రణగొణ ధ్వనుల నుంచి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో...గడిపే కొన్ని రోజులు మన మానసిక స్థితిని ఎంతో మెరుగుపరుస్తాయి. ప్రశాంతమైన విహారయాత్రను కోరుకునే ప్రయాణికులకు...ఈ ప్రదేశాలు మానసిక ఉత్తేజాన్ని అందిస్తాయి.   

unsplash

By Bandaru Satyaprasad
Nov 11, 2024

Hindustan Times
Telugu

లడఖ్ - అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, మఠాలు, నిర్మలమైన వాతావరణానికి లఖడ్ ప్రసద్ధి. హిమాలయాల మధ్య ప్రశాంతమైన లడఖ్ ప్రయాణం మనలో నూతనోత్తేజాన్ని అందిస్తుంది.  

unsplash

స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్ - చాలా తక్కువ మంది నివసించే ప్రదేశం స్పితి వ్యాలీ. రిమోట్ ఏరియాలో ఉండే ఈ వ్యాలీలో అద్భుతమైన పర్వత దృశ్యాలు, పురాతన మఠాలు, సంప్రదాయలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.  

unsplash

లక్షద్వీప్ -లక్షద్వీప్ అత్యంత సుందరమైన ప్రదేశం. ఇక్కడి బీచ్ లు ఎంతో అద్భుతంగా ఉంటాయి. జనసమూహానికి దూరంగా ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి ఇది చక్కటి టూరిస్ట్  ప్లేస్.  

unsplash

అండమాన్, నికోబార్ దీవులు - సహాజమైన బీచ్ లు, స్పష్టమైన జలాలు, చుట్టూ పచ్చదనం...అండమాన్, నికోబార్ దీవుల సొంతం. ప్రశాంతత కోసం ఈ దీవుల పర్యటన ఎంతో గానే ఉపయోగపడుతుంది.  

unsplash

గోకర్ణ, కర్ణాటక - గోకర్ణలో అందమైన బీచ్ లు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. తక్కువ జనసముహం, ప్రశాంతమైన బీచ్ ల కోసం చూస్తున్న వారికి గోకర్ణ బెస్ట్ ప్లేస్.  

unsplash

కూర్గ్, కర్ణాటక - కూర్గ్ కాఫీ తోటలు, పొగ మంచు కొండలు, ప్రశాంతత మారుపేరు. ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం.  

usplash

రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ - రాన్ ఆఫ్ కచ్ లోని ఉప్పు చిత్తడి నేలలు ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యా్న్ని, ప్రశాంత భావాన్ని అందిస్తాయి.  

unsplash

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ - తవాంగ్ సహజమైన అందాలకు నెలవు. బౌద్ధ ఆరామాలు, ప్రశాంతమై వాతావరణానికి తవాంగ్ ప్రసిద్ధి.  

unsplash

 మున్నార్, కేరళ - మున్నార్.. తేయాకు తోటలు, చల్లని వాతావరణం, సుందరమైన అందాలకు ప్రసిద్ధి. ప్రశాంతత కోరుకునే వారికి చక్కని ప్రదేశం. 

unsplash

చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఇవి తప్పక తీసుకోండి

Photo: Pexels