Kanya Rasi 2024: కన్యా రాశి ఫలాలు.. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీస్సులు-kanya rasi 2024 new year rasi phalalu check your virgo zodiac sign for astrological prediction in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kanya Rasi 2024: కన్యా రాశి ఫలాలు.. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీస్సులు

Kanya Rasi 2024: కన్యా రాశి ఫలాలు.. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీస్సులు

HT Telugu Desk HT Telugu
Dec 16, 2023 07:02 AM IST

Kanya Rasi 2024: కన్యారాశి 2024 రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. కన్యా రాశి జాతకులకు 2024 సంవత్సరం లక్ష్మీదేవత ఆశీస్సులు ఉంటాయని పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. కన్యారాశి 2024 రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Kanya Rasi 2024: కన్యారాశి 2024 రాశి ఫలాలు
Kanya Rasi 2024: కన్యారాశి 2024 రాశి ఫలాలు (Pixabay)

2024వ సంవత్సరం కన్యా రాశి వారికి శని ఆరో స్థానమునందు అనుకూలముగా ఉండటం, జనవరి నుండి ఏప్రిల్‌ వరకు గురుడు అష్టమస్థానం, మే నుండి గురుడు భాగ్యస్థానములో సంచరించడం వలన ధనలాభము, కీర్తిలాభము కలుగును.

కన్యా రాశి వారికి మొదటి భాగములో కొన్ని ఒత్తిళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికి ద్వితీయార్థంలో ఆరోగ్యాభివృద్ధి కలుగును. 2024 కన్యారాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును. వ్యాపారస్తులకు ధనలాభము కలుగును.

రైతాంగం వంటి రంగాల వారికి శుభఫలితములు కలుగును. సినీ మరియు మీడియా రంగంలో ఉన్న కన్యారాశి జాతకులకు 2024లో అనుకూల ఫలితములు లభించును. శారీరక సౌఖ్యమును పొందెదరు.

జనవరి నుండి ఏప్రిల్‌ వరకు ఆరోగ్యము, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. కన్యారాశి విద్యార్థులకు 2024 అన్ని విధాలుగా కలసివచ్చును. విదేశీ ప్రయత్నాలు ఫలించును. కన్యారాశి స్త్రీలకు 2024 సంవత్సరములో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టు సూచనలు ఉన్నాయి.

కన్యారాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. 2024లో కన్యారాశికి జన్మ రాహువు ప్రభావం చేత అవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను.

కన్యా రాశి 2024 ప్రేమ జీవితం

2024 సంవత్సరంలో కన్యారాశి వారికి ప్రేమ విషయంలో ప్రథమార్థంలో ప్రతికూలంగాను, ద్వితీయార్థంలో అనుకూలంగాను ఉన్నాయి. జనవరి నుండి మే వరకు ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలని సూచన. జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయములు ఏర్పడు సూచనలు ప్రథమార్థంలో కలుగుచున్నవి. మే నుండి ప్రేమ పరమైనటువంటి విషయాలు కన్యారాశికి కలసివచ్చును.

కన్యా రాశి 2024 ఆర్థిక విషయాలు

2024 సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్ధికపరంగా అనుకూలమైన సంవత్సరం. ఆర్ధికపరమైన విషయాలలో మీరు చేసే ప్రణాళికలన్నీ సత్‌ ఫలితాలు కలిగిస్తాయి. వ్యాపారస్తులకు 2024 వ్యాపారాభివృద్ధి కలిగించును. 2024 సంవత్సరం కన్యారాశి వారికి ఆర్థికపరంగా లక్ష్మీప్రదం. అనుకున్న ఫలితాలను కలిగించును.

కన్యా రాశి 2024 కెరీర్

2024 సంవత్సరం కన్యారాశి వారికి కెరీర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్‌ వరకు అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయం ఏర్పడి ఉన్నది. మే 2024 నుండి భాగ్యములో గురుడు అనుకూలించడం వలన కన్యా రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా కలసివచ్చును. అంటే మొత్తంగా చూస్తే 2024 కన్యారాశి వారికి కెరీర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగస్తులకు మే నుండి ప్రమోషన్లు వంటివి కలసివచ్చును.

కన్యా రాశి 2024 ఆరోగ్యం

2024 సంవత్సరం కన్యా రాశివారికి ఆరోగ్యపరంగా జనవరి నుండి ఏప్రిల్‌ వరకు కన్యా రాశి జాతకులకు లేదా కుటుంబములోని వారికి అష్టమ గురుని ప్రభావంచేత ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి స్ధితి గోచరిస్తుంది. మే నుండి భాగ్యములో సంచరించుట చేత మే నుండి డిశంబర్‌ వరకు అనుకూల గ్రహస్థితి గోచరిస్తుంది. కన్యారాశి వారికి 2024 అరోగ్యపరంగా కొంత అనుకూలమైనటువంటి సంవత్సరం అని చిలకమర్తి తెలిపారు.

కన్యా రాశి 2024 పరిహారాలు

కన్యా రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దుర్గా దేవిని పూజించడం, సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner