Trigrahi yogam: 10ఏళ్ల తర్వాత మీన రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు-mercury sun rahu conjunction in meena rashi will create trigrahi yogam after 10 years ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Trigrahi Yogam: 10ఏళ్ల తర్వాత మీన రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Trigrahi yogam: 10ఏళ్ల తర్వాత మీన రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Gunti Soundarya HT Telugu
Mar 15, 2024 07:30 PM IST

Trigrahi yogam: సుమారు 10 సంవత్సరాల తర్వాత మీన రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి మూడింతల లాభాలు కలగబోతున్నాయి. మూడు రాశుల కలయిక వల్ల మూడు యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి.

మీనరాశిలో త్రిగ్రాహి యోగం
మీనరాశిలో త్రిగ్రాహి యోగం (pixabay)

Trigrahi yogam: అన్ని గ్రహాలను నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. ఇది మొత్తం 12 రాశుల మీద శుభ ప్రభావాలను చూపిస్తుంది. గ్రహాల రాజు సూర్యుడు మార్చి 14న మీన రాశి ప్రవేశం చేశాడు. ఇప్పటికే అక్కడ బుధుడు, రాహువు సంచరిస్తున్నారు.

ఒక గ్రహంలో మూడు రాశులు కలవటం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. సుమార్పు పది సంవత్సరాల తర్వాత మీన రాశిలో ఈ యోగం ఏర్పడింది. అటు బుధుడు, సూర్యుడు కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో బుధాదిత్య రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జాతకంలో ఈ యోగం ఉంటే సంపద పెరుగుతుంది. అలాగే 18 సంవత్సరాల తర్వాత రాహువు, బుధుడు కలయిక వల్ల జడత్వ యోగం ఏర్పడింది. ఈ యోగం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశుభమైనది.

మూడు గ్రహాల కలయిక వల్ల ఒకే రాశిలో మూడు యోగాలు ఏర్పడ్డాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి రాబోయే 15 రోజుల్లో విపరీతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మూడింతల లాభాలను పొందుతారు. ప్రతి రంగంలో ఆశించిన విషయం సాధిస్తారు. భౌతిక సంపద పెరుగుతుంది. మీన రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల ఏ రాశి వారు తమ అదృష్టాన్ని మార్చుకుంటారో చూద్దాం.

కర్కాటక రాశి

మూడు గ్రహాల కలయిక వల్ల కర్కాటక రాశి వారికి మంచి జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. డబ్బుకు సంబంధించిన వివాదాల నుంచి బయటపడతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు.

కన్యా రాశి

సూర్యుడు, బుధుడు, రాహువు కలయిక వల్ల కన్యా రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాలలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు అత్యుత్తమ విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. భాగస్వామి సహకారం మీకు లభిస్తుంది. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వస్తు సంపద పెరుగుతుంది.

మకర రాశి

మీనరాశిలో త్రిగ్రాహి యోగం ప్రభావంతో మకర రాశి వారు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మీరు చేసే పనిలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ధార్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. వృత్తిలో పురోగతికి అవకాశాలు ఉంటాయి.

మీన రాశి

మీన రాశిలోనే ఈ మూడు గ్రహాల కలయిక జరుగుతుంది. ఫలితంగా మూడు యోగాలు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావంతో మీన రాశి జాతకులకు ఫలితాలు మూడింతలు రానున్నాయి. శత్రువులు మీ చేతిలో ఓడిపోతారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. పూర్వికులు ఆస్తి నుంచి ధన లాభం పొందుతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మీరే నిలుస్తారు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించి బాధ్యతలు అందుకుంటారు.