Krishna mukunda murari today episode: మురారిని బోల్తా కొట్టించిన మీరా.. కృష్ణ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న భవానీ-krishna mukunda murari serial today may 3rd episode mukunda misleads murari as he grows wary of her surrogate mother ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Today Episode: మురారిని బోల్తా కొట్టించిన మీరా.. కృష్ణ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న భవానీ

Krishna mukunda murari today episode: మురారిని బోల్తా కొట్టించిన మీరా.. కృష్ణ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న భవానీ

Gunti Soundarya HT Telugu
May 03, 2024 07:48 AM IST

Krishna mukunda murari serial today may 3rd episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. సరోగసి మథర్ ఇంటికి రావడం వెనుక మీరా ఉందని మురారి అనుమానిస్తాడు. దీని గురించి డైరెక్ట్ గా అడిగేస్తాడు. కానీ మీరా మురారికి అబద్ధాలు చెప్పి తనని బోల్తా కొట్టిస్తుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 3వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 3వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial today may 3rd episode: మురారి మీరాని అనుమానిస్తాడు. దాని గురించి మాట్లాడటం కోసం మీరాని కలుస్తాడు. ఆవిడ ఎవరో వచ్చి సరోగసి గురించి మాట్లాడి డిస్ట్రబ్ చేసిందని అంటాడు. అనుకున్నవన్నీ జరుగుతాయా? మీరు కృష్ణ బిడ్డని కని ఇస్తానని అన్నారు కానీ అది జరిగిందా లేదు కదా. అన్ని మన చేతుల్లో ఉండవని మీరా అంటుంది.

మురారి మాటలకు టెన్షన్ పడిన మీరా

వచ్చిన ఆవిడ అడ్రస్ తప్పిపోయి ఇక్కడికి రాలేదు. కావాలని ఎవరో ఆవిడని పంపించినట్టు ఇక్కడికి వచ్చిందని మురారి అనగానే మీరా షాక్ అవుతుంది. ఆమె చేతిలో ఒరిజనల్ అడ్రస్ కి వెళ్లబోయి ఇక్కడికి వచ్చింది అది నేనే చూసి పంపించాను కదా అంటుంది.

అడ్రస్ నువ్వే చూశావ్ కదా ఆ అడ్రస్ నీకు గుర్తుందా అని మురారి అడుగుతాడు. ఏమో సరిగా గుర్తు లేదని కవర్ చేస్తుంది. గుర్తుంటే బాగుండేది ఇప్పుడే అక్కడికి వెళ్ళి సరోగసి మథర్ గురించి అడిగే వాళ్ళం. ఆ అమ్మాయి అడ్రస్ ని పట్టుకుని ఫంక్షన్ చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చిందో లేదో తెలిసిపోయేదని అనేసరికి మీరా టెన్షన్ పడుతుంది.

ఇదంతా అనుకోకుండా జరిగిందని కవర్ చేసేందుకు చూస్తుంది. సరోగసి ప్రాసెస్ చాలా సీక్రెట్ గా చేస్తారు. అలాంటిది ఆ అమ్మాయి నేనే సరోగసి మథర్ ని అని పబ్లిక్ గా అడిగిందంటే కావాలని మమ్మల్ని టెన్షన్ పెట్టడానికి చేసింది కాక మరేంటి?

నువ్వే చెప్పావ్ కదా

అసలు ఈ విషయం నీకు, నాకు, కృష్ణకి తప్ప ఎవరికీ తెలియదు. నేను ఎలాంటి మొహమాటం లేకుండా అడుగుతున్నా. నువ్వే చెప్పావ్ కదా. ఇంకెవరికీ ఈ విషయం తెలియదు. ఇంకెవరికీ ఆ అవసరం కూడా లేదని అంటాడు. నేను మీకు టెన్షన్ పెట్టించాలని సంతోషం దూరం చేయాలని అనుకుంటున్నానా? అని మీరా అంటుంది.

నిజం ఎక్కడ తెలుస్తుందోనని నేను, కృష్ణ చాలా భయపడుతూ జాగ్రత్త పడుతున్నాం. మిగిలింది నువ్వే అంటాడు. మీరా ఏడుస్తూ చాలు ఆపండి సరోగసికి వెళ్ళమని సలహా ఇచ్చింది నేనే కదా. ఇంట్లో స్థానం ఇచ్చారని మీ బాధని పంచుకోవాలని అనుకోవడం తప్పు అయిపోయింది.

డ్రామా క్వీన్

ఫంక్షన్ మధ్యలో సరోగసి అని ఆవిడ వస్తే మీకులాగే టెన్షన్ పడ్డాను. ఎవరినో పంపించి చెప్పించాల్సిన అవసరం నాకు ఏంటి? దీని వల్ల నాకు ఏం వస్తుందని ఏడుస్తుంది. మురారి తనకి సారి చెప్తాడు. సరోగసి సీక్రెట్ గా ఉంచుతారని ఎవరు చెప్పారు. కొంతమంది ఆమెని ఇంటికి తీసుకొచ్చి బిడ్డ పుట్టే వరకు ఇంట్లో పెట్టుకుని చూసుకుంటారు.

ఈరోజు వచ్చిన ఆవిడని కూడా ఎవరో నమ్మకంగా పిలిపించుకుని ఉంటారు. నాకు విషయం తెలుసని నన్ను విలన్ ని చేస్తారా?అంటుంది. కృష్ణ చాలా టెన్షన్ పడింది ఎవరు చేసి ఉంటారా అని ఆలోచించి నువ్వే చేశావ్ అన్నాను సారి అనేసి వెళ్ళిపోతాడు.

