Solar eclipse 2024: 54 ఏళ్ల తర్వాత అద్భుతమైన సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి పండగ లాంటి సమయం-solar eclipse 2024 is so special after 54 years these zodiac signs get bright future ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Solar Eclipse 2024 Is So Special After 54 Years, These Zodiac Signs Get Bright Future

Solar eclipse 2024: 54 ఏళ్ల తర్వాత అద్భుతమైన సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి పండగ లాంటి సమయం

Gunti Soundarya HT Telugu
Mar 30, 2024 12:00 PM IST

Solar eclipse 2024: 54 ఏళ్ల తర్వాత అద్భుతమైన సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశుల వారికి పండగ లాంటి సమయం కాబోతుంది . సూర్య గ్రహం ప్రభావం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

2024 లో మొదటి సూర్య గ్రహణం
2024 లో మొదటి సూర్య గ్రహణం (pixabay)

Solar eclise 2024: వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలు అశుభమైనవిగా పరిగణిస్తారు. గ్రహణాలు మానవ ఉనికి పై శుభ, అశుభ ప్రభావం చూపుతాయి. ఈనెల హోలీ రోజు మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం చైత్ర నవరాత్రుల ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ఏర్పడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

54 సంవత్సరాల తర్వాత ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. 1970లో ఇటువంటి సూర్యగ్రహణం సంభవించింది మళ్ళీ ఇప్పుడే సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం మూడు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వారు అదృష్టవంతులు అవుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సంపదను పొందుతారు.

సూర్య గ్రహణం ఎప్పుడు?

ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 సోమవారం ఏర్పడుతుంది. అయితే ఇది భారత్ లో కనిపించదు కానీ దీని ప్రభావం మొత్తం రాశి చక్రాల మీద పడుతుంది. మీన రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భారత్ లో కనిపించకపోవడం వల్ల సూతక్ కాలం పరిగణించాల్సిన అవసరం లేదు.

భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం 8వ తేదీ రాత్రి 9.12 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1.25 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో సుమారు 7:30 నిమిషాల పాటు సూర్యుడు కనిపించడు. ఈ గ్రహణం చాలా అరుదుగా ఉంటుంది. అయితే మన దగ్గర సూర్యగ్రహణం రాత్రి సమయం కావున ఎటువంటి ప్రభావం చూపించదు. ఇతర దేశాల్లో మాత్రం ఏడున్నర నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకటి అలుముకుంటుంది. సూర్య గ్రహణం వల్ల మూడు రాశుల వారికి ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

మేష రాశి

2024లో వచ్చే మొదటి సూర్యగ్రహణం మేష రాశి వారికి మేలు చేస్తుంది. వారి ప్రతి కల నెరవేరుతుంది. మంచి మొత్తంలో డబ్బులు అందుకుంటారు. ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఈ సమయం అనువైనది. ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నం చేసిన విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. డబ్బు ఆదా చేయగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు లాభాలను అందిస్తాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి సూర్యగ్రహణం మంచి చేస్తుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కెరీర్లో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు తమకి ఇష్టమైన ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు రాసిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. రాజకీయాలలో ఉన్న వారికి ఈ సమయం అదృష్టం తీసుకొస్తుంది. వృషభ రాశి వారికి దాంపత్య సుఖం పెరుగుతుంది.

మకర రాశి

మకర రాశి వారు 2024 మొదటి సూర్య గ్రహణం నుంచి అద్భుతమైన ప్రయోజనం పొందుతారు. పిల్లల వైపు నుంచి మనసుకి సంతోషం కలిగించే శుభవార్తలు వింటారు. సహోద్యోగులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. పనిలో ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మీరు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం మీకు ప్రయోజనాలను అందిస్తుంది. కుటుంబంతో మంచి క్షణాలను గడుపుతారు. వ్యాపారం చేసే వారికి కొత్త ఇన్వెస్టర్లు, క్లైంట్లు దొరుకుతారు.