Krishna mukunda murari april 10th: ట్రయాంగిల్ లవ్ స్టోరీ మళ్ళీ మొదటికి వచ్చింది.. మీరాను అనుమానించిన కృష్ణ-krishna mukunda murari serial today april 10th episode krishna grows wary of meera conduct towards murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari April 10th: ట్రయాంగిల్ లవ్ స్టోరీ మళ్ళీ మొదటికి వచ్చింది.. మీరాను అనుమానించిన కృష్ణ

Krishna mukunda murari april 10th: ట్రయాంగిల్ లవ్ స్టోరీ మళ్ళీ మొదటికి వచ్చింది.. మీరాను అనుమానించిన కృష్ణ

Gunti Soundarya HT Telugu
Apr 10, 2024 08:29 AM IST

Krishna mukunda murari serial april 10th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. భవానీ ఇంట్లో హోలీ సంబరాలు వేడుకగా జరుగుతాయి. ఆదర్శ్ మళ్ళీ తనకు కనెక్ట్ అయ్యాడనే విషయం ముకుందకు అర్థం అయిపోతుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial april 10th episode: ఆదర్శ్ గురించి కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. తను మాట్లాడిన కూడా పట్టించుకోలేదని బాధపడుతుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఆదర్శ్ మారాడని మురారి అంటాడు. నిజంగా ఆదర్శ్ మారాడా అని కృష్ణ అడుగుతుంది. అదేంటి నన్ను కౌగలించుకుంటే ఈ అనుమానం ఎందుకు వచ్చిందని అంటాడు.

ఆదర్శ్ నిజంగా మారాడా?

మిమ్మల్ని కౌగలించుకున్నాడు మరి నా మీద ఎందుకు కోపంగా ఉన్నాడని అంటుంది. కొంచెం టైమ్ పడుతుందిలే అని సర్ది చెప్పేందుకు చూస్తాడు. నా మీద ఉన్న కోపం మీకు కనిపించలేదని అంటుంది. ముకుంద చనిపోయినప్పుడు నేనే కారణమని నామీద కోపంగా ఉన్నాడు.

మీరు జైలుకు వెళ్ళినప్పుడు మీమీద కోపంతో మిమ్మల్ని పట్టించుకోవద్దని నాతో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మీ మీద కోపం పోయి నా మీద కోపం ఉండవచ్చు కదా. ఆదర్శ్ ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావడం లేదని అంటుంది. ఇప్పుడు అనవసరంగా ఏవేవో ఆలోచించి పండగ మూడ్ పాడు చేయవద్దని ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారని మురారి చెప్తాడు.

రౌడీ మీకు గుర్తు ఉన్నాడా? ఏ కేసులో అరెస్ట్ చేశారని అడుగుతాడు. తనకు గుర్తు లేదని అంటాడు. వాడు రావడం నన్ను కొట్టబోవడం వల్ల మంచే జరిగింది కదా. ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఉండమని చెప్తాడు. అందరూ హోలీ ఆడేందుకు రెడీ అయి హాల్లోకి వస్తారు. సంగీతను చూసి మధు ఫ్లాట్ అయిపోతాడు.

ముకుందకు దగ్గరవుతున్న ఆదర్శ్ 

అటు ముకుందను చూసి ఆదర్శ్ ఫిదా అయిపోతాడు. ఆదర్శ్ ఏంటి తినేసేలా చూస్తున్నాడు రూపం మార్చుకున్నా నా మీద మోజు పోయినట్టు లేదు. తొందరగా సంగీతను అంట గట్టాలి. లేదంటే మళ్ళీ కథ మొదటికి వస్తుందని ముకుంద కంగారుపడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి రజిని తిట్టుకుంటుంది.

నా కూతురికి సాయం చేస్తానని చెప్పి అల్లుడికి ఎసరు పెట్టేలా ఉందని ముకుంద వైపు కోపంగా చూస్తుంది. కృష్ణ చున్నీ నడుముకు కట్టి హోలీ మొదలుపెడతామా అంటుంది. నీ అవతారం ఏంటి చీర కట్టుకోవచ్చు కదాని మురారి కృష్ణని ఎగతాళి చేస్తాడు. దీంతో కృష్ణ మురారి మీద రంగు వేసేసి నవ్వుతుంది.

