవర్ని పట్టుకోవాలని బయల్దేరతాడు అమర్.
మిస్సమ్మ కోసం మాట్లాడినందుకు పిల్లలందరూ అమృతపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అమృత చెప్పిన మాటలకు, చేసిన పనులకు భాగీ చాలా సంతోషిస్తుంది. అమర్ డ్రైవర్ని పట్టుకుంటాడా? అమృత శరీరంలోని ఆరు ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే జూన్ 03న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!