Jadatva Yogam: రాహువు- బుధుడి కలయికతో జడత్వ యోగం.. ఈ రాశులకు ధన ప్రవాహమే
Jadatva yogam: ఛాయా గ్రహం రాహువు, గ్రహాల రాకుమారుడు బుధుడు కలయిక వల్ల జడత్వ యోగం ఏర్పడబోతుంది. ఇది అశుభకరమైన యోగం అయినప్పటికీ ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి ధన ప్రవాహం పెరగబోతుంది.
Jadatva yogam: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు నిర్ణీత విరామం తర్వాత రాశి చక్రాన్ని మారుస్తాయి. ఇది పన్నెండు రాశుల మీద సానుకూల, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రసూటటం గ్రహాల రాకుమారుడు బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
మార్చి 7న కుంభ రాశి నుంచి రాహువు సంచరిస్తున్న మీన రాశిలో ప్రవేశిస్తాడు. బుధుడు, రాహువు కలయిక వల్ల జడత్వ యోగం ఏర్పడబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జడత్వ యోగం ఏర్పడటం అశుభంగా పరిగణిస్తారు. మీన రాశిలో ఈ అశుభ యోగం ఏర్పడుతుంది. మీన రాశిలో రాహువు, బుధుడు కలయిక వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా ప్రయోజనం కలగబోతుంది.
కొత్త సంవత్సరం అనేక శుభ యోగాలతో పాటు ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల అశుభ యోగం రాబోతుంది. కానీ ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారిని అదృష్టవంతులని చేయబోతుంది. రాహు, బుధుడి కలయికతో ఏయే రాశుల వారికి అదృష్టం కలగబోతుందో చూద్దామా..
వృషభ రాశి
బుధుడు, రాహువు కలయిక వల్ల వృషభ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి.
తులా రాశి
ఈ రెండు గ్రహాల కలయిక వల్ల తులా రాశి వారి సంపదకు కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వస్తు సంపద పెరుగుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు కనిపిస్తాయి. సంబంధాల్లో పరస్పర అవగాహన, సమన్వయం మెరుగ్గా ఉంటాయి. జీవితాన్ని సౌకర్యవంతంగా గడుపుతారు.
కుంభ రాశి
జడత్వ యోగం అశుభకరం అయినప్పటికీ ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కుంభ రాశి వారికి సంపద పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు.
మీన రాశి
వృత్తి జీవితంలో శ్రమకు తగిన ప్రశంసలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బుధ, రాహు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే జడత్వ యోగం వల్ల ఈ రాశుల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి.
వృశ్చిక రాశి
జడత్వ యోగం వృశ్చిక రాశి వారి ఐదో ఇంట్లో ఏర్పడుతుంది. ఈ రాశి వాళ్ళు చదువు విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతారు. జీవితంలో అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉంటాయి.
మేష రాశి
ఈ రాశి వారికి జడత్వ యోగం 12వ ఇంట్లో ఏర్పడనుంది. ఏవైనా కొత్త పనులు తలపెడితే అందులో విఫలమవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి.