Krishna mukunda murari april 11th: ఆదర్శ్, సంగీత పెళ్లి చేద్దామన్న రజిని.. ముకుంద పేరు పలికేందుకు ఇష్టపడని కృష్ణ-krishna mukunda murari serial april 11th episode rajini discusses adarsh wedding to sangeetha with bhavani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari April 11th: ఆదర్శ్, సంగీత పెళ్లి చేద్దామన్న రజిని.. ముకుంద పేరు పలికేందుకు ఇష్టపడని కృష్ణ

Krishna mukunda murari april 11th: ఆదర్శ్, సంగీత పెళ్లి చేద్దామన్న రజిని.. ముకుంద పేరు పలికేందుకు ఇష్టపడని కృష్ణ

Gunti Soundarya HT Telugu
Apr 11, 2024 07:58 AM IST

Krishna mukunda murari serial april 11th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఆదర్శ్, సంగీత పెళ్లి చేద్దామని రజిని భవానీని అడుగుతుంది. తన మాటలకు ముకుంద కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక మీరాను ముకుంద అని పిలవనని కృష్ణ చెప్పేస్తుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial april 11th episode: మీరా ప్రవర్తన బాగోలేదని కృష్ణ అంటుంది. హోలీ రంగు పట్టుకుని మీ వెంట పడుతుంది, మీకెలా పూస్తుందని కృష్ణ అడుగుతుంది. హోలీ అన్నాక రంగులు పూస్తారు అందులో ఏముందని మురారి అంటాడు. రంగులు పూయడం వేరు రాసుకుని పూసుకుని తిరగడం వేరని కృష్ణ చెప్తుంది.

కృష్ణకు నచ్చజెప్పిన మురారి

మీరాకు ముకుంద పేరు పెట్టగానే తన బుద్దులు వచ్చేసి నా వెంట పడుతుందని అనుకుంటున్నావా అని మురారి అంటాడు. అలా కాదు అసలు మీరా మనసులో ఏముందా అంటుంది. ఆదేమో తెలియదు కానీ నీలో బాగా జలస్ ఉందని ఆట పట్టిస్తాడు. ముకుంద విషయంలో జరిగినట్టు మీరా విషయంలో అలా జరగదని మురారి సర్ది చెప్తాడు.

ఏమో ఆదర్శ్ మీతో మాట్లాడక అంతగా మంచిగా ఉందని అనిపించినా ఏదో తెలియని భయం వెంటాడుతుందని అంటుంది. ఆదర్శ్ మాట్లాడటం లేదని నీ భయమని మురారి అంటాడు. మీతో మాట్లాడి నాతో ఎందుకు మాట్లాడటం లేదు. ఉంటే ఇద్దరి మీద కోపం ఉండాలి లేదంటే ఇద్దరి మీద కోపం పోవాలి. ఇలా ఏంటని కృష్ణ కోపంగా అంటుంది. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాడులే అంటాడు.

ముకుందని తిట్టిన రజిని

కృష్ణ కోపం తగ్గకపోయే సరికి మురారి తనకు ముద్దు పెడతాడు. వెంటనే సిగ్గుపడిపోతుంది. ముకుంద మురారితో హోలీ ఆడిన విషయం గుర్తు చేసుకుని మురిసిపోతుంది. రజిని వచ్చి ఊహల్లో బాగా విహరిస్తున్నట్టు ఉన్నావ్ గా అంటుంది. నా కూతురితో ఆదర్శ్ పెళ్లి చేస్తానని చెప్పి నువ్వు తనతో రాసుకుపూసుకు తిరుగుతున్నావని గట్టిగా అడుగుతుంది.

తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ముకుంద సర్ది చెప్తుంది. నీ మీద ఆదర్శ్ కి ఏదో ఉందని అనిపిస్తుందని రజిని సీరియస్ గా అంటుంది. మీ అనుమానం కూడా కరెక్ట్ ఇలా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది ఇప్పుడే ఒక పని చేద్దాం. భవానీ మేడమ్ దగ్గరకు వెళ్ళి ఆదర్శ్ కి సంగీతనిచ్చి పెళ్లి చేయమని అడుగుదామని ఐడియా ఇస్తుంది.

ఆదర్శ్ కి సంగీతతో పెళ్లి

రజిని ఇప్పుడు వద్దు వదిన ఏమైనా అంటుందేమోనని భయపడుతుంది. ముందు ప్రస్తావన తీసుకురండి తర్వాత నేను అందుకుంటానని రెచ్చగొడుతుంది. ముందు ఆదర్శ్ ఒప్పుకుంటే వదిన ఒప్పుకుంటుందని రజిని చెప్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఏం చేసినా ఆదర్శ్ పెళ్ళికి ఒప్పుకోడు కానీ భవానీ మేడమ్ ఒప్పిస్తే ఒప్పుకుంటాడు. అందుకే ముందు ఆమెని ఒప్పించాలని అంటుంది.

భవానీ వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. రజినీ పెళ్లి గురించి మాట్లాడుతుంది. అంతా బాగుంది కదా ఇప్పుడు ముకుంద చనిపోయింది ఇప్పుడు నా కూతురితో నీ కొడుక్కి పెళ్లి చేయమని రజిని అడుగుతుంది. ఒప్పుకోండి అత్తయ్య నా పేరు ముకుంద అని మార్చిన దగ్గర నుంచి ఆదర్శ్ దృష్టి నామీద ఉంది. ఈ పెళ్లి జరిగిపోతే ఆదర్శ్ నా వెంట పడటం మానేస్తాడు. అప్పుడు నేను మురారి మీద ఫోకస్ పెడతానని ముకుంద మనసులో అనుకుంటుంది.

ఆలోచిస్తానన్న భవానీ

రజిని మాటలకు ముకుంద వత్తాసు పలుకుంటుంది. సంగీతకు ఆదర్శ్ అంటే చాలా ఇష్టం నేను గమనించానని అనేసరికి భవానీ సీరియస్ గా చూస్తుంది. ఆదర్శ్ ముకుందని మర్చిపోవాలంటే తన జీవితంలోకి ఎవరో ఒకరు రావాలి. అది కూడా తనని బాగా ఇష్టపడే వాళ్ళు వస్తే బాగుంటుందని నసుగుతుంది.

భవానీ మాత్రం ముకుంద వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఆదర్శ్ సంతోషంగా ఉంటారని చెప్పాను తప్పయితే క్షమించమని అడుగుతుంది. తప్పేమీ లేదు ఈ ఇంటి గురించే మాట్లాడావని రేవతి అంటుంది. అనుకున్న వెంటనే అయిపోవాలంటే కుదరదు కాస్త ఓపిక పట్టాలి. నాకు చెప్పావ్ కదా నేను ఆలోచిస్తాను. ఆదర్శ్ కి మంచి జరుగుతుందని అంటే తప్పకుండా చేస్తానని భవానీ అంటుంది.

మురారి మీద కృష్ణ కోపం

రజిని, ముకుంద సంతోషిస్తారు. ఆదర్శ్ సంతోషంగా మురారి రాలేదా అని ఆడగడంతో అందరూ ఎమోషనల్ గా చూస్తారు. ఇప్పుడు బాగుంది నువ్వు మురారి గురించి అడగటం చాలా బాగుందని భవానీ అంటుంది. అప్పుడే మురారి వాళ్ళు వస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర మురారి వెళ్ళి ఆదర్శ్ పక్కన కూర్చుంటాడు.