పెద్దత్తయ్యకు నచ్చకపోతే

కృష్ణ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మురారి వస్తాడు. ఇంకా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావా తన గురించి మర్చిపో. జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండమని చెప్తాడు. మీ ముందు కూడా ఏం జరగనట్టు నటించమని అంటారా అని కృష్ణ బాధగా అడుగుతుంది.

నేను పిల్లలని కనలేకపోయినా వేరే దారి చూపించాడు. కానీ జరుగుతున్న ఒక్కో సంఘటనకు కాళ్ళు వణికిపోతున్నాయి. ఇందాక పెద్దత్తయ్య ఒక మాట అన్నారు. ఎవరైనా తొమ్మిది నెలలు మోసి బిడ్డను కంటారు కానీ ఇలా సరోగసి ద్వారా బిడ్డని కంటారా? అన్నారు.

మనం డాక్టర్ తో మాట్లాడాము. అంతా చేశాక పెద్దత్తయ్యకు నచ్చకపోతే ఏంటి పరిస్థితని అంటుంది. అలా ఏం జరగదు జరిగింది తెలిస్తే ఆవిడ ఒప్పుకుంటుందని మురారి సర్ది చెప్తాడు. ఏం జరగనట్టు ఉండటం తన వల్ల కావడం లేదని ఏడుస్తుంది.

కృష్ణ మీద అమితమైన ప్రేమ

మురారి కృష్ణ బాధని తొలగించేలాగా మాట్లాడతాడు. నీకు భర్తని అయినందుకు నేను చాలా అదృష్టవంతుడినని అంటాడు. కృష్ణ హడావుడిగా నడుస్తుంటే భవానీ తనని ఆపి ఏంటి నువ్వు చేస్తున్న పని అంటుంది. ముగ్గు వేయడానికి వెళ్తున్నానని చెప్తుంది.

ఇంట్లో ఏ పని చేయవద్దని చెప్పాను కదా. డెలివరీ అయ్యే వరకు కృష్ణ ఏ పని చేయడానికి వీల్లేదు. డెలివరీ అయ్యే రోజు కూడా పనులు చేసేవాళ్ళు ఉన్నారని కృష్ణ అంటుంది. కృష్ణ చెప్పిన దానికి భవానీ అసలు ఒప్పుకోదు. ఎన్ని చెప్పినా నేను వినను పని చేస్తూ ఏదైనా దెబ్బ తగిలితే కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని ప్రశాంతంగా ఉండలేనని భవానీ అంటుంది.

షటప్ ముకుంద

కృష్ణ మెట్లు ఎక్కి దిగడం మంచిది కాదని వాళ్ళని రూమ్ మారమని చెప్తుంది. ఈ ఇంటికి వారసులు రావలన్నది నా కల. క్షేమంగా నా చేతికి వచ్చే వరకు నా జాగ్రత్తలో నేను ఉంటాను. కృష్ణ మెట్లు ఎక్కి దిగడం కాదు పరిగెత్తినా గెంతినా కూడా తనకి ఏం కాదు. కాబట్టి కృష్ణ ఏం చేయాలని అనుకుంటే అది చేయనివ్వండి అని ముకుంద అంటుంది.

భవానీ కోపంగా షటప్ ముకుంద. నీకసలు ఏం తెలుసని చెప్తున్నావ్. పెళ్లి అయ్యిందా పిల్లల్ని కన్నావా? అసలే ఇది తింగరిది. ఎవరూ ఏం మాట్లాడకుండా నేను చెప్పింద చేయండని అంటుంది. ముగ్గు ముకుందని వేయమని చెప్తుంది. ముకుందని అనేసరికి ఆదర్శ్ కోపంతో రగిలిపోతాడు.

మీరాకి పొగరు

కృష్ణ చాలా మంచిదని సంగీత అంటే ఇంకోసారి తన భజన చేస్తే మొహం పగలగొడతానని రజిని అంటుంది. కడుపుతో ఉందని కృష్ణని నెత్తిన పెట్టుకుంటున్నారని తనకి చాలా పొగరని వంకరగా మాట్లాడుతుంది. మంచి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయి.

కృష్ణ అక్కకి కాదు పొగరు ముకుంద స్నేహితురాలని వచ్చిందే మీరా దానికి ఒళ్ళంతా పొగరని సంగీత అంటుంది. దాన్ని ఎందుకు అంటావ్ అది ఆదర్శ్ కి నీకు పెళ్లి చేస్తానని అంటుందని చెప్తుంది. దాని వాలకం చూశావా? బావతో నాకు అది పెళ్లి చేయడం కాదు. అది బావని పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలు. దాని మీద నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకని చెప్తుంది.

ఎందుకైనా మంచిది ముకుంద మీద ఒక కన్నేసి ఉంచాలని రజిని అనుకుంటుంది. కడుపుతో లేకపోయినా కృష్ణని కాలు కింద పెట్టనివ్వడం లేదు. నిజంగా బిడ్డని మోయాల్సిన నేను పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇలాగే వదిలేస్తే కృష్ణకి తనని పని మనిషిని చేస్తారని ముకుంద టెన్షన్ పడుతుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

తరువాయి భాగంలో..

వైదేహి కృష్ణకి ఫోన్ చేసి సరోగసి మథర్ ఉందని చెప్తుంది. ఆమెతో మాట్లాడాను ఒప్పుకుందని చెప్తుంది. కృష్ణ ఆ న్యూస్ విని చాలా సంతోషిస్తుంది. కృష్ణ భవానీతో హాస్పిటల్ కి వెళ్తానని అంటే తను కూడా వస్తానని అంటుంది. మీకెందుకు శ్రమ అని తనని ఆపేందుకు కృష్ణ ట్రై చేస్తుంది.

IPL_Entry_Point