Karthika Somavaram: కార్తీక మాసం చివరి సోమవారం- దరిద్రాన్ని తరిమికొట్టేందుకు ఇదే మార్గం, తప్పక తెలుసుకోండి!
Karthika Somavaram: మాసాలన్నింటిలో కార్తీక మాసానికి ప్రాముఖ్యత ఎక్కువ. అందులోనూ కార్తీక సోమవారం అనేది చాలా పవిత్రమైనది.నవంబర్ 25 కార్తీకమాసంలో వచ్చే చివరి సోమవారం. ఈ రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దరిద్రాలన్నీ తొలగిపోవడం ఖాయం.
మాసాలన్నింటిలో కార్తీక మాసానికి హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఎక్కువ. ఈ మాసంలో దేవతలంతా కలిసి దివికి దిగి వచ్చి దేవతల దీపావళి జరుపుకుంటారని నమ్మిక. ఇదే మాసంలో శాలిగ్రామ రూపంలో ఉన్న శివుడికి, తులసీ మాతకు వివాహం జరిపిస్తారు. అంతేకాదు ఈ మాసంలో పవిత్ర గంగలో స్నానాలు ఆచరించడం, దీపాలు వెలిగించి దీపాల పండగను చేయడం, దీపాలను దానం చేయడం కూడా కార్తీక మాసంలో జరిగే శుభ కార్యాలు, పండగలు. కార్తీక మాసం ముఖ్యంగా శివుడి, విష్ణువు, లక్ష్మీ దేవిల పూజలు అంకితం చేయబడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దానాలు నూటికి నూరు పాల్లు శుభఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మిక. ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం పొంది సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసివస్తుందని విశ్వాసం.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కార్తీక మాసం నవంబరు 2వతేదీన కార్తీక మాసం మొదలైంది. ఇది డిసెంబర్ 2 సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమి రోజుతో ముగుస్తుంది. అంటే 2024 ఏడాదిలో వచ్చే కార్తీకమాసం ప్రస్తుతం మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. నేడు అంటే నవంబరు 25, 2024 ఈ ఏడాది కార్తీకమాసంలో వచ్చే చివరి సోమవారం అవుతుంది. కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక ఈ రోజుకు ప్రత్యేకత ఎక్కువ.ఈ రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల భక్తులకు సిరి సంపదలు, విద్య, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని నమ్ముతారు.
కార్తీక మాసం చివరి సోమవారం చేయాల్సిన పనులేంటి..
* కార్తీకమాసం అంతా గుడికి వెళ్లకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్లాలి.
* ఉదయాన్నే ఇంటినీ, ఒంటినీ శుభ్రం చేసుకుని శివుడి దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి.
* శివక్షేత్రానికి వెళ్లి ఆయనకు ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి.
* అలాగే నీటితో లేదా పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి.గంగాజలం, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి.
*ఈ రోజున మీ వీలు స్తోమతను బట్టి అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి.
* ప్రతి రోజూ దీపారాధన చేసే అలవాటు, వీలు లేని వారు కార్తీకమాసంలో వచ్చే చివరి సోమవారం రోజున 365 వత్తులు, లక్ష వత్తులతో దీపాలు వెలిగించాలి.
* కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకు ఆహారం తినిపించాలి.
* ఆలయంలో ఉండే ద్వజ స్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి.
* కార్తీకమాసంలో వచ్చే చివరి సోమవారం కనుక ఈ రోజు ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణ చేయాలి.
* ఈ రోజు సాదువులకు లేదా భిక్షగాళ్లకు ముడి బియ్యం దానం చేస్తే మీకు ఆహారానికి కొదవ ఉండదు.
* కార్తీక సోమవారం రోజున గంగా నది స్నానాలు చేస్తే సకల పాపాలు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దోషాలు తొలగిపోయి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.