NNS May 27th Episode: సీసీటీవీలో మనోహరి- సరస్వతిని చంపాలనుకుంది ఎవరో కనిపెట్టిన అమర్- భాగీ తలలో మల్లెపూలు- ఆరుకు గడువు
Nindu Noorella Saavasam May 27th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 27వ తేది ఎపిసోడ్‌లో సరస్వతిని చంపాలని చూసింది, అరుంధతిని చంపింది ఒక్కరే అని కనుక్కుంటాడు అమర్. సీసీటీవీలో మనోహరిని చూసి షాక్ అవుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 27th May Episode) ఇంట్లో మిస్సమ్మని ఏం చేయలేక అమర్ దగ్గరకు వస్తుంది మనోహరి. తను ఉండాల్సిన స్థానంలో మిస్సమ్మను చూసి తట్టుకోలేకపోతున్నానని, ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటుంది. వెళ్లిపోయే ముందు ఒకసారి మిస్సమ్మకు విడాకులు ఇచ్చి నీ జీవితం నుంచి శాశ్వతంగా పంపించే అవకాశం ఉందా? అని అడగడానికి వచ్చాను అంటుంది మనోహరి.
నన్ను నేను క్షమించుకోలేను
మిస్సమ్మకు విడాకులు ఇవ్వడం అంత పెద్ద విషయం కాదు, ఒక కాగితం, రెండు సంతకాలు అంతే. కానీ, ఈ నిర్ణయం వల్ల మా అమ్మా నాన్న, మిస్సమ్మ వాళ్ల నాన్నకి ఏమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను అంటాడు అమర్. సరే అమర్.. మిస్సమ్మ విషయంలో నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో అంటుంది మనోహరి.
ఇప్పుడు ఆలోచించాల్సింది మిస్సమ్మ గురించి కాదు మనోహరి, అసలు నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసింది ఎవరో కనిపెట్టాలి. మరో రెండు నిమిషాల్లో అంతా తెలిసిపోతుంది అంటాడు అమర్. ఏం తెలుస్తుంది అంటూ కంగారు పడుతుంది మనోహరి. అప్పుడే రాథోడ్ వచ్చి హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. సరస్వతి మేడమ్ వెళ్లిపోయిన రెండు రోజుల ఫుటేజ్ మాత్రం లేదని అంటాడు.
నా తల్లితో సమానం
తానే డ్రైవర్‌కి చెప్పి ఫుటేజ్ డిలీట్ చేయించి మంచిపని చేశానని సంబరపడుతుంది మనోహరి. కానీ, ఆ ముందురోజు పుటేజ్ చూసిన అమర్ అందులో మనోహరి ఉండటంతో నువ్వెప్పుడు హాస్పిటల్‌కి వెళ్లావు అని అడుగుతాడు. అదేంటి అమర్.. ఆమె నా తల్లితో సమానం ఆమె హాస్పిటల్లో ఉంటే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను అని చెప్పి తప్పించుకుంటుంది మనోహరి.
హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో మనోహరి ఉండటం, ఫుటేజ్ చూస్తుంటే కంగారుపడటం అంతా భాగీకి చెబుతాడు రాథోడ్. ఆ మనోహరి అసలు స్వరూపం బయటపెట్టే సమయం వచ్చింది రాథోడ్. నేను ఆయనతో క్లోజ్‌గా ఉన్నట్లు నటిస్తాను, అసూయతో ఏదో ఒకరోజు మనోహరి స్వయంగా బయటపడుతుంది అంటుంది భాగీ. గుప్త, అరుంధతి మాట్లాడుకుంటుండగా చూసిన భాగీ అక్క.. అంటూ దగ్గరకు వస్తుంది.
మరొక్క రోజు సమయం
భాగీని చూసి ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటాడు రాథోడ్. కంగారుపడిన అరుంధతి తనకు పని ఉందంటూ అక్కడనుంచి వెళ్తుంది. భాగీ కూడా ఇంట్లోకి వెళ్తుంది. ఏంటో.. ఈ మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుందో.. ఏదో జరుగుతుంది కనుక్కోవాలి అనుకుంటాడు రాథోడ్. మిస్సమ్మ మీద రాథోడ్‌కి అనుమానం వచ్చిందని అరుంధతి కంగారుపడుతుంది. అందుకే మనం ముందే మా లోకానికి వెళ్దామని చెప్పాను అంటాడు గుప్త. తనకి మరొక్కరోజు సమయం కావాలంటుంది అరుంధతి.
ఈ రాత్రి వరకు మాత్రమే నీకు ఇస్తాను అంటాడు గుప్త. ఇక నుంచి ఎవ్వరూ మిస్సమ్మ మాట వినక్కర్లేదు, ఏ టైమ్‌టేబుల్ ఫాలో అవక్కర్లేదు అంటుంది అంజు. కోపంగా అరుంధతి ఫోటో తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది. ఎవరెవరో ఇంట్లో ఉంటున్నారు. అమ్మ ఇంట్లో ఉండొద్దా.. ఈరోజు నుంచి అమ్మ బయటే ఉంటుంది. ఎవరొచ్చి ఆపుతారో చూస్తానంటుంది. అప్పుడే అటుగా వచ్చిన మిస్సమ్మ పిల్లల్ని చూసి ఏంటి స్టడీ అవర్ పది నిమిషాలముందే అయిపోయినట్లుంది అంటుంది.
నాకే పని తగ్గించారు
అసలు రేపట్నుంచి మొదలవదు. నీ సలహాలు, సాయం మాకేం అవసరం లేదు. మాకు దూరంగా ఉండు చాలు అంటుంది అంజు. థ్యాంక్స్ నాకు పని తగ్గించినందుకు అంటూ అక్కడనుంచి వెళ్లబోయిన భాగీ టేబుల్ మీద ఫొటో చూసేందుకు ఆగుతుంది. కానీ, పిల్లలందరూ అడ్డుగా నిలబడి అరుంధతి ఫొటో కనపడకుండా దాచేస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు మల్లెపూలు తెస్తాడు అమర్. అది చూసి షాకవుతుంది అరుంధతి.
ఏమవుతోంది గుప్తాగారు. మా ఆయన మల్లెపూలు తేవడం ఏంటి అని కంగారు పడుతుంది. మల్లెపూలతో ఇంట్లోకి వచ్చిన అమర్‌ని చూసి వచ్చేశారా అంటూ గెంతులేస్తుంది మిస్సమ్మ. మనోహరి, నీల కూడా అమర్ చేతిలో ఉన్న పూలను చూసి షాకవుతారు. కానీ, ఆ పూలను దేవుడికోసం తెచ్చానని తల్లి నిర్మలకి ఇవ్వబోతాడు అమర్. దేవుడికోసం అని నేను చెప్పానా? ఇంట్లో భార్య ఉండగా వట్టి చేతులతో ఇంటికి వస్తారా? అమ్మాయి తలలో పూలు పెట్టు అని చెప్పి లోపలకి వెళ్తుంది నిర్మల.
భాగీ తలలో పూలు
భాగీలో అరుంధతిని చూసిన అమర్ ఆ పూలను తలలో పెడతాడు. అది చూసి షాకవుతుంది మనోహరి. అరుంధతి కూడా తట్టుకోలేకపోతుంది. భాగీలో అరుంధతిని చూసిన అమర్ ఆమెకు దగ్గరవుతాడా? మనోహరి నిజ స్వరూపం బయటపెట్టేందుకు భాగీ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే మే 28న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!