Ganga river: అస్థికలు గంగా నదిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు? దీని వెనుక కారణం ఏంటి?-why are ashes immersed in the river ganga what is the reason behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ganga River: అస్థికలు గంగా నదిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు? దీని వెనుక కారణం ఏంటి?

Ganga river: అస్థికలు గంగా నదిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు? దీని వెనుక కారణం ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jul 18, 2024 02:32 PM IST

Ganga river: చాలా మంది చనిపోయిన తమ కుటుంబ సభ్యుల ఆత్మలకు మోక్షం లభించాలని కోరుకుంటూ వారి అస్థికలు గంగా నదిలో కలుపుతారు. లేదంటే వారికి మోక్షం లభించదని నమ్ముతారు. ఇలా చేయడం వెనుక కారణం ఏంటి? గంగా నదిలో ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసుకుందాం.

అస్థికలు గంగా నదిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు?
అస్థికలు గంగా నదిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు? (pinterest)

Ganga river: అత్యంత పవిత్రమైన నదుల్లో గంగా నది ఒకటి. కేవలం ఇది నది కాదు ఒక దేవత. స్వర్గం నుంచి భూమి మీదగా వచ్చిన గంగా దేవి గురించి పురాణాలలో అనేక కథనాలు ఉన్నాయి. భగీరథ రాజు తన పూర్వీకుల బూడిదను శుద్ధి చేసేందుకు, వారి ఆత్మలను విముక్తి చేసేందుకు భూమికి తీసుకువచ్చాడని కొందరు చెబుతారు.

గంగాజలం అత్యంత పవిత్రం

గంగా జలం చాలా స్వచ్చమైనది. మనుషులు తెలియక పొరపాటున చేసిన పాపాలను శుద్ధి చేసి పరిపూర్ణులుగా చూఎస్తుంది. అందుకే గంగా నది గురించి గంగా మే వో హాయ్ పాప ధుల్తే హై జో అంజానే మే కియే హో అని అంటారు. అంటే గంగలో శుద్ధి చేయబడిన పాపాలు పొరపాటున చేసినవి మాత్రమే అని దీని అర్థం.

పవిత్రమైన గంగా జలాన్ని చాలా మంది ఇంటికి తీసుకెళ్ళి పూజలో ఉపయోగించుకుంటారు. మరికొందరు తమ కుటుంబ సభ్యుల అస్థికలు గంగా నదిలో నిమజ్జనం చేస్తారు. అలా ఎందుకు చేస్తారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం

హిందూ శాస్త్రాల ప్రకారం చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం అంటే ఆ వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందేందుకు ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. శరీరం ఆత్మకు కేవలం ఒక పాత్ర లాంటిది. శరీరాన్ని కాల్చడం ద్వారా ఆత్మ తన భూసంబంధమైన బంధాల నుంచి విముక్తి పొందుతుంది. మోక్షం వైపు తన తదుపరి ప్రయాణం ప్రారంభిస్తుంది. దహన సంస్కారాల తర్వాత బూడిద, మిగిలిన అస్థికలు కుటుంబ సభ్యులు సేకరిస్తారు. ఆ అవశేషాలను నిమజ్జనం చేసేందుకు పవిత్ర నదిలో కలిపేందుకు తీసుకెళ్తారు. అస్థికలు గంగలో కలపడం అంటే అది ఒక విధిగా చేసే పని మాత్రమే కాదు. దీని వెనుక లోతైన అర్థం ఉంది.

గంగా నదిలో అస్థికలు ఎందుకు నిమజ్జనం చేస్తారు?

గంగలో అస్థికలు నిమజ్జనం చేయడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం శంతనుడు అనే రాజు గంగా నది దగ్గర ఒక అందమైన స్త్రీని చూసి ఆమెతో ప్రేమలో పడ్డాడు. అయితే ఆమె మానవ రూపంలో ఉన్న దేవత. తనను వివాహం చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది కానీ ఒక షరతు విధించింది.

తను చేసే పనుల గురించి ఎప్పుడూ ప్రశ్నించకూడదని చెప్పింది. అందుకు అంగీకరించిన తర్వాత వారి వివాహం జరిగింది. ఆ దంపతులకు చాలా మంది పుట్టారు. కానీ దేవత తనకు పుట్టిన వారందరినీ నదిలో విడిచిపెట్టింది. మొదట మౌనం వహించిన శంతనుడు తర్వాత 8వ బిడ్డను ముంచబోతున్నప్పుడు ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు ఆమె తను ఎవరు అనే విషయం వెల్లడించింది. తన పిల్లలు వసువులు అని మర్త్యులుగా పుట్టమని శాపం ఉందని తెలిపింది. వారిని గంగలో ముంచడం వల్ల శాప విముక్తులై స్వర్గానికి చేరుకున్నారని తెలిపింది.

మోక్షం పొందేందుకు

గంగా జలం పవిత్రతకు ప్రతిరూపం అందుకే ఇంటి చుట్టూ గంగా జలాన్ని చల్లుకోవడం, అస్థికలు నిమజ్జనం చేయడం వల్ల పాపాలు, మలినాలను శుభ్రపరుస్తుందని నమ్ముతారు. మానవ శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మకు మోక్షం పొందేందుకు గంగా మాత సహాయపడుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇలా అస్థికలు నిమజ్జనం చేయడం వల్ల ఆత్మ శుద్ది అవుతుంది. అస్థికలను పవిత్ర నదిలో నిమజ్జనం చేసిన తర్వాత ఆత్మ తన మార్గంలో లేదా మరణానంతర జీవితంలో ఏదైనా హింస లేదా బాధ నుండి రక్షించబడుతుందని చెబుతారు.

గంగలో అస్థికలు కలిపితే వారికి జనన మరణ పునర్జన్మ చక్రాల నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారు. ప్రతి ఒక్కరి జీవితానికి ఉండే అంతిమ లక్ష్యం మోక్షం. లేదంటే మరణించిన అనంతరం మోక్షం లభించకపోతే వాళ్ళు చేసిన పాపాలకు అనుగుణంగా మరుజన్మలో పుడతారు. అలా పునర్జన్మ లేకుండా ఉండటం కోసం మోక్షం కోసం అందరూ తాపత్రయపడతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner