Krishna mukunda murari: ఊహించని నిర్ణయం తీసుకున్న కృష్ణ.. ముకుంద ప్రెగ్నెంట్ అనే విషయం అమృత బయటపెడుతుందా?-krishna mukunda murari serial today may 11th episode murari is worried as krishna resolves to marry off adarsh and mukun ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari: ఊహించని నిర్ణయం తీసుకున్న కృష్ణ.. ముకుంద ప్రెగ్నెంట్ అనే విషయం అమృత బయటపెడుతుందా?

Krishna mukunda murari: ఊహించని నిర్ణయం తీసుకున్న కృష్ణ.. ముకుంద ప్రెగ్నెంట్ అనే విషయం అమృత బయటపెడుతుందా?

Gunti Soundarya HT Telugu
May 11, 2024 08:13 AM IST

Krishna mukunda murari serial today may 11th episode: కృష్ణ ముకుంద మురారి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఆదర్శ్, మీరాకు పెళ్లి చేయాలని కృష్ణ మురారితో చెప్తుంది. అలాంటివి ఏం పెట్టుకోవద్దని మురారి చెప్తాడు. కానీ చివరికి తప్పక సరే అంటాడు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 11వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 11వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial today may 11th episode: కృష్ణ మీరా గురించి ఆలోచిస్తుంది. మురారి వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. నేనంటే మీకు ఇష్టమేమైన తగ్గిందా? అని అడుగుతుంది. మురారి కృష్ణని ప్రేమగా పట్టుకుని నీమీద రోజురోజుకీ ప్రేమ పెరగడం తప్ప తగ్గడం అనే ఛాన్స్ ఉంటుందా అంటాడు.

నేను గొడ్రాలిని

నేను పిల్లలని కనలేని గొడ్రాలిని కదా అందుకని నా మీద మీకు ప్రేమ తగ్గిందా అని అంటే పిచ్చిగా మాట్లాడితే దెబ్బలు పడతాయని అంటాడు. అయినా నువ్వు గొడ్రాలివి ఏంటి సరోగసి ద్వారా పుట్టేది నీ బిడ్డే కదా. పిల్లలు ప్రేమకు గుర్తులు కావాలి కానీ కారణం కారని చెప్తాడు.

మన బిడ్డ ఒకరి గర్భంలో పెరుగుతుంది అది స్థిరంగా ఉండి మన చేతికి రావాలని అంటాడు. మన ఇంట్లో శుభ కార్యం జరగాలని అంటాడు. దాంతో పాటు మరొక శుభకార్యం కూడా జరగాలి. ఆదర్శ్ మీరాని ఇష్టపడుతున్నాడు కదా వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే పెద్దత్తయ్యకు సగం భారం తగ్గుతుందని అంటుంది.

ఆదర్శ్, ముకుంద పెళ్లి

వాళ్లిద్దరికీ పెళ్లి ఏంటి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని మురారి అంటాడు. అదేంటి అప్పుడు చేద్దామని ఇప్పుడు వద్దని అంటున్నారని కృష్ణ అడుగుతుంది. తన బుద్ధి బాగోలేదని నువ్వే అన్నావ్ కదా అంటాడు. ఆదర్శ్ తో పెళ్లి అయితే తన బుద్ధి సెట్ అవుతుందేమో అదే కరెక్ట్ అంటుంది.

ఇప్పుడు సరోగసి మథర్ గురించి చెప్తే అది క్యాన్సిల్ చేయించి వాళ్ళ పెళ్లి జరిపిస్తుందని మురారి అనుకుంటాడు. ముకుంద అందంగా రెడీ అవడం చూసి ఆదర్శ్ ఫ్లాట్ అయిపోతాడు. చాలా అందంగా ఉన్నావని పొగుడుతాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి పెంపుడు కుక్కలాగా వెంట పడుతున్నాడని ముకుంద తిట్టుకుంటుంది.

సర్ ప్రైజ్ ఇస్తానన్న ఆదర్శ్

మీ ఓనర్ చనిపోయాడని అన్నావ్ కదా మరి బాగా రెడీ అయిపోయావ్ అనేస్తాడు. ముకుంద ఇక సీన్ మొదలుపెట్టేస్తుంది. ఊరు వెళ్తున్నాను రెండు రోజుల వరకు రానని చెప్తాడు. తిరిగి వచ్చాక సర్ ప్రైజ్ ఇస్తానని అంటాడు. మీరు ఇవ్వడం కాదు నేనే మీకు సర్ ప్రైజ్ ఇస్తాను. ఈ జన్మలో నా జోలికి రారని ముకుంద అనుకుంటుంది.

పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. మురారి, కృష్ణని చూసి చూడముచ్చని జంట అని పంతులు మెచ్చుకుంటాడు. అమృత కృష్ణని మెచ్చుకుంటుంది. పీటల మీద కృష్ణ, మురారి కూర్చుంటారు. మీరా నువ్వు కూడా కూర్చో అంటాడు. నువ్వు లేకపోతే పూజ లేదు ఈ పూజ జరగడానికి కారణం నువ్వే అంటాడు.

అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు. అమృత అనుమానంగా చూస్తుంది. ఈ పూజ చేస్తుంది నీ బిడ్డ కోసం కదా మురారి మరి తన కోసం చేస్తున్నట్టు మాట్లాడతావ్ ఏంటని రజిని అడిగేస్తుంది. నేను నా బిడ్డ కోసమే చేస్తున్నాను నేను ఉన్నాను అంటే అది మీరా వల్లే కదా.

మురారి వచ్చేస్తాడు

తను ఇప్పుడు ఈ ఇంటి మనిషి కదా అందుకే కూర్చోమని చెప్తున్నా అంటాడు. దీంతో మీరా కృష్ణ పక్కన కూర్చుంటుంది. మురారి పూజ చేస్తూ మీరా వైపు చూస్తూ ఉంటాడు. పూజలో ప్రతిదీ మీరాకి ఇస్తుంటే కృష్ణ ఏంటని కోపంగా చూస్తుంది.

బిడ్డ కోసం చేయాల్సిన పూజ నేను చేయాలి. ప్రస్తుతం బిడ్డ వచ్చింది త్వరలోనే మురారి కూడా వచ్చేస్తాడని ముకుంద అనుకుంటుంది. పూజలో భాగంగా తమలపాకుని ఎడమ చేత్తో తీసుకుని మురారి తల చుట్టూ తిప్పమని కృష్ణకి చెప్తాడు. మీ బిడ్డకు మీ శ్రీవారి రూపం, తెలివితేటలు వచ్చేందుకు అలా చేయమని పంతులు చెప్తాడు.

డ్రామా మొదలుపెట్టిన ముకుంద

బిడ్డ నీ కడుపులో ఉంటే క్రతువు కృష్ణ చేస్తుంది. దేవుడా మీరా కడుపులో ఉన్న మా బిడ్డకి ఈ పుణ్యం దక్కేలా చూడమని మురారి వేడుకుంటాడు. అందరూ కృష్ణ, మురారిని ఆశీర్వదించే టైమ్ కి ముకుంద కావాలని కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారుపడిపోతారు.

కృష్ణ తనని చెక్ చేస్తుంది. మీరా ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి షాక్ అవుతుంది. ముకుంద తల్లి కాబోతున్న విషయం కనిపెట్టేసింది. వేరే వాళ్ళ వల్ల తల్లి అయ్యిందని కృష్ణ చెప్పేస్తుందేమో అప్పుడు ముకుంద నింద మోయలేక నిజం చెప్పేయాల్సి వస్తుందని మురారి టెన్షన్ పడతాడు.

ముకుంద ప్రెగ్నెంట్

భవానీ కంగారుగా ప్రమాదం ఏం లేదు కదా అంటుంది. ఏం లేదు నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని అబద్ధం చెప్తుంది. ఏ తల్లి కన్నబిడ్డ మా ఇంటికి వచ్చి చేరింది. అందుకే సొంత మనిషిలా చూసుకుంటున్నాం అమృత ఒకసారి నువ్వు కూడా చెక్ చేయమని చెప్తుంది.

అమృత ముకుందని టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్ అని అర్థం అవుతుంది. అమృత ఆంటీ చెప్పేస్తుందేమోనని కంగారుపడతాడు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point