Jadatva yogam: రాహు, బుధ కలయికతో జడత్వ యోగం.. 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..-rahu mercury conjunction in meena rashi will create jadatva yogam these zodiac signs get good effect ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Rahu Mercury Conjunction In Meena Rashi Will Create Jadatva Yogam, These Zodiac Signs Get Good Effect

Jadatva yogam: రాహు, బుధ కలయికతో జడత్వ యోగం.. 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..

Gunti Soundarya HT Telugu
Mar 08, 2024 12:14 PM IST

Jadatva yogam: మీన రాశిలో రాహువుతో బుధుడు సంయోగం జరిగింది. ఫలితంగా జడత్వ యోగం ఏర్పడింది. దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద ఏ విధంగా ఉంటుందో చూద్దాం.

రాహువు బుధుడు కలయికతో జడత్వ యోగం
రాహువు బుధుడు కలయికతో జడత్వ యోగం

Jadatva yogam: వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు అన్ని ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు కుంభ రాశిని వదిలి మీన రాశి ప్రవేశం చేశాడు. ఇప్పటికే మీనరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. సుమారు 18 సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

బుధుడు, రాహువు కలసి జడత్వ యోగం ఏర్పడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ యోగం అశుభప్రదంగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు లభించనుండగా, మరికొన్ని రాశుల వారికి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. బుధ, రాహు కలయిక ప్రభావం ఉంటుందో చూద్దాం.

మేష రాశి

జడత్వ యోగం ప్రభావంతో మేష రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మితిమీరిన కోపాన్ని నివారించాలి. మీ మాటలు అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

వృషభ రాశి

వృషభ రాశి జాతకులు కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు స్వీకరిస్తారు. పనిలో ఆహ్లాదకరమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఆర్థిక విషయాలలో సమస్యలు వస్తాయి. పెట్టుబడి పెట్టాలనే నిర్ణయాలు విరమించుకోవడం మంచిది. ఈ సమయంలో మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలి.

మిథున రాశి

జడత్వ యోగం మిథున రాశి వారికి పనిలో శుభ ఫలితాలను ఇస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ధన లాభం పొందడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. కెరీర్లో కొన్ని సవాళ్లు స్వీకరించడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

కర్కాటక రాశి

విద్యార్థులకు ఇది శుభ సమయం. విద్యా, మేధోపరమైన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ధన నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగంతో ఏం నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

సింహ రాశి

ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో శత్రువులు మీ మీద దాడి చేసేందుకు చూస్తారు. జీవితంలో కొద్దిగా అలజడి కలుగుతుంది. జీవనశైలి అస్తవ్యస్తంగా ఉంటుంది. కోపాన్ని దూరం చేసుకుని ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోండి.

కన్యా రాశి

జడత్వ యోగం ప్రభావంతో కన్యా రాశి వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. సంబంధాల్లో విభేదాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది. మనసు ఆందోళనకు గురిచేస్తుంది. ఈ సమయంలో డబ్బు లావాదేవీలు చాలా తెలివిగా చేయాలి.

తులా రాశి

పనిలో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ తెలియని భయం వల్ల మనసు కలత చెందుతుంది. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి.

వృశ్చికం

జడత్వ యోగం వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. డబ్బు తెలివిగా ఖర్చు చేస్తారు. ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోండి. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

ధనుస్సు రాశి

వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పనికి సంబంధించి ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రాపర్టీ లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది.

మకరం

ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు అధికమవుతాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. అపార్ధాలు పెరగనివ్వద్దు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

కుంభ రాశి

ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మీరు డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టాలని నిర్ణయాలు ఆలోచిస్తున్నట్లయితే విరమించుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యపై శ్రద్ధ వహించాలి. ఎక్కువగా ఒత్తిడికి గురికావద్దు.

మీన రాశి

ఆఫీస్ పనులు ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వైవాహిక జీవితం మన సమస్యలు తొలగిపోతాయి. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

WhatsApp channel