Krishna mukunda murari april 8th: మురారిని వెళ్ళకుండా ఆపిన ఆదర్శ్.. ప్రియుడికి రంగులు పూసి మురిసిపోయిన ముకుంద-krishna mukunda murari serial april 8th episode adarsh stopped murari from leaving the house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari April 8th: మురారిని వెళ్ళకుండా ఆపిన ఆదర్శ్.. ప్రియుడికి రంగులు పూసి మురిసిపోయిన ముకుంద

Krishna mukunda murari april 8th: మురారిని వెళ్ళకుండా ఆపిన ఆదర్శ్.. ప్రియుడికి రంగులు పూసి మురిసిపోయిన ముకుంద

Gunti Soundarya HT Telugu
Apr 08, 2024 08:02 AM IST

Krishna mukunda murari serial april 8th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఇంట్లో నుంచి మురారి వెళ్లిపోతుంటే ఆదర్శ్ వాళ్ళని ఆపేస్తాడు. ఎలాగైనా ఆదర్శ్ ని గుప్పిట్లో పెట్టుకోవాలని ముకుంద డిసైడ్ అవుతుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial april 8th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..మురారి వాళ్ళు బ్యాగ్ పట్టుకుని రావడం చూసి ఎక్కడికి వెళ్తున్నారని రేవతి అడుగుతుంది. అక్కడే ఆదర్శ్ కూడా ఉంటాడు. మాట్లాడకుండా ఉంటారెంటని మళ్ళీ అడుగుతుంది. కృష్ణ మౌనంగా ఉంటుంది. ఇంట్లో అందరూ బయటకి వచ్చి చూస్తారు. మురారి బ్యాగ్ పట్టుకుని ఉండటం చూసి ముకుంద షాక్ అవుతుంది.

ఇంటికి వెళ్తున్నామని మురారి చెప్తాడు. ఏ ఇంటికని రేవతి అంటే మా ఇంటికని అంటాడు. మురారి కోసం ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే వెళ్లిపోతానని అంటాడు ఏంటని ముకుంద అనుకుంటుంది. క్షమించండి అత్తయ్య మేము ఇక్కడ ఉండటం కొంతమందికి నచ్చడం లేదు ఇక్కడే ఉండి వాళ్ళని బాధపెట్టడం ఎందుకని వేరే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కృష్ణ చెప్తుంది.

కృష్ణ అడ్డు తొలగిపోతుంది

ఇక్కడ ఉన్న వాళ్ళైన సంతోషంగా ఉంటారు అది చాలు మీకు అర్థం అయ్యింది కదా ఆత్తయ్య అంటుంది. ఎవరు ఏమన్నారని వెళ్లిపోతున్నావని రజిని అడుగుతుంది. ఇప్పుడు మురారిని ఎలా ఆపాలని ముకుంద టెన్షన్ పడుతుంది. కోపాలు సర్దుకుంటాయని నువ్వే అన్నావ్ కదాని మధు బాధగా అంటాడు. రజిని మాత్రం వెళ్లిపోవడమే మంచిదని అంటుంది.

కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతే సగం అడ్డు తొలగిపోతుందని రజిని మనసులో అనుకుంటుంది. నీకు వాడి మనసు బాధ ఏంటో తెలుసు. వాడు ఏ పరిస్థితిలో అలా మాట్లాడుతున్నాడో తెలుసు కదాని రేవతి అంటుంది. అర్థం చేసుకోవడం లేదని వెళ్లిపోవాలని అనుకుంటున్నట్టు మురారి చెప్తాడు. వాడు నా వల్ల బాధపడుతున్నాడని అంటాడు.

మేం కళ్ళెదురుగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు, కసురుకుంటున్నాడు అది కూడా బాధ కదా అందుకే దూరంగా ఉండాలని అనుకుంటున్నామని కృష్ణ చెప్తుంది. మీరు వెళ్తే ఇక్కడ ఎవరు సంతోషంగా ఉండరని మధు అంటాడు. అమ్మ నువ్వు కూడా మాతో వచ్చేస్తే మంచిది. నీ కొడుకు ఉండటం ఇష్టం లేని వాడికి నువ్వు ఉంటే ఇష్టంగా ఉంటుందా అని అడుగుతాడు. మురారి బాధలో మాట్లాడుతున్నాడు వద్దని చెప్పమని మధు బతిమలాడతాడు.

కొడుకు వెంటే బయల్దేరిన రేవతి

ఆదర్శ్ మౌనంగా ఉండేసరికి నిన్ను తీసుకుపోతానని అంటే వాడు మాట్లాడం లేదు అంటే నువ్వు ఉండటం కూడా ఇష్టం లేదని మురారి అంటాడు. వద్దని చెప్పమని సుమలత అడుగుతుంది. ఆదర్శ్ బాధకి మేమే కారణమని గట్టిగా నమ్మకంతో ఉన్నాడు మనం దూరమయి తన బాధని దూరం చేద్దామని రమ్మని తమతో పాటు రమ్మని రేవతిని కృష్ణ కూడా అడుగుతుంది.