మురారికి రంగులు రాసిన ముకుంద 

మురారి కృష్ణకు రంగు రాయడానికి వెళ్తే పారిపోతుంది. ఇద్దరూ సంతోషంగా అటూ ఇటూ పరుగులు పెడుతూ ఆడతారు. వీళ్లిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి అప్పుడే నాకు నిజమైన హోలీ అని ముకుంద మనసులో అనుకుంటుంది. అందరూ సంతోషంగా హవల్లి ఆడుకుంటూ ఉంటారు. ముకుంద రంగు తీసుకుని మురారి మీద విసరాలని చూస్తే అది కాస్త ఆదర్శ్ మీద పడుతుంది.

ఆదర్శ్ మనసులో గంటలు తెగ మోగేస్తాయి. ఆదర్శ్ కూడా ముకుంద బుగ్గలకు రంగులు పూసేస్తాడు. మురారి కృష్ణకు రంగులు పూయడం చూసి రగిలిపోతుంది. మధు సంగీత దగ్గరకు వెళ్ళి రంగులు రాస్తాడు. మురారి కృష్ణ మీదకు రంగు విసురుతుంటే అది పొరపాటున ముకుంద మీద పడుతుంది.

ముకుంద మురారికి ప్రేమగా రంగులు రాస్తుంది. అది కృష్ణ చూస్తుంది. మురారి వెళ్లబోతుంటే ముకుంద తన చేయి పట్టుకుని ఆపుతుంది. ఆదర్శ్ మళ్ళీ రంగులు ముకుంద బుగ్గలకు రాసి హోలీ శుభాకాంక్షలు చెప్తాడు. ఏం చేయలేక నవ్వుతున్నట్టు ఫేస్ పెడుతుంది. అందరూ హోలీ ఆడి అలిసిపోయి కూర్చుంటారు.

ఆదర్శ్ మళ్ళీ కనెక్ట్ అయ్యాడే 

ఆదర్శ్ ముకుందకు థాంక్స్ చెప్తాడు. ఈరోజు ఈ సంతోషం అంతా నీ వల్లే. నువ్వు నామీద రంగులు చల్లగానే నా మనసంతా హరివిల్లులాగా మారిపోయిందని అంటాడు. ఖర్మ ఈ ఆదర్శ్ మళ్ళీ నాకే కనెక్ట్ అవుతున్నాడని ముకుంద అనుకుంటుంది. కృష్ణ ముకుంద ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

మురారి వచ్చి ఏం ఆలోచిస్తున్నావని అంటాడు. మీరా గురించి ఆలోచిస్తున్నానని అంటుంది. మీరా కాదు ముకుంద అను మళ్ళీ పేరు పెట్టి పిలవలేదని ఆదర్శ్ కి కోపం వస్తుందని మురారి చెప్తాడు. ఆ పేరే మన పెదత్తయ్యకు పెద్ద సమస్య అయ్యింది. ముకుంద అని పిలవడం నావల్ల కాదు. నేను మనం ఉన్నప్పుడు మీరా అని పిలుస్తాను. మీరా మంచిది కాదని అనడం లేదు కానీ తన ప్రవర్తన బాగోలేదు. మెచ్యూరిటీ లేక అలా ప్రవర్తిస్తుందో లేదంటే ఏంటో అర్థం కావడం లేదు. హోలీ రంగులు పట్టుకుని మీ వెనుక ఎందుకు తిరుగుతుందని అంటుంది.

మీరాకు ముకుంద పేరు పెట్టగానే తన బుద్ధులు వచ్చేసి నా వెంట పడుతుందని అంటావా అంటాడు. రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణ సరదాగా ఉండటం ముకుంద చూసి రగిలిపోతుంది. గతంలో భవానీ రాసిన లెటర్ కృష్ణ కంట పడుతుంది. అమ్మవి అయితే చూడాలని ఉందని లెటర్లో ఉంటే తప్పకుండా మీ కోరిక తీరుస్తానని కృష్ణ మనసులో అనుకుంటుంది. ముకుంద ఆ లెటర్ తీసుకుని చూసి నో మురారి నా బిడ్డకు మాత్రమే తండ్రి కావాలి. మురారి నీడ కూడా కృష్ణ మీద పడటానికి వీల్లేదని లెటర్ చింపేస్తుంది.

IPL_Entry_Point