kaal Ashtami 2024: శివుడు కాలభైరవుడి అవతారం ఎందుకు ఎత్తాడు, కాలాష్టమి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా?
kaal Ashtami 2024: కాలభైరవ జయంతిని ప్రతి సంవత్సరం మార్గశిర్ష మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. ధార్మిక పురాణాల ప్రకారం, శివుడు ఈ రోజున కాల భైరవుడిగా అవతరించాడు.
ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఎనిమిదవ రోజును కాలాష్టమిగా జరుపుకుంటారు. ధార్మిక పురాణాల ప్రకారం, శివుడు ఈ రోజున కాల భైరవుడిగా అవతరించాడు. పరమ శివుడు భయంకరమైన రూపంలో బాబా కాల్ భైరవ్‌గా అవతారమెత్తిన రోజును కాల భైరవ అష్టమి లేదా కాల బైరవ జయంతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, కాల భైరవ్ జయంతి నవంబర్ 22, శుక్రవారం రోజున వస్తుంది. కాలాష్టమి రోజున రోజంతా పవిత్రంగా భావించి శక్తివంతమైన కాల బైరవ బాబాను ప్రత్యేకమైన ఆచారాలతో ఆరాధిస్తారు. పరమేశ్వరుడి ఆశీస్సులు అందుకుని ఆధ్మాత్మికంగానూ, సుఖ సంతోషాలతోనూ జీవిస్తామని విశ్వసిస్తారు. మనిషిని నాశనం చేసే కోపం, దురాశ, కామం నుంచి రక్షణ దొరుకుతుందని నమ్ముతారు. శివ పురాణం ప్రకారం.. రోజు శివుడు కాలభైరవ అవతారం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుందాం.
శివుడు కాలభైరవ అవతారం ఎందుకు ఎత్తాడు?
శివ పురాణం ప్రకారం.. ఒకసారి విష్ణువు బ్రహ్మదేవుడిని ఈ విశ్వ సృష్టికర్త ఎవరు అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మ తనను తాను గొప్పగా వర్ణించుకుని తానే సృష్టికర్తనంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమాధానం విన్న మహావిష్ణువు అతని మాటల్లోని అహంకారానికి, అతి విశ్వాసానికి ఆగ్రహించాడు. ఇద్దరి మధ్య వాదన పెరిగి ఈ ప్రశ్నకు సమాధానం కోసం నాలుగు వేదాలకు వద్దకు వెళ్ళారు. ముందుగా వారు ఋగ్వేదానికి చేరుకున్నారు. అతని సమాధానం విన్న ఋగ్వేదం , "శివుడే శ్రేష్ఠుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సకల జీవరాశులు ఆయనలో ఉన్నాయి" అన్నాడు. ఆ తర్వాత ఇదే ప్రశ్నను యజుర్వేదాన్ని అడిగినప్పుడు, "యజ్ఞాల ద్వారా మనం పూజించే వాడు ఉత్తముడు, అతను మరెవరో కాదు శివుడు" అని జవాబిచ్చాడు.
దీంతో బ్రహ్మ దేవుడికి కోపం వస్తుంది అతని అహం చల్లారక వారిచ్చే సమాధానాలకు బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. ఈ చర్య కాస్త తగవుగా మారడంతో పరిష్కారం కోసం పరమ శివుడ్ని కోరతారు. ఆ సమయంలో మహదేవ్ దివ్యకాంతి రూపంలో అక్కడికి చేరుకున్నాడు. ఎంతకీ బ్రహ్మదేవుడు సత్యాన్ని ఒప్పుకోడు. తనకు ఐదు తలలు ఉన్నాయని మహేశ్వరుడి మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తాడు. దాంతో ఉగ్ర రూపుడైన శివుడు నుదుటి నుంచి పరమశివుని అంశ అయిన కాల భైరవుడిగా ఉద్భవిస్తాడు. ఐదు తలలు ఉన్నాయని చెబుతున్న బ్రహ్మదేవుని తలల్లో ఒక దానిని ఖండిస్తాడు.
అలా కాలభైవర అవతారం ఎత్తిన శివుడు తన అవతారానికి 'కాలా' అని నామకరణం చేసి తాను కాళానికి రాజునని చెబుతాడు. కాలానికి, చావుకు రాజు మరెవరో కాదు శివుని అవతారమైన భైరవుడు. భైరవుడు కాలిపోతున్న బ్రహ్మ తలను తన మొండెం నుండి వేరు చేశాడు. అలా బ్రహ్మను చంపిన పాపం నుండి విముక్తతి పొందడానికి శివుడిని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించమని భైరవుని కోరాడు. బ్రహ్మ శిరస్సు భైరవుడి చేతిలోంచి కింద పడింది. కాశీలో బ్రహ్మ నరికిన శిరస్సు పడిపోయిన ప్రదేశాన్ని కపాల్ మోచన్ తీర్థం అంటారు. ఆ రోజు నుండి కాలభైరవుడు శాశ్వతంగా కాశీలో నివసిస్తున్నాడని శివ పురాణం చెబుతోంది. కాశీ యాత్రకు వెళ్ళేవారు లేదా అక్కడ బస చేసే వారు తప్పనిసరిగా కపాల్ మోచన్ తీర్థాన్ని సందర్శించాలని నమ్ముతారు.
కాలాష్టమి రోజున శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు పఠించాల్సిన మంత్రాలు
1. ఓం కాలకాలాయ విధ్మహే,
కాళాతీతాయ ధీమహి,
తన్నో కాల భైరవా ప్రచోదయాత్
2. ఓం ఐం హ్రాం క్లీం శ్రీ బతుక భైరవాయ
3. ఓం హ్రం హ్రీం హ్రూం హ్రీం హ్రౌం క్షం క్షేత్రపాలాయ కాల భైరవాయ నమ:
4. ఓం హ్రీం బం బతుకాయ ఆపదుధారణాయ కురు కురు బతుకాయ ఓం హ్రీం నమ: శివాయ
5. హ్రం హ్రీం హ్రౌం ఓం కాల భైరవ నమ:
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.