ఎలాగైనా మురారి వాళ్ళని ఆపాలని ముకుంద భవానీ కోసం చూస్తుంది. సుమలత వెళ్లనివ్వకుండా ఆపడం కోసం ఆదర్శ్ ని బతిమలాడుతుంది. కానీ ఆదర్శ్ మాత్రం బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోతాడు. ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు పిన్నీ అని మురారి అంటాడు. మురారిని కాపాడినందుకు మీరాకి థాంక్స్ చెప్తాడు. మీరు చేసిన సహాయం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని మురారి అంటాడు.

భవానీ ఏంట్రీ

కృష్ణ, మురారి, రేవతి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే వద్దని సుమలత, మధు చాలా బతిమలాడతారు. మురారి వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాగానే ఎదురుగా భవానీ ఉంటుంది. ఎక్కడికి బయల్దేరారని అడుగుతుంది. రేవతి నువ్వు ఎక్కడికి బయల్దేరావని నిలదీస్తుంది.

ఎవరో ఏదో అన్నారని కృష్ణ, మురారి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు వాళ్ళని వెళ్లొద్దని చెప్పమని అంటుంటే భవానీ తనని మాట్లాడొద్దని ఆపుతుంది. అప్పుడు ఆదర్శ్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతే ఊరుకున్నానని ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే ఊరుకుంటానని అనుకుంటున్నావా అంటుంది.

ఆదర్శ్ బయటకి వస్తాడు. మిమ్మల్ని ఎవరు బయటకి వెళ్లమన్నారో వాళ్ళనే మీరు ఎందుకు బయటకు వెళ్లాలో కారణం చెప్పమను అప్పుడు నేనే నిర్ణయిస్తాను మీరు ఉండాలో వద్దోనని భవానీ అంటుంది. నేను చెప్పడం వల్లే వెళ్లిపోతున్నారని ఆదర్శ్ నా పేరు చెప్తే పరిస్థితి ఏంటని ముకుంద టెన్షన్ పడుతుంది.

మురారిని ఆపిన ఆదర్శ్

క్షమించండి అత్తయ్య మీతో చెప్పకుండా వెళ్ళడం తప్పే కానీ తప్పదు ఈ ఒక్క విషయంలో క్షమించమని కృష్ణ అడుగుతుంది. ఒకే ఒక్క కారణం చెప్పమను నేనే మిమ్మల్ని పంపించేస్తానని భవానీ ఆదర్శ్ ని అడుగుతుంది. ఆదర్శ్ ఏం మాట్లాడకుండా మురారి చేతిలోని బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు.

అయిపోయింది కదా ఇంకెప్పుడు అలా బ్యాగులు పట్టుకుని వెళ్లొద్దని భవానీ చెప్తుంది. మురారి వెళ్లలేదు ఈసారి ఆదర్శ్ ని రెచ్చగొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను ఏం చెప్తే అది చేసేలాగా ఆదర్శ్ ని నా గుప్పిట్లో పెట్టుకోవాలని ముకుంద మనసులో అనుకుంటుంది. కృష్ణ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ముకుంద వాళ్ళ గది దగ్గరకు వస్తుంది.

మురారి భార్యగా ఈ గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వచ్చే రోజు ఎప్పుడు వస్తుందో. ఈ కృష్ణని పంపించేస్తే ఆరోజు వస్తుంది. తనని ఎలాగైనా పంపించాలని అనుకుంటుంది. కృష్ణ ముకుందను పిలుస్తుంది. ఆదర్శ్ ఈరోజు కాకపోతే రేపు అయినా మారతాడని అంటుంది. ఎన్ని మాటలు అంటున్నాడో నేను అంటే పడతాను కానీ ఏసీపీ సర్ భరించలేకపోతున్నారని కృష్ణ చెప్తుంది.

కృష్ణని బద్ధ శత్రువు చేస్తాను

ఆదర్శ్ మనసులో మురారి మీద ఉన్న నెగటివ్ ఫీలింగ్ తీసేస్తాను కానీ నిన్ను మాత్రం బద్ధ శత్రువుని చేస్తానని ముకుంద మనసులో అనుకుంటుంది. ఏసీపీ సర్ తప్పు లేదని అందరూ అర్థం చేసుకుంటే ఆదర్శ్ మాత్రం అర్థం చేసుకోవడం లేదని కృష్ణ బాధపడుతుంది.

ఆదర్శ్ మురారి మీద కోపం చూపించడం బాధగా ఉంది. ముకుంద, ఆదర్శ్ ని కలపాలని ఎంత తాపత్రయపడ్డావ్ కానీ టైమ్ కలిసి రాలేదని ఏదీ ఆలోచించొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. మురారి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అంటుంది.

తరువాయి భాగంలో..

భవానీ ఇంట్లో హోలీ సంబరాలు చేసుకుంటారు. మురారి కృష్ణ మీద రంగులు వేయబోతుంటే ముకుంద మీద పడతాయి. ముకుంద ప్రేమగా మురారిని చూస్తూ తన బుగ్గలకు రంగు పూస్తుంది. అది చూసి కృష్ణ ఆశ్చర్యపోతుంది.

IPL_Entry_Point