Anger Relief Crystals : కోపాన్ని, ఆందోళనను తగ్గించుకోవడానికి ఈ క్రిస్టల్స్ వాడి చూడండి
Anger Relief Crystals: కోపంతో లేదా ఒత్తిడితో మునిగిపోతున్నారా? కొన్నిసార్లు, జీవితం కఠినంగా మారి కష్టమైన భావోద్వేగాలను అదుపు చేసేందుకు సహకారం కోరుతుంటే.. స్ఫటికాలను ఉపయోగించడం మీకు సరైన మార్గం.
నిత్య జీవితంలో కొన్ని పరిస్థితులు అతలాకుతలం చేస్తుంటాయి. కాలం కలిసి రానప్పుడు ఒత్తిడి, డిప్రెషన్ ఎదుర్కొంటూ సతమతమవుతుంటారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ సాయం కోసం ఆశిస్తుంటే కొన్ని ప్రత్యేకమైన రాళ్లు మీకు ఉపశమనం కలిగిస్తాయని క్రిస్టలోగ్రఫీ (స్పటికా శాస్త్రం) చెబుతుంది. పలు రకాలైన ఫీలింగ్స్, పరిస్థితుల నుంచి దూరం చేస్తాయని పెద్దలు చెబుతున్నారు. మరి ఆ ప్రత్యేకమైన క్రిస్టల్స్ ఏంటో చూద్దాం.
ఎమెథీస్ట్ (Amethyst): ఈ ప్రత్యేకమైన పర్పుల్ క్రిస్టల్ శాంతిని సూచిస్తుంది. మీ మనస్సులో ఉన్న ఒత్తిడి, చికాకు లాంటి భావాలను తగ్గించడంలో సహాయపడి ప్రశాంతమైన లక్షణాలు కలిస్తాయి. అమెథిస్ట్ అంతర్గత శాంతి, విశ్రాంతిని కూడా పెంపొందిస్తుందని భావిస్తారు. ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం ప్రయత్నించే వారికి ఇది బెస్ట్ ఛాయీస్.
రోజ్ క్వార్ట్స్ (Rose Quartz): ప్రేమకు ప్రేరణగా నిలిచే క్రిస్టల్ ఇది. ఈ రోజ్ క్వార్ట్జ్ కరుణ, సున్నితత్వం, మానసిక గాయాలను నయం చేస్తుంది. కోపం వంటి భావాలను తగ్గించి, ప్రేమ, అవగాహన వంటి భావాలను పెంపొందిస్తుంది. ఈ క్రిస్టల్ ధరించడం వల్ల సెల్ఫ్ లవ్, క్షమాపణ వంటి గుణాలను కలిగిస్తుంది.
బ్లాక్ టూర్మాలిన్ (Black Tourmaline): కోపం లేదా చిరాకు వంటి ప్రతికూల భావావేశాలతో రగిలిపోతుంటే ఈ క్రిస్టల్ మీకు సహాయకారి కావచ్చు. ఈ శక్తివంతమైన క్రిస్టల్ మిమ్మల్ని ప్రతికూల మనస్తత్వాన్ని తగ్గించి, సానుకూల మనస్తత్వాన్ని ప్రేరేపిస్తుంది.
లాపిస్ లాజులి (Lapis Lazuli): అందమైన నీలిరంగు క్రిస్టల్‌ను శతాబ్దాలుగా వైద్యం చేసే లక్షణాల కోసం ఉపయోగిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, అంతర్గత సామరస్యాన్ని, శాంతిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది సత్యం, జ్ఞానం పెంచి సవాలు ఎదుర్కొనే సమయాల్లో స్పష్టమైన దృక్పథం పెంపొందేందుకు తోడ్పడుతుంది.
సిట్రిన్ (Citrine): ఈ క్రిస్టల్ ఆనందాన్ని పెంచడంతో పాటు ఆశావాదం మెరుగవడానికి సహకరిస్తుంది. ముఖ్యంగా నిరాశ భావాలను తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. దీనిని ధరించడం వల్ల మీ పట్ల శ్రేయస్సు, విజయం ఆకర్షితమవుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు ఈ అద్భుతమైన క్రిస్టల్ మీకు ప్రశాంతతను కలిగేందుకు ఉపయోగపడుతుంది.
క్లియర్ క్వార్ట్జ్ (Clear Quartz): క్లియర్ క్వార్ట్జ్ ను తరచుగా మాస్టర్ హీలర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే శక్తిని, సామర్థ్యాన్ని పెంచి సమతుల్యత, సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. మనస్సులో భావాలను క్లియర్ చేసి దృష్టి, ఏకాగ్రతను పెంచుతుంది. సవాలు ఎదుర్కొనే పరిస్థితుల్లో కీలకంగా వ్యవహరించి మంచి సహకారం అందిస్తుంది.
ఆక్వామారిన్ (Aquamarine): పేరుకు తగ్గట్లుగానే సముద్రంలోని ప్రశాంతత, ఓదార్పు శక్తులను అందిస్తుంది ఆక్వామారిన్. ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి సహకరిస్తుందని నమ్ముతారు. కోపం, నిరావ భావాలను తగ్గించడానికి అద్భుతమైన క్రిస్టల్ గా పని చేస్తుంది. కమ్యూనికేషన్, ఫీలింగ్స్ ను స్పష్టంగా చెప్పగలగడంలో మెరుగుపరుస్తుంది. వైరుధ్యాలను పరిష్కరించి, భావోద్వేగాలను ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తమయ్యేందుకు తోడ్పడుతుంది.