ఆదర్శ్ మాత్రం కృష్ణ వైపు కోపంగా చూస్తాడు. మధు ఫోన్లో హోలీ ఫోటోస్ చాలా బాగా వచ్చాయని చెప్పి అందరికీ చూపిస్తాడు. ఆ ముకుంద ఉన్న కూడా ఆదర్శ్ ఇంతగా రంగులు పూసేవాడు కాదేమో. నువ్వు బాగా కలిసిపోయావ్ ముకుంద అని మధు అంటాడు. తర్వాత ముకుంద మురారికి రంగులు పూసే ఫోటో చూపిస్తాడు.

అది చూసి కృష్ణ మురారి వైపు మింగేసెలా చూస్తుంది. ఈ ఫోటోస్ ఇలాగే చూస్తే ఆదర్శ్ డిస్ట్రబ్ అయ్యేలా ఉన్నాడని చెప్పి ముకుంద టాపిక్ డైవర్ట్ చేస్తుంది. హోలీ అనేది రంగుల పండుగ అన్నీ ఫోటోస్ బాగానే వచ్చి ఉంటాయని ముకుంద అంటుంది. మురారి కూడా తన మాటలకు సపోర్ట్ చేస్తూ కృష్ణకు ఇన్ డైరెక్ట్ గా చెప్తాడు.

మీరా అనే పిలుస్తా

నువ్వు చాలా తెలివైన దానివి ముకుంద. ఎవరిని ఎలా కలుపుకోవాలో, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నీకు బాగా తెలుసు. నా కోడలు ముకుందలాగా కాదు నువ్వు వేరు అంటుంది. రెండూ నేనే అత్త రూపం మారింది అంతే నిజం తెలిసిన రోజు ఏమైపోతారోనని ముకుంద మనసులో అనుకుంటుంది. మంచి ఉద్యోగం చూస్తానని భవానీ చెప్తుంది.

ఉద్యోగం ఇస్తానని చెప్పి మంచి పని చేశారు అత్తయ్య తనకు ఇంట్లో బోర్ కొడుతుంది కదా. అంతే కదా మీరా అని కృష్ణ అనగానే అందరూ ఒక్కసారిగా తనవైపు చూస్తారు. అదేంటి మీరా అని పిలుస్తున్నావ్ తన పేరు ముకుంద అని మార్చారు కదా మర్చిపోయావాఅని మధు అంటాడు.

అదేం లేదు కావాలని పిలిచానని చెప్తుంది. నాకు ఒరిజినాలిటీ అంటే ఇష్టం మీరా లాంటి చక్కని పేరు ఉంచుకుని దాన్ని మార్చుకోవడం ఏంటి? ఎవరి పేరు వాళ్ళకు ఉండగా పేరు మారిస్తే బాధగా ఉంటుందని కృష్ణ అంటుంది. అన్నింటికీ ఊ కొడుతుందని చెప్పి మన ఇష్టాన్ని తన మీద బలవంతంగా రుద్దకూడదని కృష్ణ చెప్తుంది.

మీరాకి గిఫ్ట్ ఇచ్చిన కృష్ణ

ఇక్కడ ఎవరు బలవంతం చేయలేదు తనకు ఇష్టం ఉందా లేదా అని అడిగే పేరు మార్చాం అమ్మ కూడా ఒప్పుకుంది. ఇక తనకు ఏంటి ప్రాబ్లం మురారి అని కృష్ణ వైపు కోపంగా చూస్తూ అంటాడు. పేరు మార్చినంత మాత్రాన బుద్ధులు మారవని భవానీ అంటుంది. కానీ నేను మాత్రం మీరా అనే పిలుస్తానని కృష్ణ చెప్తుంది.

నీకోక గిఫ్ట్ తెచ్చానని చెప్పి కృష్ణ మీరాకు ఫోన్ బహుమతిగా ఇస్తుంది. ముకుంద థాంక్స్ చెప్తుంది. నా పేరు పలకడానికి కూడా నీకు ఇష్టం లేదంటే నా మీద కోపం పోలేదని అర్థం అవుతుందని ముకుంద మనసులో అనుకుంటుంది.

Whats_app_banner